Feel Good Movie OTT : కొన్ని సినిమాలు చిన నాటి జ్ఞాపకాలతో మంచి మెమొరీస్ ని ఇస్తుంటాయి. వీటిని చూస్తున్నంతసేపు మనసు హాయిగా, తేలికగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి ఓటీటీలో చూసేయచ్చు కూడా. ఈ సినిమా ఆరు ఆస్కార్ నామినేషన్లు కూడా సాధించింది. 1980ల కాలంలో సాగే ఈ కథ, అమెరికాకి వలస వెళ్ళిన ఒక కొరియన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది దీనిని చూస్తుంటే.
2020లో వచ్చిన ఈ అమెరికన్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘మినారీ’ (Minari). దీనికి లీ ఐజాక్ చుంగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దర్శకుడు లీ ఐజాక్ చుంగ్ తన రియల్ స్టోరీ ఆధారంగా దీనిని తీశారు. ఆయన చిన్నప్పుడు అర్కాన్సాస్‌లోని ఒక ఫామ్‌లో పెరిగారు. తన జ్ఞాపకాలను 80 చిన్న చిన్న పాయింట్లుగా రాసుకుని, వాటితో సినిమాగా తెరకెక్కించారు. . ఇందులో స్టీవెన్ యూన్, హాన్ యే-రి, అలాన్ కిమ్, యున్ యుహ్-జుంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 93వ అకాడమీ అవార్డులలో ఆరు నామినేషన్లను కూడా పొందింది. ఇందులో జాకబ్ పాత్రలో నటించిన స్టీవెన్ యూన్ ‘ది వాకింగ్ డెడ్’ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఆయన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్ నామినేషన్ పొందిన మొదటి ఏషియన్-అమెరికన్ గా నిలిచారు. అంతేకాకుండా ఇందులో యున్ యుహ్-జుంగ్ ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ గెలుచుకుని, ఈ ఘనత సాధించిన మొదటి కొరియన్ నటిగా చరిత్ర సృష్టించారు. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ1980ల కాలంలో జరుగుతుంది. జాకబ్ తన భార్య మోనికా ఇద్దరు పిల్లలతో కలిసి కొరియా నుండి అమెరికాకు వలస వస్తాడు. కాలిఫోర్నియాలో చిన్న ఉద్యోగం చేస్తూ విసిగిపోయిన జాకబ్, అర్కాన్సాస్‌లోని ఒక పల్లెటూరిలో 50 ఎకరాల భూమిని కొంటాడు. అక్కడ కొరియన్ కూరగాయలు పండించి పెద్ద రైతు కావాలన్నది అతని కల. కానీ ఆ ఊరిలో సౌకర్యాలు లేకపోవడం, ఒక పాత రేకుల షెడ్ లాంటి ఇంటిలో నివసించాల్సి రావడం వల్ల అతని భార్య మోనికాకు ఈ నిర్ణయం అస్సలు నచ్చదు. దీంతో వాళ్ళ మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి.
ఇక పిల్లలను చూసుకోవడానికి మోనికా తల్లి కొరియా నుండి వస్తుంది. ఆమె మిగతా అమ్మమ్మల్లా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది. పేకాట ఆడటం, సరదాగా మాట్లాడటం ఆమె నైజం. గుండె జబ్బు ఉన్న మనవడు డేవిడ్‌కు మొదట్లో తన అమ్మమ్మ అస్సలు నచ్చదు. కానీ తొందరలోనే ఆమెతో కాలసిపోతాడు. ఆమె తనతో పాటు కొరియా నుండి తెచ్చిన ‘మినారీ’ అనే ఒక రకమైన ఆకుకూర విత్తనాలను కూడా అక్కడ నాటుతుంది. ఇక కథ నడిచేకొద్ది ప్రకృతి విపత్తు వల్ల పంటకు ప్రమాదం వస్తుంది. చివరికి ఆ పంటను వీళ్ళు కాపాడుకుంటారా ? మినారీ ఆకు కూరల అసలు కథ ఏమిటి ? ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ ఫీల్ గుడ్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : సినిమా కష్టాలతో సినిమా తీయాలనుకునే తింగరి బ్యాచ్… అన్ లిమిటెడ్ కామెడీతో అదరగొడుతున్న సిరీస్