E-Paper
Advertisement

ఓటీటీని వణికిస్తున్న హారర్ ఫ్రాంచైజీలు… వీటి పోస్టర్ చూస్తేనే మీలో భయం పడుతుంది

ఓటీటీని వణికిస్తున్న హారర్ ఫ్రాంచైజీలు… వీటి పోస్టర్ చూస్తేనే మీలో భయం పడుతుంది

Horror Movies OTT : ఓటీటీ వేదికలు వచ్చిన తర్వాత హారర్ సినిమాల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే ఇంట్లో ఒంటరిగా, చీకట్లో కూర్చుని ఈ భయంకరమైన సినిమాలు చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్‌ను ఇస్తోంది. ముఖ్యంగా కొన్ని హారర్ ఫ్రాంచైజీలు వాటి పోస్టర్లతోనే వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మీ గుండె గట్టిదైతే తప్ప చూడలేని ఆ టాప్ 5 హారర్ ఫ్రాంచైజీల వివరాల గురించి ఓ లుక్ వేద్దాం పదండి.

1. ది కంజురింగ్ యూనివర్స్ (The Conjuring Universe)

హారర్ సినిమాల అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఇది. ఎడ్, లోరైన్ వారెన్ అనే దంపతులు నిజ జీవితంలో ఎదుర్కొన్న అతీంద్రియ శక్తుల ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పటివరకు ఈ యూనివర్స్ నుండి ‘ది కంజురింగ్’, ‘అన్నాబెల్లే’, ‘ది నన్’ సిరీస్లలో కలిపి మొత్తం 8 సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో ‘కంజురింగ్ 4’ కూడా రాబోతోంది. ఇవి Netflix, Amazon Prime Videoలో అందుబాటులో ఉన్నాయి.

2. ఏలియన్ (Alien)

సైన్స్ ఫిక్షన్, హారర్ కలగలిపిన అద్భుతం ఇది. అంతరిక్షంలో ఉండే వింత జీవులు మనుషులపై దాడి చేస్తుంటాయి. అసలు వాటి రూపం చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒరిజినల్ సిరీస్, ప్రిక్వెల్స్ కలిపి మొత్తం 8 సినిమాలు ఉన్నాయి. ఇటీవల ‘ఏలియన్: రోములస్’ కూడా విడుదలైంది. ఈ సిరీస్ సినిమాలు Jio Hotstarలో స్ట్రీమ్ అవుతున్నాయి.

3. రెసిడెంట్ ఈవిల్ (Resident Evil)

జాంబీ హారర్ జానర్‌లో ఇది ఒక లెజెండరీ ఫ్రాంచైజీ. ఒక వైరస్ వల్ల మనుషులంతా వింత జీవులుగా మారడం, వాటి నుండి తప్పించుకోవడం చుట్టూ ఈ కథ నడుస్తుంది. మిలా జోవోవిచ్ నటించిన 6 సినిమాలు, ఒక రీబూట్ సినిమా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక లైవ్-యాక్షన్ సిరీస్ తో పాటు, ఒక యానిమేటెడ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ Netflix, Sony LIVలో చూడవచ్చు.

4. స్టీఫెన్ కింగ్స్ ‘ఇట్’ (Stephen King’s It)

పిల్లలను భయపెట్టే పెన్నీవైస్ అనే ఒక జోకర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ జోకర్ నవ్వు, రూపురేఖలు చూస్తే చిన్నపిల్లలే కాదు పెద్దలు కూడా వణికిపోతారు. ఇది 2 భాగాలుగా (It: Chapter One, It: Chapter Two) విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు Amazon Prime Video, Jio hotstarలో అందుబాటులో ఉన్నాయి.

5. సా (Saw)

ఇది కేవలం దెయ్యాల సినిమా కాదు, మనుషుల క్రూరత్వాన్ని చూపించే ‘సైకోలాజికల్ హారర్’. ఇందులో విలన్ జిగ్సా ఇచ్చే పజిల్స్, మనుషులను హింసించే తీరు చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 10 సినిమాలు వచ్చాయి. ప్రతి భాగం మునుపటి కంటే భయంకరంగా ఉంటుంది. వీటిని Lionsgate Play, Amazon Prime Videoలో చూడవచ్చు.

ఈ ఫ్రాంచైజీలు కేవలం భయపెట్టడమే కాదు, ఉత్కంఠభరితమైన కథనంతో మిమ్మల్ని టీవీ స్క్రీన్లకు హత్తుకుపోయేలా చేస్తాయి. మరి మీ గుండె గట్టిదైతే, ఈ వీకెండ్ వీటిని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఒక్క విషయం… లైట్లు ఆర్పేసి చూస్తే ఆ కిక్కే వేరు.

Read Also : ఈ ఏడాది ఓటీటీలో దుమ్ము లేపుతున్న దమ్మున్న సిరీస్ లు… టీవీలకే అతుక్కుపోతున్న జనాలు

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×