E-Paper
Advertisement

వ్యూస్ పిచ్చితో వరుస హత్యలు చేసే హైస్కూల్ అమ్మాయిలు… వణికిపోతున్న ఊరి జనం

వ్యూస్ పిచ్చితో వరుస హత్యలు చేసే హైస్కూల్ అమ్మాయిలు… వణికిపోతున్న ఊరి జనం
Advertisement

Horror Comedy OTT : సోషల్ మీడియా ఈ రోజుల్లో ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. లైకులు, షేర్ల కోసం పిచ్చెక్కిపోతున్నారు. వాటి కోసం ఎంతటి దారుణానికైనా సిద్దపడుతున్నారు కొంత మంది. ఈ పిచ్చిని, ఒక హాలీవుడ్ సినిమా వ్యంగ్యంగా చూపిస్తోంది. ఈ సినిమా విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఇద్దరు అమ్మాయిలు ఇందులో లైకుల కోసం చేసే రచ్చ మామూలుగా ఉండదు. కేవలం 98 నిమిషాల నిడివి గల ఈ సినిమా, నేటి తరం యువతలో సోషల్ మీడియా వ్యామోహం వల్ల కలిగే ప్రమాదాలను అత్యంత హింసాత్మకంగా చూపించింది. ఈ సినిమాలో కామెడీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. యూత్ కి ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

2017లో వచ్చిన ఈ అమెరికన్ హారర్ కామెడీ మూవీ పేరు ‘ట్రాజెడీ గర్ల్స్’ (Tragedy Girls). ఈ చిత్రాన్ని టైలర్ మాకిన్టైర్ దర్శకత్వం వహించగా, దీనికి పావెల్ పోగోర్జిల్స్కీ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు బ్రియానా హిల్డెబ్రాండ్, అలెగ్జాండ్రా షిప్ తమ నటనకు గాను బ్రూక్లిన్ హారర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డులను గెలుచుకున్నారు. 2017లో సౌత్ బై సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయిన ఈ చిత్రం, సోషల్ మీడియా పిచ్చిని ఎండగట్టే కథాంశం వల్ల విమర్శకుల నుండి పాజిటివ్ రేటింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సాడీ, మెకైలా అనే ఇద్దరు ప్రాణస్నేహితురాళ్ళు ఉంటారు. వీళ్ళకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాలని కోరిక. వాళ్ళు ఒక క్రైమ్ బ్లాగ్ కూడా నడుపుతూ ఉంటారు. అయితే అదే ఊరిలో వరుస హత్యలు చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్‌ను చాకచక్యంగా ట్రాప్ చేసి, ఒక సీక్రెట్ ప్లేస్ లో బంధిస్తారు. వాని ద్వారా హత్యలు ఎలా చేయాలో నేర్చుకుని, తామే స్వయంగా నేరాలు చేయడం మొదలుపెడతారు.
తమ బ్లాగ్‌కు పబ్లిసిటీ రావడం కోసం వీళ్ళిద్దరూ కలిసి ఊరిలో తెలిసిన వాళ్ళనే అతి దారుణంగా చంపేస్తుంటారు. ఆ హత్యలన్నీ బంధీగా ఉన్న ఆ పాత కిల్లరే చేస్తున్నాడని అందరినీ నమ్మిస్తారు. దీనివల్ల సోషల్ మీడియాలో వీళ్ళకు ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోతారు. పోలీసులను, ఊరి జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ తమ పాపులారిటీని ఎంజాయ్ చేస్తుంటారు. చివరికి వీళ్ళ రహస్యం బయటపడుతుందా ? ఆ సీరియల్ కిల్లర్‌ను వీళ్ళు ఏం చేస్తారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాసిందే.

Read Also : రాత్రంతా నిద్రపోకుండా వీళ్లు చేసిన రచ్చ… లవర్స్ చూడాల్సిన అసలు సిసలు మూవీ

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×