E-Paper
Advertisement

లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 10 నిమిషాల్లో 100 స్ట్రయిక్స్.. 89 మంది మృతి!

లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 10 నిమిషాల్లో 100 స్ట్రయిక్స్.. 89 మంది మృతి!
Advertisement

Israel Attacks Lebanon: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ కుదిరిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్ పై విరుచుకుపడింది. 10 నిమిషాల వ్యవధిలో 100 ఎయిర్ స్ట్రయిక్స్ చేసింది. ఈ దాడుల్లో 89 మంది మృతి చెందగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్సులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులతో లెబనాన్ లోని అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడి అని అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ కు చెందిన ప్రముఖ మతపెద్ద సాధిక్ అలీ నబుల్సీ మృతి చెందారు. బీరుట్ సహా పలు ముఖ్య ప్రాంతాల్లోని హెజ్బల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

హెజ్ బొల్లా గ్రూప్ లపై దాడులు

హెజ్ బొల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్స్, ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులపై హెజ్ బొల్లా గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేమని పాకిస్తాన్ చెబుతోంది. అయినప్పటికీ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు కొనసాగితే ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్ పైనా ప్రభావం పడనుంది. లెబనాన్ పై దాడులకు నిరసనగా ఇరాన్ హార్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకుంది.

కాల్పుల విరమణ నుంచి బయటకు

Advertisement

ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తే, అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఇరాన్ హెచ్చరించింది. బుధవారం హార్మూజ్ జలసంధిలో రాకపోకలను నిలిపివేసింది. హార్మూజ్ లో చిక్కుకున్న నౌకలకు ఈ జలమార్గం ఇంకా మూసివేసే ఉంటుందని ఇరాన్ నౌకాదళం తెలిపింది. ఇరాన్‌పై దాడిని రెండు వారాల పాటు నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని ఇజ్రాయెల్ చెబుతోంది. అయినప్పటికీ తమ దేశంపై దాడుల్లో హిజ్బుల్లా పాత్ర కారణంగా కాల్పుల విరమణ నిబంధనలు, షరతులు లెబనాన్‌కు వర్తించవని ఇజ్రాయెల్ చెప్పింది.

లెబనాన్ భాగం కాదు

ఇరాన్, అమెరికా ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని వైట్ హౌస్ ధృవీకరించింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఆక్సియోస్‌తో మాట్లాడుతూ.. రెండు వారాల సీజ్ ఫైర్ లో లెబనాన్ భాగం కాదని పేర్కొంది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌ కు.. ఇరాన్, లెబనాన్‌లలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఉల్లంఘనల గురించి చర్చించడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: ఇరాన్‌పై భీకర దాడులు.. యుద్దంలో గెలుస్తున్నాం, ట్రంప్ కీలక ప్రకటన

ఈ వారం చివరిలో ఇస్లామాబాద్ లో చర్చలు

లెబనాన్‌పై దాడుల కారణంగా టెహ్రాన్ అమెరికా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలగవచ్చని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంలో అరాఘ్చీ పాకిస్తానీ మధ్యవర్తులతో మాట్లాడారని ఇరాన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ఈ వారం చివరిలో అమెరికా, ఇరాన్‌ల ప్రతినిధులు చర్చల కోసం ఇస్లామాబాద్ వస్తున్నట్లు ప్రకటించింది. కాల్పుల విరమణ లెబనాన్‌తో సహా ప్రతిచోటా వర్తిస్తుందన్నారు. అయితే, లెబనాన్‌ను ఇందులో చేర్చలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. కాల్పుల విరమణ ప్రారంభమైన కొన్ని గంటలకే లెబనాన్ పై అతి పెద్ద దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది .

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×