E-Paper
Advertisement

శాపగ్రస్త యువరాణితో అహంకారంతో కొట్టుకునే హీరో… యాక్షన్ తో దుమ్మురేపే పీరియాడిక్ డ్రామా

శాపగ్రస్త యువరాణితో అహంకారంతో కొట్టుకునే హీరో… యాక్షన్ తో దుమ్మురేపే పీరియాడిక్ డ్రామా
Advertisement

Fantasy Adventure Movie on OTT : గత ఏడాది వచ్చిన ఒక రష్యన్ ఫాంటసీ మూవీ ఓటీటీలో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఫాంటసీ మూవీ. ఇందులో హీరో ఫినిస్ట్ అనే ఒక గొప్ప యోధుడు, తనకంటే బలవంతుడు ఎవరూ లేరని కొంచెం గర్వంగా ఉంటాడు. తన ధైర్యాన్ని అందరికీ చూపించాలని తన అసిస్టెంట్‌తో కలిసి వింత వింత దేశాలకు సాహసయాత్ర చేస్తాడు. అక్కడ అతనికి అద్భుతమైన శక్తులున్న మనుషులు, వింత జీవులు ఎదురవుతాయి. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో, కళ్ళు చెదిరే విజువల్స్‌తో సాగే ఈ సినిమాలో మంచి యాక్షన్‌తో పాటు మధ్య మధ్యలో వచ్చే కామెడీ కూడా భలే సరదాగా ఉంటుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ రష్యన్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా పేరు ‘ఫినిస్ట్: ద ఫస్ట్ వారియర్’ (Finist. The First Warrior). ఇది రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన “ద లాస్ట్ వారియర్” (The Last Warrior) సినిమా సిరీస్‌కు ప్రీక్వెల్. ఇందులో కిరిల్ జైట్సేవ్, యులియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దిమిత్రి డయాచెంకో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది జనవరి 1, 2025న రష్యాలో గ్రాండ్‌గా విడుదలైంది. రష్యన్ జానపద కథలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా కామెడీ, ఫాంటసీ, అడ్వెంచర్ మిక్స్ చేసి తీయడంతో, ఇది అన్ని వర్గాల వారికి ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ప్రస్తుతం రష్యన్ రీజియన్‌లోని Okko, Premier వంటి ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బెలోగోర్యే అనే మాయా లోకంలో ఫినిస్ట్ అంటే అందరికీ తెలిసిన ఒక పెద్ద సూపర్ హీరో. అతను చాలా బలవంతుడు, అందగాడు, కానీ కొంచెం గర్వం కూడా ఎక్కువే. తనకి తిరుగులేదని, తనకంటే గొప్ప యోధుడు ఎవరూ లేరని అతను ఎప్పుడూ ఫీలవుతుంటాడు. తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి, ప్రజలందరూ తనని మెచ్చుకోవాలని ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. కానీ బెలోగోర్యేలో తనకు సరైన ప్రత్యర్థి లేడని భావించిన ఫినిస్ట్, ఏదైనా కొత్తగా చేయాలని ఫిక్స్ అవుతాడు. అందుకే తనను తాను నిరూపించుకోవడానికి తన నమ్మకస్తులైన అసిస్టెంట్ లతో కలిసి దూరంగా ఉన్న దేశాలకు ప్రయాణం కడతాడు. అయితే అక్కడ తనకి అస్సలు తెలియని వింత శక్తులు, కొత్త రకం శత్రువులు ఎదురవుతారు.ఈ ప్రయాణంలో ఫినిస్ట్ శత్రువులతోనే కాదు, తనలోని లోపాలతో కూడా పోరాడాల్సి వస్తుంది. ఒంటరిగా గెలవడం కంటే, తోటివారి సహాయం తీసుకోవడం ఎంత ముఖ్యమో అతను అర్థం చేసుకుంటాడు. గొప్ప యోధుడు అంటే కేవలం బలం ఉండటమే కాదు, మంచి మనసు కూడా ఉండాలని తెలుసుకోవడమే ఈ సినిమా అసలు కథ.

Read Also : ఆర్మీ అధికారి గుండెల్లో తుఫాను రేపిన సుందరి… బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కొరియన్ డ్రామా

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×