E-Paper
Advertisement

Psychological Thriller OTT: ఇక్కడ దేవుడు లేడు… కేవలం దయ్యాల మనుషులే… మామూలు సినిమా కాదు క్లైమాక్స్ వరకు వణుకు

Psychological Thriller OTT: ఇక్కడ దేవుడు లేడు… కేవలం దయ్యాల మనుషులే… మామూలు సినిమా కాదు క్లైమాక్స్ వరకు వణుకు
Advertisement

Psychological Thriller OTT : గత ఏడాది థియేటర్లలో ఒక థాయ్ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్ తో హడలెత్తించింది. ఈ మూవీ ఒక మొండి పోలీస్ ఆఫీసర్ దట్టమైన అడవిలో ఒక ప్రమాదకరమైన ముఠా నాయకుడిని పట్టుకునే క్రమంలో తిరుగుతుంది. ఈ సినిమాను నిజమైన దట్టమైన అడవుల్లో షూట్ చేశారు. ఆ అడవి వాతావరణం, చీకటి సీన్లు చూస్తుంటే మనకు కూడా ఆ అడవిలోనే ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లలో వింటే గుండె జారిపోయినంత పని అవుతుంది. హారర్ కంటెంట్ కొంచెం గట్టిగానే ఉంటుంది ఇందులో. అందుకే ఈ సినిమాను గుండె గట్టిగా ఉన్నోళ్ళు చూడటం మంచిది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ థాయ్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘హలబల’ (Halabala). ఈ సినిమా తీసిన ఏకసిత్ థైరాత్ మామూలోడు కాదు. గతంలో ’13 గేమ్ ఆఫ్ డెత్’ లాంటి మైండ్ బెండింగ్ సినిమాలు తీశాడు. అందుకే ఈ ‘హలబల’లో కూడా ఊహించని ట్విస్టులు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు గట్టిగానే ఉంటాయి. ఇందులో హీరోగా చేసిన చంతవిత్ ధనసేవి థాయ్‌లాండ్‌లో పెద్ద స్టార్. సాధారణంగా కామెడీ రోల్స్ చేసే ఆయన, ఈ సినిమాలో ఒక రఫ్ అండ్ టఫ్ పోలీస్‌గా కనిపించి అందరినీ షాక్ ఇచ్చాడు. హీరోయిన్ నుత్తనిచా ప్రెగ్నెంట్ మహిళగా చాలా నేచురల్‌గా నటించింది. ఇది థాయ్‌లాండ్‌లో 2025 ఏప్రిల్ 3న విడుదలై సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో జూలై 2025 నుండి అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక ఊర్లో డాన్ అనే ఒక రౌడీ పోలీసోడు ఉంటాడు. అతనికి భయం అంటే అస్సలు తెలీదు, అందుకే అతన్ని అందరూ వంద శవాల డాన్ అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి అతనికి టుప్ తా ఫై అనే ఒక గ్యాంగ్ లీడర్‌ని పట్టుకోవాలని ఆర్డర్ వస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్‌ తప్పించుకుని హలబల అనే దట్టమైన అడవిలోకి పారిపోతాడు. డాన్ తన ప్రెగ్నెంట్ భార్యను కాపాడుకుంటూ, ఆ గ్యాంగ్ లీడర్‌ని పట్టుకోవడానికి ఆ భయంకరమైన అడవిలోకి వెళ్తాడు. ఆ అడవి మామూలు అడవి కాదు, అక్కడ అడుగు పెడితే చాలు వింత వింత శబ్దాలు, భయంకరమైన అరుపులు వినిపిస్తుంటాయి. అక్కడ ‘బటో’ అనే ఒక క్రూరమైన తెగ మనుషులు ఉంటారు. వాళ్లు మనుషులను పచ్చిగా తినే రకాలు! డాన్ ఒక పక్క ఆ దొంగ ముఠాతో ఫైట్ చేయాలి, ఇంకోపక్క తన భార్యను ఆ నరమాంస భక్షకుల నుండి కాపాడుకోవాలి. ఆ అడవిలో వాళ్లు పడే కష్టాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. చివరికి ఆ అడవిలో ఉన్న దెయ్యాల లాంటి మనుషుల నుండి డాన్ ఎలా బయటపడ్డాడు? తన భార్యను, పుట్టబోయే బిడ్డను సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లాడా ? ఆ గ్యాంగ్ లీడర్‌ని ఏం చేశాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Read Also : ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ థ్రిల్లర్ మూవీ… కథ అంతా 10 కోట్ల డ్రగ్ చుట్టూనే… ఎక్కడ చూడచ్చు అంటే ?

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×