E-Paper
Advertisement

Feel Good Movie OTT : ఎమోషన్స్ తో కట్టిపడేస్తూ 24 ఏళ్ల తర్వాత కలుసుకునే ప్రేమ జంట… చూసేకొద్దీ చూడాలనిపించే కథ

Feel Good Movie OTT : ఎమోషన్స్ తో కట్టిపడేస్తూ 24 ఏళ్ల తర్వాత కలుసుకునే ప్రేమ జంట… చూసేకొద్దీ చూడాలనిపించే కథ
Advertisement

Feel Good Movie OTT : బడ్జెట్ ఎంత అనేది ముఖ్యం కాదు, కంటెంట్ ఎలా ఉందనేదే ముఖ్యమని నిరూపించింది ఒక సినిమా. ఇది కేవలం చిన్న సినిమాగా మొదలై, ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని ఆస్కార్ రేంజ్ కు వెళ్ళింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగానే ఈ కథ రాసుకుంది. ఒకసారి ఆమె న్యూయార్క్‌లోని ఒక బార్‌లో తన అమెరికన్ భర్త, తన చిన్ననాటి కొరియన్ ఫ్రెండ్ మధ్య కూర్చుని మాట్లాడుతున్న క్రమంలో ఈ ఐడియా పుట్టిందట. ఇక కథలో చిన్ననాటి స్నేహితులైన నోరా, హే సంగ్ అనే ఇద్దరు కొరియాలో విడిపోతారు. 24 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ న్యూయార్క్‌లో మళ్లీ కలుసుకున్నప్పుడు, వాళ్ళ మధ్య కలిగే ఎమోషన్స్ చుట్టూ కథ ఉంటుంది.

లయన్స్ గేట్ ప్లే (Lionsgate play)లో స్ట్రీమింగ్

సెలిన్ సాంగ్ దర్శకత్వంలో 2023లో వచ్చిన ఈ సినిమా పేరు ‘పాస్ట్ లైవ్స్’ (Past Lives). ఇందులో గ్రేటా లీ (నోరా), టియో యూ (హే సంగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని A24 నిర్మాణ సంస్థ నిర్మించింది. వీళ్ళు తీసే సినిమాలు ఎమోషన్స్‌ని డీప్ గా టచ్ చేసేలా ఉంటాయి కూడా. ఈ సినిమా 96వ అకాడమీ అవార్డ్స్‌లో (Oscars) బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే (Lionsgate play)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కొరియాలో ఇద్దరు నొరా అనే అమ్మాయి ,హే సంగ్ అనే అబ్బాయి స్కూల్‌లో క్లాస్‌మేట్స్, పైగా ఒకరంటే ఒకరికి భలే ఇష్టం. కానీ అమ్మాయి వాళ్ల ఫ్యామిలీ అమెరికాకు వెళ్లడంతో ఆ చిన్న వయసులోనే ఇద్దరూ విడిపోతారు. అప్పట్లో ఫోన్లు, ఫేస్‌బుక్కులు లేవు కాబట్టి ఆ దోస్తీ అక్కడితో కట్ అయిపోతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత, అబ్బాయి ఆ అమ్మాయిని ఫేస్‌బుక్ ద్వారా వెతికి పట్టుకుంటాడు. వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ పాత ముచ్చట్లన్నీ గుర్తు చేసుకుంటారు. ఆ టైమ్‌లో వాళ్లిద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురించినట్లే ఉంటుంది కానీ, అబ్బాయి కొరియాలో, అమ్మాయి న్యూయార్క్‌లో ఉండటంతో కలవడం కుదరదు. చివరకు ఆ అమ్మాయి వేరే ఒకణ్ణి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుంది. మరో 12 ఏళ్ల తర్వాత, అంటే మొత్తం 24 ఏళ్ల గ్యాప్ తర్వాత, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూడటానికి న్యూయార్క్ వస్తాడు. అప్పటికే పెళ్లయిన ఆ అమ్మాయి, తన భర్తతో కలిసి ఈ పాత దోస్తుని రిసీవ్ చేసుకుంటుంది. వీళ్లిద్దరూ కలిసి తిరుగుతూ, మనం గత జన్మలో భార్యాభర్తలమో ఏమో, అందుకే ఇప్పుడు ఇలా కలిశామని ఎమోషనల్ అవుతారు. చివరకు ఎవరి దారి వారిదే అని తెలుసుకుని, భారమైన మనసుతో ఒకరికొకరు బై చెప్పుకుని విడిపోతారు. ఈ కథకు ఇలా శుభం కార్డ్ పడుతుంది.

Read Also :  కావాల్సినప్పుడు కాంట్రాక్ట్ భార్యగా వచ్చే అమ్మాయి… జడ్జితో కూడా వదలకుండా…

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×