E-Paper
Advertisement

ఇదేం సిరీస్ రా నాయనా… ఆ హాస్టల్ లో అంతా సైకోలు

ఇదేం సిరీస్ రా నాయనా… ఆ హాస్టల్ లో అంతా సైకోలు
Advertisement

Psychological thriller OTT : ఒక కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తోంది. ఇందులో దెయ్యాలు, భూతాలు ఉండవు కానీ, మనుషుల రూపంలో ఉండే అసలు సిసలు మృగాలు కనిపిస్తాయి. చుట్టూ ఉన్న మనుషులు ఎంత క్రూరంగా ఉంటారో, ఒక మనిషిని పిచ్చోడిని చేయడానికి వాళ్లు ఏం చేస్తారో ఈ కథలో కనిపిస్తుంది. నరకం అంటే ఎక్కడో ఉండదు, మన పక్కన ఉండే మనుషులే మనకు నరకాన్ని చూపిస్తారని ఈ సిరీస్ నిరూపిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ చూస్తే ఎవరికైనా బుర్ర తిరిగిపోవాల్సిందే. దీనిని చూస్తున్నంత సేపు ఏదో తెలియని టెన్షన్, భయం వెంటాడుతూనే ఉంటాయి. ఇది చూశాక మన పక్కన ఉండే వాళ్ళని నమ్మాలన్నా కూడా ఒక నిమిషం భయం వేస్తుంది, అంత డార్క్ గా ఉంటుంది ఈ కథ. దీనికి ఐయండిబిలో 7.8 అద్భుతమైన రేటింగ్ కూడా ఉంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కొరియన్ సిరీస్ పేరు ‘హెల్ ఈజ్ అదర్ పీపుల్’ (Hell Is Other People), ఇది 2019లో వచ్చిన ఒక అద్భుతమైన సిరీస్ ఇది. ఇది ‘స్ట్రేంజర్స్ ఫ్రమ్ హెల్’ అనే ఫేమస్ వెబ్‌టూన్ ఆధారంగా తీశారు. కొరియాలో ఆ వెబ్‌టూన్‌కి దాదాపు 80 కోట్ల వ్యూస్ ఉన్నాయి. దాన్ని స్క్రీన్ మీదకి అంతే భయంకరంగా తీసుకొచ్చారు. ఇందులో యూన్ జోంగ్-వూ (హీరో), సియో మూన్-జో (విలన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో విలన్ పాత్రలో నటించిన లీ డాంగ్-వూక్, మామూలుగా లవ్ స్టోరీల్లో సాఫ్ట్ రోల్స్ వేస్తుంటాడు. కానీ ఇందులో ఒక సైకో డెంటిస్ట్ పాత్రలో ఆయన చూపు చూస్తేనే వణుకు పుడుతుంది. 10 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరో రచయిత అవుదామని ఆశతో సిటీకి వస్తాడు. అయితే పైసలు లేక ఒక పాత హాస్టల్‌లో చేరతాడు. ఆ హాస్టల్ ఎలా ఉంటుందంటే.. పగలే దెయ్యాలు తిరుగుతాయేమో అన్నట్టు చీకటిగా, ఇరుకుగా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కో రకం సైకో లా ఉంటాడు. ఒకడు ఎప్పుడూ వింతగా నవ్వుతుంటాడు, ఇంకొకడు ఎప్పుడూ గొడవపడుతుంటాడు. ఆ హాస్టల్ ఓనర్ కూడా బయటకి మంచిగా కనిపిస్తూనే, లోపల ఏదో ప్లాన్ వేస్తున్నట్టు వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇక కథలో అదే హాస్టల్‌లో ఒక డెంటిస్ట్ ఉంటాడు. వాడు చూడటానికి చాలా స్టైలిష్‌గా, బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు.

అయితే ఇందులో అసలు విలన్ అతనే. అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి లీడర్ లా ఉండే ఒక పెద్ద సైకో అతను. ఆ హాస్టల్‌లో ఉన్నవాళ్లంతా కలిసి అక్కడ ఉండే కొత్తవాళ్లను టార్గెట్ చేసి చంపేస్తుంటారని హీరోకి అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ డెంటిస్ట్ హీరోని తనలాంటి ఒక సైకోలా మార్చాలని ఫిక్స్ అయిపోతాడు. వాడి మాటలతో, పనులతో హీరోని పిచ్చోడిని చేస్తూ, వాడిలోని సైకోని బయటకు తీయడానికి ట్రై చేస్తుంటాడు. చివరికి ఆ నరకం లాంటి హాస్టల్‌లో హీరో ప్రాణాలతో మిగిలాడా ? వాళ్ళ చేతుల్లో బలి అయ్యాడా ? అనేదే ఈ సిరీస్ క్లైమాక్స్.

Advertisement

Read Also : ఓటీటీలోకి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్… ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళ మూవీ తెలుగులోనూ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×