E-Paper
Advertisement

ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Anakapalli: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. అర్ధరాత్రి అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అసలేం జరిగింది?

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి చెన్నైకి వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రహాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటనకు ముందు ట్రావెల్ బస్సు.. పెట్రోల్ బంకులో డీజిల్ ట్యాంక్ ఫుల్ చేయించారు. దీంతో ప్రయాణికులు అప్పటికి ఇంకా నిద్రపోలేదు. ఘటన తర్వాత అందరూ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. బస్సు పంట కాల్వల గుంతలో పడడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.  దీనిపై పలువురు ప్రయాణికులు మీడియాతో మాట్లాడారు.

Advertisement

ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు

నిద్రలోకి వెళ్తున్న సమయంలో ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చిందని అన్నారు. 30 మంది ప్రయాణికుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ట్రావెల్ బస్సు ఒడిషా నుంచి చెన్నైకి వెళ్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రయాణికులు ఎక్కారు. ఈ ఘటనపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సింది.

ALSO READ: జగన్ అసలు రంగు బయటపడింది.. వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు, వైఎస్ షర్మిల ఫైర్

Related News

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!

100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు..అప్లికేషన్ గడువు పెంపు

రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం

వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా – మల్లాది విష్ణు వర్గాల తోపులాట.. డీఎస్సీ దీక్షలో హై టెన్షన్!

అంబటి చుట్టూ కేసుల ఉచ్చు.. ఈసారి ఏం జరిగిందంటే, కేంద్రమంత్రి టార్గెట్‌గా

Big Stories

Advertisement
×