March Clash: మార్చిలో బిగ్ సినిమాల జాతర రాబోతుంది. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన్ రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ అయితే ఇప్పటికే కేజీఎఫ్ సినిమాతో దేశం మొత్తం తన వైపు తరిగేలా చేసిన యష్ సినిమా ‘టాక్సిక్’ ఇప్పటికే టాక్సిక్ నుంచి విడుదలైన్ ఇంట్రో గ్లింప్స్ సంచలనం క్రియేట్ చేశాయి. ఈ రెండు సినిమాలు మార్చి 19, 2026 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి. వీరికి పోటీగా టాలీవుడ్ పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో మార్చిలో రావడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా మార్చి 27 వచ్చేందుకు సిద్దమౌతుంది. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలతో పవన్ సినిమా పోటీపడనుంది.
మార్చి 19, 2026న ఇద్దరు భారీ స్టార్ల సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రానున్నాయి. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని, రణవీర్ పాత్ర గతంలో చూడని విధంగా ఉంటుందని టాక్. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిన యష్, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఇంట్రో గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. “ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా యష్ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Read also-Upcoming Web Series OTT : బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ హిట్ సిరీస్ ఓటీటీలోకి… ఎక్కడ చూడవచ్చు అంటే ?
ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల జోరు కొనసాగుతుండగానే, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాకను ఖరారు చేశారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఆయన చిత్రం మార్చి 26న, కానీ మార్చి 27న కానీ విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓజీ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న పవన్ మరోసారి ఈ సినిమాతో తన సత్తా ఏమిటో చూపించనున్నారు. 2025లో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ టాలీవుడ్ ఓ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న రెండు పాన్ ఇండియా సినిమాలు పవన్ కళ్యాణ్ ముందు తెలుగులో తట్టుకోగలవా అన్నది చూడాల్సి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా రావాల్సి ఉంది.