IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభానికి కౌంట్ డౌన్ షురూ అయింది. మరో మూడు రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సజావుగా సాగుతున్నాయి. అయితే ఐపిఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉంటుంది. మార్చి 28వ తేదీన చిన్న స్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే జనాలందరూ టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మార్చి 28వ తేదీన జరగబోయే ఈ తొలి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) భాగంగా తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ ( Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad ) జట్ల మధ్య ఉంటుంది. అయితే ఈ తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం ( Chinna swamy stadium) వేదికగా జరగనున్న నేపథ్యంలో, ఆ రోజున బెంగళూరులో భారీ వర్షం ( Rain) పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 28వ తేదీన 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినప్పటికీ, సాయంత్రం మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మార్చి 26వ తేదీన సాయంత్రం 60 శాతం నుంచి 70% వరకు వర్షపాతం నమోదయ్య ప్రమాదం ఉంది.
ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో మ్యాచ్ ఆగిపోయే ప్రమాదం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ భారీ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే, అభిమానులకు ఊహించని షాక్ తగిలే ప్రమాదం ఉంది. అయితే కొద్దిపాటి వర్షం పడితే మాత్రం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. మరి మార్చి 28వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి. మొదటి మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. వేలకు వేలు డబ్బులు పెట్టి టికెట్లు కొనుగోలు చేశామని చెబుతున్నారు. వరుణ దేవుడు కరుణించి మ్యాచ్ జరిగేలా చూడాలని కోరుతున్నారు అభిమానులు. ఇది ఇలా ఉండగా, ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ (SRH) కెప్టెన్ గా ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఇచ్చారు కావ్య పాప.
Star Sports poster for ipl opening match RCB vs SRH 🔥#IshanKishan pic.twitter.com/kPsidlTJnO
— Ayush Cricket (@AyushCricket32) March 20, 2026