E-Paper
Advertisement

Action Thriller OTT: మైండ్ బెండయ్యే యాక్షన్… జడిపించే జైలు జీవితం… యూత్ చూడాల్సిన మూవీ

Action Thriller OTT: మైండ్ బెండయ్యే యాక్షన్… జడిపించే జైలు జీవితం… యూత్ చూడాల్సిన మూవీ
Advertisement

Action Thriller OTT : గ్యాంగ్ వార్, జైలు జీవితం చుట్టూ ఒక థాయ్ యాక్షన్ సినిమా ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక బస్తీ పోరగాడు జైలుకు వెళ్లి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఇందులో చూపించారు. ఈ సినిమా 1990వ దశకంలో థాయ్‌లాండ్‌లోని జైళ్లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఆ కాలంలో అక్కడి గ్యాంగ్ వార్స్ ఎలా ఉండేవో ఇందులో రియలిస్టిక్ గా చూపించారు. సినిమా అంతా జైలు లోపల జరుగుతుంది. అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయ్యింది. అందుకే దీనికి మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. సినిమా మాత్రం కేక పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాను చూసి యూత్ ఎలా ఉండకూడతో నేర్చు కోవాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్

2024లో వచ్చిన ఈ థాయ్ క్రైమ్ డ్రామా సినిమా పేరు ‘ఇన్ యూత్ వి ట్రస్ట్’ (In Youth We Trust). దీనికి డైరెక్టర్ పుట్టిపాంగ్ నక్తంగ్. ఈయన గతంలో తీసిన ‘4 Kings’ అనే సినిమా థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టించింది. స్టూడెంట్ గ్యాంగ్స్, రౌడీయిజం మీద ఆయనకు మంచి పట్టు ఉంది. ఇందులో నాట్ కిచ్చరిత్, అరక్ అమొర్న్ సుపాసిరి, ఇత్క్రాన్ పుంగ్ కియత్రుస్సామీ లీడ్ రోల్స్ లో నటించారు. ఇందులో హీరోగా నటించిన నాట్ కిచ్చరిత్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అమాయకపు కుర్రాడి నుండి జైలు రౌడీగా మారే క్రమంలో అతని బాడీ లాంగ్వేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. 2 గంటల 12 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ప్యూక్ అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతను పెరిగింది అంతా మురికివాడల్లోనే. ఇంట్లో కష్టాలు, బయట గొడవలతో వాడి లైఫ్ ఎప్పుడూ రచ్చ రచ్చగానే ఉంటుంది. ఒకానొక టైమ్‌లో జరిగిన ఒక గన్ షూటింగ్ కేసులో ప్యూక్ దొరికిపోతాడు. పోలీసులు వాడిని పట్టుకుని జైలు ఊచల వెనక్కి నెట్టేస్తారు. అక్కడితో వాడి కష్టాలు తీరవు సదా, అసలు సినిమా అక్కడే మొదలవుతుంది. జైలు లోపల అడుగుపెట్టగానే ప్యూక్‌కి చుక్కలు కనిపిస్తాయి. అక్కడ ఒక్కొక్కడు ఒక్కో రకం. అక్కడ రౌడీ గ్యాంగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్యూక్‌ను పాత నేరస్తులు వేధించడం, కొట్టడం చేస్తుంటారు. అయితే ప్యూక్ మెత్తగా ఉంటే బతకలేనని అర్థం చేసుకుంటాడు. జైల్లో ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాడు కూడా ఆ క్రైమ్ ప్రపంచంలోకి దిగాల్సి వస్తుంది. చివరికి ఈ జైలు గొడవలు, గ్యాంగ్ వార్ల వల్ల ప్యూక్ ఏం సాధించాడు? అసలు ఆ నరకం నుండి బయటపడ్డాడా ? అనేదే ఈ క్లైమాక్స్.

Read Also :  పోలీసులకు చుక్కలు చూపించే మొండెం లేని తల… ఏడు భాషల్లో విజయ్ సేతుపతి కొత్త సిరీస్

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×