E-Paper
Advertisement

కలవరపరిచే కథ… ఒక్కసారి చూస్తే క్లైమాక్స్ ను జన్మలో మర్చిపోలేరు మావా

కలవరపరిచే కథ… ఒక్కసారి చూస్తే క్లైమాక్స్ ను జన్మలో మర్చిపోలేరు మావా
Advertisement

Mystery Thriller Series OTT : ఓటీటీలో కొన్ని సిరీస్ లు చాలా ఆసక్తిగా సాగుతుంటాయి. మధ్యలో వచ్చే ట్విస్ట్లు చూశాక మైండ్ బెండ్ కూడా అయిపోతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక ఊరి జనం భక్తి ముదిరిపోయి పిచ్చోళ్లయిపోతే ఎలా ఉంటుందో ఇందులో చూడొచ్చు. ఎక్కడో మూలన ఉన్న ఒక చిన్న దీవిలోకి ఒక చర్చికి కొత్త ఫాదర్ వస్తాడు. ఆయన వచ్చాక ఆ ఊర్లో వింత వింత అద్భుతాలు జరుగుతాయి. ఇదంతా దేవుడి మహిమే అని సంబరపడిపోతుంటారు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంటుంది. క్లైమాక్స్ లో అయితే చూసేవాళ్ళు పిచ్చెక్కిపోతారు. ఆ పిచ్చితో ఊరంతా ఎలా నాశనమైపోయిందో కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ హారర్ మిస్టరీ వెబ్ సిరీస్ పేరు ‘మిడ్‌నైట్ మాస్’ (Midnight Mass). దీనిని ప్రముఖ దర్శకుడు మైక్ ఫ్లానగన్ రూపొందించారు. ఇందులో హామిష్ లింక్లేటర్, కేట్ సీగెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2021లో ఇది కేవలం 7 ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్ గా వచ్చి సూపర్ హిట్ అయింది కూడా. దర్శకుడు మైక్ ఫ్లానగన్ తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ కథను ఆయన పదేళ్ల క్రితమే రాసుకున్నారు. అందుకే ఆయన తీసిన పాత సినిమాలు ‘హుష్’, ‘జెరాల్డ్స్ గేమ్’లలో కూడా ఈ ‘మిడ్‌నైట్ మాస్’ అనే పుస్తకం ఒక రిఫరెన్స్‌గా కనిపిస్తుంది. కోవిడ్ సమయంలో షూటింగ్ జరిగినప్పటికీ, అత్యుత్తమ నిర్మాణ విలువల వల్ల ఈ సిరీస్ అనేక విమర్శకుల ప్రశంసలు, అవార్డులను అందుకుంది. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో మీరు చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ క్రాకెట్ ఐలాండ్ అనే ఒక చిన్న దీవిలో మొదలవుతుంది. అక్కడ జనాభా చాలా తక్కువ, ఉన్నవాళ్లంతా చేపల వేట మీద ఆధారపడి బతుకుతుంటారు. అలాంటి చోటికి పాల్ అనే ఒక కొత్త ఫాదర్ వస్తాడు. ఆయన వచ్చినప్పటి నుండి ఆ ఊరిలో ఊహించని వింతలు జరుగుతుంటాయి. నడవలేని ఒక అమ్మాయి అకస్మాత్తుగా నడవడం, ముసలివాళ్లు మళ్లీ యవ్వనంగా మారడం వంటివి చూసి, ఆ దేవుడే తమ ఊరిని కరుణించాడని అందరూ నమ్ముతారు. ఊరంతా ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది.అయితే ఈ అద్భుతాల వెనుక ఒక భయంకరమైన రహస్యం ఉంటుంది. ఫాదర్ పాల్ తీసుకువచ్చిన ఆ శక్తి దేవుడి ప్రసాదం కాదు, అది ఒక రకమైన రక్తపిపాసి నుంచి వచ్చిన రక్తమని నెమ్మదిగా అర్థమవుతుంది.

ఆ రక్తం తాగిన వాళ్లకు రోగాలు నయమైపోయి శక్తి వస్తుంది. కానీ వాళ్లు వెలుతురులోకి రాలేరు అలాగే రక్తం కోసం ఆకలితో అలమటిస్తుంటారు. భక్తి పేరుతో ఆ ఫాదర్ ఊరి జనాన్ని ఎలా తప్పుదోవ పట్టించారనేది చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చివరికి ఆ దీవిలో ఉండే కొందరు వ్యక్తులు ఈ ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. క్లైమాక్స్ మాత్రం ఊహకు అందని విధంగా ఉంటుంది. అసలు ఆ రక్తపిపాసి కథ ఏమిటి ? ఊరి జానాలు ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తానికి మతం పేరుతో చేసే పిచ్చి పనులు ఎలా ప్రాణాల మీదకు వస్తాయో ఈ సిరీస్ చూపిస్తుంది.

Advertisement

Read Also : ఆర్మీ అధికారి గుండెల్లో తుఫాను రేపిన సుందరి… బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన కొరియన్ డ్రామా

Tags

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×