E-Paper
Advertisement

గుండెల్ని పిండేసే ఎమోషన్… నాన్న ప్రేమ కోసం పిల్లల ఆరాటం… ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ

గుండెల్ని పిండేసే ఎమోషన్… నాన్న ప్రేమ కోసం పిల్లల ఆరాటం… ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ
Advertisement

Family Drama OTT : ఓటీటీలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఒక సినిమా గుండెను పిండేస్తోంది. ఇది హృదయానికి హత్తుకునే ఒక కుటుంబ కథా చిత్రం. ఈ సినిమా ఉత్తరాఖండ్‌లోని ఒక చిన్న కొండ ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. అక్కడి అందమైన కొండ ప్రాంతాల్లో ఉండే ప్రకృతి దృశ్యాలు మనల్ని ఒక అందమైన లోకంలోకి కూడా తీసుకెళ్తాయి. ఈ కథలో భార్యను కోల్పోయిన ఒక వ్యక్తి, తన ఇద్దరు పిల్లల కోసం మంచి భవిష్యత్తును అందించాలని సిటీకి వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో కథ కన్నీళ్ళు పెట్టిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2024లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా పేరు ‘టిక్డామ్’ (Tikdam). వివేక్ అంచాలియా దీనిని దర్శకత్వం వహించారు. ఇది 2024 ఆగస్టు 23న విడుదలైంది. ఇందులో అమిత్ సియాల్, అరిష్త్ జైన్, ఆరోహి సౌద్, దివ్యాన్ష్ ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో చైల్డ్ ఆర్టిస్టులుగా అరిష్త్ జైన్, ఆరోహి సౌద్ నటన సినిమాకు ప్రాణం పోసిందని అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ భాషలో మాత్రమే JioHotstar లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలోని పాటలు కూడా చాలా వినసొంపుగా ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు డానియల్ బి. జార్జ్ దీనికి సంగీతం అందించారు. సినిమా సుమారు 1 గంట 57 నిమిషాల పాటు, ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. దీనికి ఐయండిబిలో 7.7 అద్భుతమైన రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక పచ్చని కొండ ప్రాంతం.. అక్కడ ప్రకాష్ అనే ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలు, ముసలి తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. ప్రకాష్ భార్య చనిపోవడంతో, ఆయనే పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ. అయితే ఆ ఊరిలో సరైన సంపాదన లేక, ఉన్న హోటల్ కూడా మూతపడటంతో ప్రకాష్‌కి కష్టాలు మొదలవుతాయి. పిల్లల చదువుల కోసం, మంచి భవిష్యత్తు కోసం కడుపు నిండా బాధ ఉన్నా సరే.. తన కుటుంబాన్ని ఊర్లోనే వదిలేసి, పట్నం వెళ్ళి ఉద్యోగం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు.

అయితే తండ్రి అంటే ప్రాణమిచ్చే ఆ ఇద్దరు పిల్లలకు ఆయన పట్నం వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. నాన్న వెళ్ళిపోతే మేమెలా అని వాళ్ళు తెగ బాధపడిపోతారు. అప్పుడే వాళ్ల బుర్రల్లో ఒక ఐడియా వెలుగుతుంది. తమ ఊరిలోనే నాన్నకి ఏదో ఒక పని దొరికితే బాగుంటుందని, రకరకాల గమ్మత్తైన ప్లాన్లు వేస్తారు. వాళ్ళు చేసే పనులు నవ్వు తెప్పిస్తూనే, కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేస్తాయి. చివరికి ఆ చిన్న పిల్లలు వేసిన ప్లాన్లు ఫలించాయా ? పట్నం వెళ్లాలనుకున్న తండ్రి మనసు మారిందా? అనేది నిగిలిన కథ.

Advertisement

Read Also : నమ్మించి మోసం చేసిన ప్రేయసి… పగ తీర్చుకోవాలని ఎదురు చూసే ప్రియుడు… ఆకట్టుకునే క్లైమాక్స్

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×