E-Paper
Advertisement

Horror Thriller Movie : దున్నపోతును బలి తీసుకునే దెయ్యం బొమ్మ … అఘోరాలకే దిమ్మతిరిగే హారర్ స్టోరీ

Horror Thriller Movie : దున్నపోతును బలి తీసుకునే దెయ్యం బొమ్మ … అఘోరాలకే దిమ్మతిరిగే హారర్ స్టోరీ
Advertisement

Horror Thriller Movie : అనాదిగా వస్తున్న ఆచారం ఏదైనా ఉంది అంటే అది మూఢనమ్మకమే. ఇప్పటికీ మంత్రాలు, దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఎక్కువే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జానపద హారర్ కామెడీ మూవీ ఓటీటీలో రీసెంట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఇందులో ఒక గ్రామంలో ప్రతి ఏటా జరగాల్సిన దున్నపోతు బలి కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంది. ఆ ఆచారం ఆగిపోవడం వల్ల గ్రామంలో తలెత్తే వింత పరిస్థితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆసక్తికరమైన కథనంతో ఇది ఉంటుంది. ప్రేక్షకులు చూడాల్సిన సినిమానే ఇది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘కోన’ (Kona) జానపద నేపథ్యంలో వచ్చిన కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా 2025 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. హరి కృష్ణ ఎస్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కోమల్ కుమార్, నమ్రత గౌడ, తనిషా కుప్పండ, రఘు రామన్‌కొప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ZEE5, Airtel Xstream Play ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

Advertisement

కొన్ని శతాబ్దాల క్రితం, కొల్లూరు సరిహద్దు గ్రామాల్లో వింత పరిస్థితుల వల్ల ప్రజలు చనిపోతుంటారు. అప్పుడు ఆ గ్రామాన్ని కాపాడటానికి దేవత, దెయ్యం కలయికతో ఒక బొమ్మను ప్రతిష్టించి, దానికి ప్రతి ఏడాది దున్నపోతును బలి ఇచ్చే కోన ఆచారాన్ని మొదలు పెడతారు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఇక స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నారాయణ అనే వ్యక్తి తన భార్య లక్ష్మి అకాల మరణంతో బాధపడుతుంటాడు. ఇక జీవితం మీద విరక్తితో బయట ప్రపంచం తిరుగుతూ ఉంటాడు. ఇదే సమయంలో కొల్లూరు అనే గ్రామంలో కొన్ని కారణాల వల్ల ఏటా జరగాల్సిన కోన బలి ఆగిపోతుంది.

దీనివల్ల గ్రామంలో వింత సంఘటనలు జరుగుతూ, ప్రజలు భయాందోళనకు గురవుతారు. అదే సమయంలో నారాయణ ఆ గ్రామంలోకి వస్తాడు. ఒక వైపు పోలీసులు జంతు బలిని అడ్డుకోవాలని చూస్తుంటే, మరో వైపు గ్రామంలోని మూఢనమ్మకాల భయాల వల్ల గ్రామస్థులు ఆ ఆచారాన్ని పూర్తి చేయాలని పట్టుబడతారు. ఈ క్రమంలో నారాయణ ఆ గ్రామంలో జరిగే భయంకరమైన సంఘటనల్లో ఎలా చిక్కుకున్నాడు ? తన భార్య మరణానికి ఈ గ్రామానికి ఏమైనా సంబంధం ఉందా ? అనేదే మిగిలిన కథ.

Advertisement

Read Also :  లైవ్ లో దెయ్యాలను చూపిద్దామని వెళ్ళి అడ్డంగా బుక్… వణికించే హర్రర్ సిరీస్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×