E-Paper
Advertisement

సంగీతం కోసం దెయ్యంతో దోస్తీ… అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టే డైరీ… వణికిస్తున్న స్టోరీ

సంగీతం కోసం దెయ్యంతో దోస్తీ… అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టే డైరీ… వణికిస్తున్న స్టోరీ
Advertisement

Psychological horror thriller : ఓటీటీలో ఒక సైకలాజికల్ హారర్ సినిమాను, ఆడియన్స్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో తీసినా, మ్యూజిక్ పరంగా సాగే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా పియానో సంగీతం చుట్టూ తిరిగే ఈ కథలో ఒక ఆర్టిస్ట్ అగ్రస్థానానికి చేరుకోవడానికి పడే తపన, ఆ క్రమంలో వచ్చే మానసిక ఒత్తిడిని ఈ సినిమా చాలా ఉత్కంఠంగా చూపిస్తుంది. దీని క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ సినిమా పేరు ‘నోక్టన్’ (Nocturne). 2020లో వచ్చిన ఈ సినిమా ‘వెల్కమ్ టు ది బ్లమ్‌హౌస్’ సిరీస్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రముఖ హారర్ చిత్రాల నిర్మాణ సంస్థ ‘బ్లమ్‌హౌస్’ దీనిని నిర్మించింది. ఈ చిత్రానికి జు క్విర్క్ దర్శకత్వం వహించగా, ఇది ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. ఇందులో జూలియట్‌గా నటించిన సిడ్నీ స్వీనీ తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఒక సాదాసీదా అమ్మాయి అసూయతో ఎలా రాక్షసిలా మారుతుందో ఆమె నటన సినిమాకు హైలెట్ గా ఉంటుంది. వివియన్ పాత్రలో మాడిసన్ ఐస్‌మాన్ నటన కూడా మెచ్చుకోలుగా ఉంటుంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఒక ఇంట్లో జూలియట్, వివియన్ అనే ఇద్దరు కవల పిల్లలు ఉంటారు. ఇద్దరూ పియానో వాయించడంలో దిట్ట. కానీ వివియన్ కి అదృష్టం, టాలెంట్ ఎక్కువ ఉండి అందరితో శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది. మన జూలియట్ మాత్రం ఎంత కష్టపడినా ఎవడూ పట్టించుకోడు. దీంతో జూలియట్‌కి లోలోపల తన సొంత చెల్లెలి మీదనే ఒక రకమైన కుళ్లు, అసూయ పుడుతుంది. నేను కూడా అందరితో శభాష్ అనిపించుకోవాలనే కసి పెరిగిపోతుంది ఆమెలో. ఇలాంటి టైమ్‌లో, ఆ కాలేజీలో చనిపోయిన ఒక పాత స్టూడెంట్ రాసుకున్న ఒక వింత డైరీ జూలియట్‌కి దొరుకుతుంది. ఆ పుస్తకంలో పిచ్చి పిచ్చి బొమ్మలు, ఏవేవో మంత్రాల లాంటివి ఉంటాయి. జూలియట్ ఆ పుస్తకంలో ఉన్నవి ఫాలో అవ్వడం మొదలుపెడుతుంది.

సీన్ కట్ చేస్తే.. మెల్లమెల్లగా జూలియట్ పియానో వాయించడంలో చెలరేగిపోతుంది, తన చెల్లెలిని కూడా దాటేస్తుంది. కానీ ఆ పుస్తకం వల్ల ఆమెకి అదృష్టంతో పాటు ఒక పెద్ద పీడకల కూడా మొదలవుతుంది. ఆ పుస్తకంలో బొమ్మలు ఉన్నట్టే జూలియట్ జీవితంలో కూడా వింత వింత దారుణాలన్నీ జరుగుతుంటాయి. చివరికి ఏమవుతుందంటే, నెంబర్ వన్ ప్లేస్ కోసం జూలియట్ ఎంతకైనా తెగిస్తుంది. తన చెల్లెలి అవకాశాలని తన్నేయడమే కాకుండా, తన మనశ్శాంతిని కూడా కోల్పోతుంది. ఆ పుస్తకంలోని చివరి బొమ్మ ప్రకారం, పెద్ద స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చి అందరి చప్పట్లు కొట్టించుకోవాలనే పిచ్చితో ఆమె ఒక బలి ఇవ్వాల్సి వస్తుంది. దీంతో క్లైమాక్స్ పీక్స్ కి వెళ్తుంది. చివరికి ఆమె ఎవరిని బలి ఇస్తుంది ? ఆ డైరీ వల్ల ఇంకెన్ని దారుణాలు జరుగుతాయి ? దాని నుంచి జూలియట్‌ బయట పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : నమ్మించి మోసం… క్లైమాక్స్ వరకు క్రేజీగా సాగే భార్యాభర్తల గిల్లికజ్జాలు

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×