PSL-Pink ball T20 : పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మార్చి 26వ తేదీన ప్రారంభమైంది. గురువారం ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ సందర్భంగా తొలి మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ ( Gaddafi Stadium, Lahore) వేదికగా జరిగింది. ఈ మొదటి మ్యాచ్ లోనే లాహోర్ ఖలందర్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్లు ( Lahore Qalandars vs Hyderabad Kingsmen) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన లాహోర్ ఖలందర్స్ , 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో బంతి పింక్ కలర్ లోకి ( Pink ball T20) మారడంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. టి20 లో వైట్ బంతి వాడాలి, కానీ ఇలా రంగు మారిన బంతి ఎలా వాడుతారు ? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు హైదరాబాద్ కింగ్స్‌మెన్ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ గురువారం ప్రారంభమైంది. అయితే, ఈ టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు పోయింది. తొలి మ్యాచ్ లోనే ఇజ్జత్ మొత్తం తీసుకున్నారు. టి20 మ్యాచ్ లలో కచ్చితంగా వైట్ బంతులు వాడాలి. అయితే ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే పింక్ బాల్ వాడింది ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాడింది వైట్ బంతులు అయినప్పటికీ.. హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Hyderabad Kingsmen) ప్లేయర్ల జెర్సీల రంగు ఆ బంతులకు అంటింది.
క్వాలిటీ తక్కువగా ఉన్న జెర్సీలు హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు వాడినట్లు తెలుస్తోంది. అందుకే బౌలర్లు బంతులు వేసినా కొద్దీ తెల్లటి బంతి కాస్త పింక్ కలర్ లోకి మారింది. దీంతో టి20 లను టెస్టులుగా మార్చారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇక డబ్బులకు కక్కుర్తి పడి క్వాలిటీ లేని జెర్సీలు తీసుకువచ్చిందని హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు యాజమాన్యంపై కూడా విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను పైసా షార్టేజ్ లీగ్ అంటూ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా తొలి మ్యాచ్ లో లాహోర్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్స్ లో 199 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ కింగ్స్ మెన్ దారుణంగా విఫలమై, 130 పరుగుల వద్ద కుప్ప కూలింది.
Hands got pink. Ball got pink due to Jersey leaving its colour. Man, PSL is full comedy. I know they are gareeb but this gareeb😭😭😭😭 pic.twitter.com/WsI96OdeD2
— Rajiv (@Rajiv1841) March 26, 2026