E-Paper
Advertisement

Supreme Court: కోర్టులో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, జాబ్ కొడితే లైఫంతా సెట్..

Supreme Court: కోర్టులో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, జాబ్ కొడితే లైఫంతా సెట్..
Advertisement

దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, 2026-27 విద్యా సంవత్సరానికి గాను భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 90 ఖాళీలతో వెలువడిన ఈ నోటిఫికేషన్, న్యాయశాస్త్ర రంగంలో తమ వృత్తిని ప్రారంభించాలనుకునే యువతకు ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది.

విద్యార్హత వివరాలివే.. 

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ (LLB) ఉత్తీర్ణులై ఉండాలి. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, సదరు అభ్యర్థులు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) గుర్తింపు పొంది ఉండటం తప్పనిసరి.

వయస్సు..

Advertisement

అభ్యర్థుల వయస్సు 2026, ఫిబ్రవరి 7వ తేదీ నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 32 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

వేతనం,  ఉద్యోగ ఎంపిక విధానం.. 

ఎంపికైన అభ్యర్థులకు సుప్రీం కోర్టు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. నెలకు రూ. 1,00,000 (అక్షరాలా ఒక లక్ష రూపాయలు) గౌరవ వేతనంగా చెల్లిస్తారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతుంది. తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి దశలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ రెండు దశల్లో అభ్యర్థి చూపిన నైపుణ్యం, చట్టపరమైన పరిజ్ఞానం ఆధారంగా తుది నియామకాలు జరుగుతాయి.

దరఖాస్తు ప్రక్రియ విధానం.. 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుముగా రూ. 750 నిర్ణయించారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి 2026, ఫిబ్రవరి 7వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.

గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరని కోర్టు వర్గాలు స్పష్టం చేశాయి.

అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులకు సహకరించడం, కేసుల పరిశోధనలో పాలుపంచుకోవడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించే ఈ ఉద్యోగం, భవిష్యత్తులో న్యాయమూర్తులుగా లేదా ప్రముఖ న్యాయవాదులుగా ఎదగాలనుకునే వారికి ఒక గొప్ప పునాదిగా మారుతుంది. మరిన్ని వివరాల కోసం సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.sci.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×