E-Paper
Advertisement

పెళ్లి పీటల మీద ప్రియురాలిని వదిలేసే ప్రియుడు… కట్ చేస్తే ఏడేళ్ల కూతురితో అదిరిపోయే ప్రేమకథ

పెళ్లి పీటల మీద ప్రియురాలిని వదిలేసే ప్రియుడు… కట్ చేస్తే ఏడేళ్ల కూతురితో అదిరిపోయే ప్రేమకథ
Advertisement

Feel Good Movie OTT : ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. గొడవలు, ఫైట్లు లాంటివి కాకుండా మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రేమకథ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కథ ఏదో సాధించాలని కట్టుకోబోయే పిల్లని వదిలేసి వెళ్ళిపోయిన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. తనకి తెలియకుండానే పెరిగి పెద్దదైన కూతురిని, తన మీద కోపంతో ఉన్న ప్రేయసిని చివరికి అతను ఎలా మెప్పించాడు అనేదే ఈ సినిమా. ఇందులో తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే సీన్లు గుండెకు హత్తుకుంటాయి.

ఆపిల్ టివి (Apple tv)లో స్ట్రీమింగ్

ఈ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘ఫరెవర్ మై గర్ల్’ (Forever My Girl). దీనికి బెథానీ ఆష్టన్ వోల్ఫ్ దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్‌ప్లే కూడా అందించారు. కథానాయకుడు లియామ్ పేజ్‌గా బ్రిటీష్ నటుడు అలెక్స్ రో నటించగా, అతని ప్రేయసి జోసీ పాత్రలో జెస్సికా రోత్ నటించింది. వీరిద్దరి ముద్దుల కూతురు బిల్లీగా అబ్బీ రైడర్ ఫోర్ట్సన్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్రముఖ రచయిత్రి హెడీ మెక్‌లాఫ్లిన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో ($3.5 మిలియన్లు) రూపొంది బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను ($16.4 మిలియన్లు) తెచ్చిపెట్టింది. విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రేక్షకులకు మాత్రం ఈ ఎమోషనల్ స్టోరీ బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్ టివి (Apple tv)లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

లియామ్ పేజ్ అనే ఒక కుర్రాడు మ్యూజిక్ పిచ్చితో పెద్ద స్టార్ అయిపోవాలని కలలు కంటాడు. సరిగ్గా పెళ్లి ముహూర్తం టైంలో, పెళ్లి పీటల మీద ఉన్న తన లవర్ జోసీని వదిలేసి, ఎవరికీ చెప్పకుండా సిటీకి చెక్కేస్తాడు. కట్ చేస్తే.. ఎనిమిదేళ్ల తర్వాత తను అనుకున్నట్టే పెద్ద మ్యూజిక్ స్టార్ అయిపోతాడు. పేరు, డబ్బు బాగా సంపాదిస్తాడు. కానీ తన మనసులో ఎక్కడో ఒక వెలితి ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితుడు చనిపోయాడని తెలిసి, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తన సొంత ఊరికి అడుగుపెడతాడు. ఊరికి వచ్చిన లియామ్ తన పాత లవర్ జోసీని కలుస్తాడు. అప్పుడు అతనికి దిమ్మతిరిగే నిజం ఒకటి తెలుస్తుంది. తను వదిలేసి వెళ్ళినప్పుడు జోసీ కడుపుతో ఉందని, ఇప్పుడు తనకు ఎనిమిదేళ్ల ముద్దుల కూతురు బిల్లీ ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు.

తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను చూసి లియామ్ మనసు కరిగిపోతుంది. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ, ఎలాగైనా మళ్ళీ వాళ్ళిద్దరినీ తన లైఫ్ లోకి తెచ్చుకోవాలని డిసైడ్ అవుతాడు. కానీ జోసీ మాత్రం తనను నట్టేట ముంచిన లియామ్‌ని నమ్మడానికి అస్సలు ఒప్పుకోదు. లియామ్ నెమ్మదిగా వాళ్ళతో రిలేషన్ పెంచుకుంటూ, తన సిటీ లైఫ్, స్టార్ డమ్ అన్ని పక్కన పెట్టి మళ్ళీ సాదాసీదా మనిషిగా వాళ్ళ కోసం మారతాడు. తన మాటలతో, పద్ధతితో జోసీ మనసు గెలుచుకుని, చివరకు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఊళ్ళోనే సెటిల్ అవ్వడంతో ఈ చూడచక్కని కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : ఆట మొదలు పెడితే ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే… ఓటీటీలో చూడాల్సిన తోపు సిరీస్

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×