E-Paper
Advertisement

మంచు దీవుల్లో గాయపడిన గుండె… మనసుకు హాయిని ఇచ్చే స్టోరీ

మంచు దీవుల్లో గాయపడిన గుండె… మనసుకు హాయిని ఇచ్చే స్టోరీ
Advertisement

Feel Good Movie OTT: మద్యపానం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. అవుతూనే ఉన్నాయి, అవ్వబోతాయి కూడా. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ మూవీ రూపొందింది. నిజానికి ఇదొక అద్భుతమైన సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాలో ఒక యువతి మద్యపానానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అయితే దీని నుంచి బయటపడటానికి ఆమె ప్రకృతిని ఆరాధించడం మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సాగే స్టోరీ చూడ చక్కగా ఉంటుంది. ఇది లిప్ట్రోట్ అనే రచయిత్రి తన సొంత జీవితంలో ఎదుర్కొన్న మద్యపాన వ్యసనం, దాని నుండి ఆమె ఎలా బయటపడిందనే విషయాలను ‘ది అవుట్‌రన్’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆధారంగానే ఈ సినిమా తీశారు. ఈ సినిమాను స్కాట్లాండ్‌లోని ఓర్క్నీ అనే మారుమూల దీవుల్లో చిత్రీకరించారు. ఆ మంచు దీవుల్లో ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ బ్రిటిష్-జర్మన్ మూవీ పేరు ‘ది అవుట్‌రన్’ (The Outrun). నోరా ఫింగ్‌షీడ్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలో ఆస్కార్ నామినీ సావోయిర్స్ రోనన్ నటించారు. ఆమెతో పాటు పాపా ఎస్సీడు, స్టీఫెన్ డిల్లాన్, సాస్కియా రీవ్స్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సావోయిర్స్ రోనన్ ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఆమె నటనకు విమర్శకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మద్యపాన వ్యసనంతో పడే ఆవేదనను ఆమె కళ్ళలోనే చూపించారు. ఈమె ఈ సినిమాలో కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. తన భర్త జాక్ లోడెన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం 2024 సెప్టెంబర్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో విడుదలైంది. ఈ సినిమా ZEE5, Amazon Prime Video, Apple TV ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రోనా అనే అమ్మాయి చదువు కోసం, బతుకు తెరువు కోసం లండన్ వెళ్తుంది. అక్కడ లైఫ్ బిజీగా ఉంటుందని వెళ్తే, ఆమె కాస్తా మందుకి బానిసైపోతుంది. పగలు, రాత్రి తేడా లేకుండా తాగడం, గొడవలు పెట్టుకోవడం, ఉన్న ఉద్యోగాన్ని ఊడగొట్టుకోవడంతో ఆమె జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. చివరకు తన ప్రియుడితో కూడా గొడవపడి, విడిపోయి.. తనని తాను నాశనం చేసుకునే స్టేజ్‌కి వెళ్తుంది. ఆ నరకం నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యి, రిహాబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లి మందు మానేయడానికి ట్రై చేస్తుంది.

అయితే అక్కడ కూడా తనకి ప్రశాంతత దొరకదు. అందుకే ఆమె తన గతాన్ని మర్చిపోవడానికి స్కాట్లాండ్‌లోని తన సొంత ఊరైన ఓర్క్నీ దీవులకి తిరిగి వెళ్తుంది. అది చాలా మారుమూల ప్రాంతం, చుట్టూ సముద్రం, చల్లని గాలి ఆమెకు ఆహ్వానం పలుకుతాయి. ఇక తనని తాను మార్చుకోవడానికి అక్కడ సముద్రపు మొక్కల మీద రీసెర్చ్ చేయడం, పక్షులను గమనించడం లాంటి పనులు చేస్తూ టైం గడుపుతుంది. ఆ దీవుల్లో ఒంటరిగా గడపడం వల్ల ఆమెకి ప్రకృతిలో ఉండే అసలు శక్తి అర్థమవుతుంది. ఆ చలి గాలులు, అలల శబ్దం ఆమెకి ఒక మెడిసిన్‌లా పనిచేస్తాయి. ఇప్పుడు రోనా పాత గాయాలను మాన్పుకుంటూ మెల్లమెల్లగా కొత్త మనిషిగా మారుతుంది. చివరికి జీవితం అంటే కేవలం తాగడం మాత్రమే కాదు, ప్రకృతితో కలిసి ప్రశాంతంగా బతకడం అని తెలుసుకోవడంతో ఈ కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : తల్లి పెళ్లి కోసం అదిరిపోయే స్కెచ్ వేసే కొడుకు… ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×