E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను కనిపెట్టిన అమర్ 

Nindu Noorella Saavasam Serial Today Episode April 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను కనిపెట్టిన అమర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరితో మాట్లాడిన తర్వాత రణవీర్, అమర్‌కు కాల్‌ చేస్తాడు. అది గమనించిన అమర్‌ వాడే ఫోన్‌ చేస్తున్నాడు. త్వరగా ట్రేస్‌ చేయండి అంటూ  ఎస్సై  సూర్యకు  చెప్పగానే.. లాప్‌టాప్‌ తీసుకుని ట్రేస్‌ చేస్తుంటారు. అమర్ కాల్‌ లిప్ట్ చేస్తాడు. రణవీర్‌ టక్‌ టక్‌ అనే గడియారంలో చిన్న ముల్లు సౌండ్‌ వినిపిస్తుదా అమరేంద్రా..? పోనీ నీ కొడుకు అతి కష్టం మీద తీసుకుంటున్న ఆఖరి శ్వాస అయినా వినిపిస్తుందా అమరేంద్రా అనగానే.. అమర్‌ కోపంగా రేయ్‌ వాడికి ఏమైనా అయిందో అంటూ వార్నింగ్‌ ఇస్తుంటే..

రణవీర్‌ కోపంగా నీ కొడుక్కి ఏమైనా అయిందో పూర్తి బాధ్యత నీదే అమరేంద్ర.. టైం చాలా తక్కువగా ఉంది. జస్ట్‌ ఇరవై అయిదు నిమిషాలు మాత్రమే.. ఇకపైన నా నెంబర్‌ ట్రేస్‌ చేయాలని నన్ను పట్టుకోవాలని మొండితనం పంతం పట్టుదల అన్ని మానుకుని నా కూతురుని నాకు అప్పగించు. అప్పుడే నీ కొడుకుని ప్రాణాలతో అప్పగిస్తాను. ఒకవేళ నీ కొడుకు చనిపోయినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.. నీ దగ్గర ఉన్న నా కూతురును ఎలాగైనా దక్కించుకోగలను.. కానీ కొడుకు పోతే అది నీకు ఎంత నష్టం ఎంత కష్టం ఆర్మీ వాడిలా కాకుండా వాణ్ని కన్న తండ్రిలా ఆలోచించు అమరేంద్ర. నా కూతురును తీసుకుని ఈ సారి నువ్వే నాకు ఫోన్‌ చేయ్‌. టైం చాలా తక్కువగా ఉంది. ఆ కాలం కరిగిపోయే కొద్దీ నీ కొడుకు ఆయువు తీరిపోతుంది అంటూ వార్నింగ్‌ ఇచ్చి కాల్‌ కట్‌ చేస్తాడు రణవీర్‌. అమర్‌ కోపంగా హలో హలో అంటుంటాడు. ఇంతలో సూర్య వాడు చాలా తెలివిగా ప్లే చేస్తున్నాడు సార్‌ కాల్‌ ట్రేస్‌ చేయలేకపోతున్నాము.. అని చెప్పగానే..

Advertisement

రాథోడ్‌ బాధగా సార్‌ ఈ స్లమ్ము చాలా పెద్దది సార్‌.. ఇంత పెద్ద స్లమ్ములో వాడు ఆకాష్‌ బాబును ఏ ఇంట్లో దాచిపెట్టాడో తెలుసుకోవడం చాలా కష్టం సార్‌ అనగానే..  సూర్య కూడా అవును సార్‌ ఇప్పటికీ మనం సగం స్లమ్ము కూడా కవర్‌ చేయలేకపోయాము.. ఇప్పటికీ సగానికి ఎక్కువే వెతకాలి మన దగ్గర అంత టై లేదు సార్‌ అని చెప్పగానే..  రాథోడ్‌ కూడా ఏం చేద్దాం సార్‌ ఈ ఇరవై అయిదు నిమిషాల్లోపు మనం పట్టుకోకపోతే ఆకాష్‌ బాబు పరిస్థితి ఏంటి సార్‌ అంటూ అడగుతుంటే.. అమర్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఎదురుగా ఉల్లిపాయలు అమ్మేవాడు వెళ్తుంటాడు. వాణ్ని చూసి అమర్‌ పోలీసును సూర్య ఇందాక కాల్ రికార్డ్‌ చేశావా..? అని అడగ్గానే.. సూర్య చేశాను సార్‌ అని చెప్పగానే.. అయితే ఒకసారి ప్లే చేయ్‌ అంటాడు అమర్‌.

సూర్య ప్లే చేయగానే.. అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉల్లిపాయలు అమ్ముతున్న వాయిస్‌ వినిపిస్తుంది. దీంతో అమర్‌ నా వాయిస్‌, రణవీర్‌ వాయిస్‌ కొద్దిగా తగ్గించి బ్యాగ్రౌండ్‌ వాయిస్‌ పెంచు అని చెప్పగానే.. సూర్య ఓకే సార్‌ అంటూ బ్యాగ్రౌండ్‌ పెంచగానే.. ఉల్లిపాయలు అమ్ముతున్నవాడి సౌండ్ వినిపిస్తుంది. దీంతో రాథోడ్‌ సార్‌ సార్‌ ఆ ఫోన్‌ వాయిస్‌లో ఉల్లిపాయలు అమ్ముతున్నవాడి సౌండ్ వినిపిస్తుంది సార్‌ అని చెప్పగానే.. సూర్య కూడా అంటే రణవీర్‌ ఇందాక ఫోన్‌ మాట్లాడుతుదన్నప్పుడు ఆ ఉల్లిపాయలు అమ్మేవాడు అక్కడి నుంచే పాస్‌ అయి ఉంటాడు సార్‌ అని చెప్పగానే.. అమర్‌ ఎస్‌ వెళ్లి ఆ ఉల్లిపాయల వాడిని తీసుకుని రండి వెళ్లండి అని చెప్పగానే.. అలాగే సార్‌ అంటూ రాథోడ్‌, సూర్య వెళ్తారు.

Advertisement

మరోవైపు ఇంట్లో ఉన్న మిస్సమ్మ టెన్షన్‌ పడుతుంది. టైం ఇంకా ఇరవై నిమిషాలే ఉంది ఆకాష్‌ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ బాధపడుతుంది. ఆయన రణవీర్‌ను కనిపెట్టారో లేదో దేవుడా ఆకాష్‌కు ఏమీ కాకుండా చూడు స్వామి అనుకుంటుంది. ఇంతలో పైనుంచి ఆనంద్‌ వచ్చి మిస్సమ్మ మనం ఆకాష్‌ దగ్గరకు ఎప్పుడు వెళ్తున్నాం అని అడగ్గానే.. ఇంకో గంటలో వెళ్దాం అని మిస్సమ్మ చెప్పగానే. మనం వెళ్లేటప్పుడు ఆకాష్‌కు ఇష్టమైన టిఫిన్‌ తీసుకుని వెళ్దాం అని చెప్తాడు.. మిస్సమ్మ, ఆనంద్‌కు ఏమీ తెలియకుండా మాట్లాడుతుంది. ఆనంద్‌ పైకి వెళ్లిపోయాక అమర్‌కు కాల్‌ చేస్తుంది. రణవీర్‌ అడ్రస్‌ దొరికిందా అని అడగ్గానే.. ఆల్‌మోస్ట్‌ దొరికినట్టే అంటూ చెప్పి అమర్‌ కాల్‌ కట్ చేస్తాడు.

తర్వాత అమర్‌ రణవీర్‌ ఉన్న ఇంట్లోకి వెళ్లి రణవీర్‌ను కొడుతుంటాడు. ఇంతలో ఇంజక్షన్‌ తీసుకుని మిస్సమ్మ, రాథోడ్‌, పోలీస్‌ సూర్య అక్కడికి వస్తారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×