E-Paper
Advertisement

February Tamil OTT releases : నెక్స్ట్ మంత్ ఓటీటీలో తమిళ సినిమాల జాతర… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు

February Tamil OTT releases : నెక్స్ట్ మంత్ ఓటీటీలో తమిళ సినిమాల జాతర… ఆ రెండూ అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

February Tamil OTT releases : జనవరిలో పొంగల్ పండుగ సీజన్‌లో జన నాయగన్ విడుదల అనుకున్నట్లుగా జరుగుతుందని భావించినప్పటికీ, విజయ్ సినిమా ఊహించని విధంగా వాయిదా పడటంతో మిగతా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ సినిమాలు వచ్చే నెలలో ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా పేర్లు ఏమిటి ? ఏ ఓటీటీలలో వచ్చే అవకాశం ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

‘పరాశక్తి’

దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ ఒక పీరియాడికల్ పొలిటికల్ డ్రామా. శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించగా, అధర్వ, రవి మోహన్ శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ కథ 1960ల నాటి కాలంలో తమిళనాడులో జరిగిన హిందీ భాష వ్యతిరేక ఆందోళనల చుట్టూ తిరుగుతుంది. శివకార్తికేయన్ ఈ 25వ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించారు. ఇది ZEE5 లో తొందర్లోనే రాబోతోంది.

‘వా వాతియార్’

Advertisement

‘వా వాతియార్’ కామెడీ డ్రామాలో కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ కథ MGR వీరాభిమానితో మొదలవుతుంది. రాజ్ కిరణ్, కృతి శెట్టి, సత్యరాజ్, ఆనంద్ రాజ్ ఈ సినిమాలో మిగతా పాత్రల్లో నటించారు. ఇది ప్రైమ్ వీడియోలో వచ్చే నెల వచ్చే అవకాశం ఉంది.

‘తలైవర్ తంబి తలైమయిల్’

జీవా నటించిన ‘తలైవర్ తంబి తలైమయిల్’ గ్రామీణ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్. నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెళ్లిళ్లను పర్యవేక్షించే స్థానిక పంచాయతీ నాయకుడి చుట్టూ తిరుగుతుంది. అయితే ఒక రోజు పక్కింటి ఇంట్లో మరణం సంభవించినప్పుడు, అదే ఇంటికి పొరుగున వివాహం జరుగుతుండటంతో స్టోరీ ఆసక్తిగా మారుతుంది. ఇందులో తంబి రామయ్య, ఇళవరసు, ప్రార్థన నాథన్, జెన్సెన్ దివాకర్, జైవంత్, సర్జిన్ కుమార్, రాజేష్ పాండియన్, సుభాష్ కన్నన్, అమిత్ మోహన్, అనురాజ్ నటించారు.

‘హాట్ స్పాట్ 2’

Advertisement

‘హాట్ స్పాట్ 2’ ఇది విఘ్నేష్ కార్తీక్ మునుపటి చిత్రం హాట్ స్పాట్ కి సీక్వెల్. రెండవ భాగంలో ప్రియా భవానీ శంకర్, ఎంఎస్ బాస్కర్, తంబి రామయ్య, రక్షన్, అశ్విన్ కుమార్, ఆదిత్య బాస్కర్, భవానీ శ్రీ, బ్రిగిడా సాగా, సంజన తివారీ వంటి పెద్ద తారాగణం ఉంది. మొదటి భాగం లాగానే, హాట్ స్పాట్ 2 కూడా ఆకట్టుకుంటుంది.

‘ద్రౌపతి 2’

మోహన్ జి దర్శకత్వంలో వచ్చిన ‘ద్రౌపతి 2’ కథ, భారతదేశంలో ఒకప్పుడు ఉన్న రాజ్యాలు, మొఘల్ పాలకుల దండయాత్రల నేపథ్యంలో ఉంటుంది. ఇందులో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్, నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా నటించారు.

Read Also : దున్నపోతును బలి తీసుకునే దెయ్యం బొమ్మ … అఘోరాలకే దిమ్మతిరిగే హారర్ స్టోరీ

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×