UPI Fail Compensation| భారతదేశంలో అతి వేగంగా, సులభంగా డిజిటల్ పేమెంట్ చేసే పద్ధతి యుపిఐ. ప్రజలు నిత్య జీవితంలో కిరాణా, ట్రాన్స్‌పోర్ట్, బిల్లులు, ఆన్‌లైన్ షాపింగ్ కోసం గూగుల్ పే, ఫోన్‌పే, పేటిఎం వంటి యుపిఐ యాప్స్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లతో పేమెంట్లు చాలా సులభంగా జరుగుతాయి. కానీ కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఈ కారణంగా యూజర్లు చాలా ఇబ్బండి పడతారు. ముఖ్యంగా డబ్బు అకౌంట్ నుంచి తగ్గిపోయి, రిసీవర్‌కు చేరకపోతే భయపడతారు. డబ్బు పోయిందేమో అని ఆందోళన చెందుతారు. కానీ ఈ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) స్పష్టమైన నియమాలు జారీ చేసింది. ఈ నియయాలే యుపిఐ యూజర్లను రక్షిస్తాయి. ఫెయిల్ అయిన పేమెంట్లకు రిఫండ్ తో పాటు అదనపు కాంపెన్సేషన్ కూడా లభిస్తుంది.
యుపిఐ ట్రాన్సాక్షన్ (లావాదేవి) ఫెయిల్ అంటే మీ అకౌంట్ నుంచి డబ్బు తగ్గిపోతుంది కానీ మర్చంట్ (షాప్ కీపర్) లేదా రిసీవర్‌కు చేరదు. అలాంటి సమయంలో బ్యాంకులు లేదా UPI యాప్‌లు త్వరగా సమస్యను పరిష్కరించాలి. చాలాసార్లు ఫెయిల్ ట్రాన్సాక్షన్లు ఒక వర్కింగ్ డేలోపు ఆటోమేటిక్‌గా రివర్స్ అవుతాయి. కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లోనే రిఫండ్ వస్తుంది. కానీ సర్వర్ సమస్యలు లేదా టెక్నికల్ ఎర్రర్ల వల్ల ఆలస్యం అవుతుంది. ఇలాంటి ఆలస్యాలకు RBI నియమాల ప్రకారం కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం లభిస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది. NPCI కూడా ఈ నియమాలను అమలు చేస్తుంది. బ్యాంకులు, UPI యాప్‌లు ఫెయిల్ ట్రాన్సాక్షన్లను నిర్దిష్ట సమయంలోపు పరిష్కరించాలి. అలా చేయకపోతే యూజర్లకు డబ్బు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది ఒరిజినల్ రిఫండ్ కాదు, అదనపు మొత్తం. బ్యాంక్ లేదా UPI సర్వీస్ ప్రొవైడర్ తప్పు చేస్తే మాత్రమే ఈ కాంపెన్సేషన్ వర్తిస్తుంది.
రిఫండ్ తగిన సమయం కన్నా ఆలస్యమైతే యూజర్లకు నష్టపరిహారం వస్తుంది. టెక్నికల్ సమస్యలు, సర్వర్ డౌన్ టైమ్, సిస్టమ్ ఎర్రర్లు ఉంటే కాంపెన్సేషన్ ఇస్తారు. బ్యాంక్ లేదా UPI ప్రొవైడర్ బాధ్యత తీసుకోవాలి. యూజర్ ఫిర్యాదు చేస్తే మాత్రమే ఇది లభిస్తుంది. యూజర్ తప్పు చేస్తే (తప్పు UPI ID ఇవ్వడం వంటివి) నష్టపరిహారం రాదు.
ఎన్ని రోజులు ఆలస్యం ఉంటే అంత మొత్తం నష్టపరిహారం ఇస్తారు. RBI ప్రకారం ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.100 చొప్పున పెనాల్టీ ఉంటుంది. ఈ మొత్తం సర్వీస్ ప్రొవైడర్ నుంచి యూజర్ అకౌంట్‌కు నేరుగా వస్తుంది. ఇది చిన్న మొత్తమే అయినా, బ్యాంకులు జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది.
ముందుగా మీ UPI యాప్‌ని ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్లండి. ఫెయిల్ అయిన పేమెంట్‌ని సెలెక్ట్ చేయండి. “హెల్ప్” లేదా “రిపోర్ట్ ప్రాబ్లమ్” ఆప్షన్ క్లిక్ చేయండి. UTR నంబర్ లేదా ట్రాన్సాక్షన్ ID సరిగ్గా ఎంటర్ చేయండి. ఇది ఫిర్యాదు త్వరగా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. చాలా సమస్యలు కొన్ని వర్కింగ్ డేస్‌లోపు పరిష్కారమవుతాయి.
అన్ని ఫెయిల్ ట్రాన్సాక్షన్లకు కాంపెన్సేషన్ రాదు. తప్పు UPI ID ఎంటర్ చేస్తే, యూజర్ నెట్‌వర్క్ సమస్య వల్ల ఫెయిల్ అయితే రాదు. ఆటోమేటిక్ ఇన్‌స్టంట్ రివర్సల్ అయితే కూడా పెనాల్టీ లేదు. ప్రొవైడర్ సైడ్ ఎర్రర్ మాత్రమే ఉంటేనే నష్టపరిహారం వర్తిస్తుంది.
యాప్ సహాయం చేయకపోతే మీ బ్యాంకుకు నేరుగా కాంటాక్ట్ చేయండి. బ్యాంకు కూడా సమస్య పరిష్కరించకపోతే NPCIకి ఎస్కలేట్ చేయండి. RBI అధికారిక గ్రీవెన్స్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయవచ్చు. అధికారులు నిజమైన కేసులను సీరియస్‌గా తీసుకుంటారు. అర్హత ఉన్న యూజర్లకు రిఫండ్ తో పాటు కాంపెన్సేషన్ కూడా వస్తుంది.
Also Read: ఛార్జింగ్ సమయంలో పేలిన గెలాక్సీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. శాంసంగ్ ఏం చెప్పిందంటే
పేమెంట్ చేసేముందు UPI ID రెండుసార్లు చెక్ చేయండి. ట్రాన్సాక్షన్ సమయంలో స్టేబుల్ ఇంటర్నెట్ ఉండేలా చూడండి. పేమెంట్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు యాప్ మూసివేయకండి. ప్రతి ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. కంప్లైంట్ చేసేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి.