BigTV English

OTT Movie : కజిన్ తో కాక్టైల్ … ప్రియుడితో పాప్కార్న్… పోలీసోడితో లాలీపాప్… ఈ టీనేజ్ పాప రచ్చ వేరే లెవెల్ బాసూ

OTT Movie : కజిన్ తో కాక్టైల్ …  ప్రియుడితో పాప్కార్న్… పోలీసోడితో లాలీపాప్… ఈ టీనేజ్ పాప రచ్చ వేరే లెవెల్ బాసూ

OTT Movie : కొన్ని సినిమాలను చూడటానికి యూత్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సినిమాలలో కొన్ని సీన్స్ కోసమే మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఇటువంటి సినిమాలు హాలీవుడ్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాలను ఒంటరిగా చూడటమే మంచిది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా,  కాస్త మసాలా ఘాటు ఎక్కువగానే ఉంటుంది. ఇందులో స్టోరీ కూడా ఆసక్తికరంగా సాగుతుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఫ్లవర్’ (Flower). 2017 లో వచ్చిన ఈ సినిమాకి మాక్స్ వింక్లర్ దర్శకత్వం వహించారు. ఇందులో జోయ్ డియూచ్ (ఎరికా వాండ్రాస్), కాథరిన్ హాన్ (లారీ వాండ్రాస్), టిమ్ హైడెకర్ (బాబ్ షెర్మాన్), ఆడమ్ స్కాట్ (విల్ జోర్డాన్), జోయ్ మోర్గాన్ (లూక్ షెర్మాన్), మరియు డిలాన్ గెలులా (కాలా) నటించారు. ఈ మూవీ లాస్ ఏంజిల్స్‌లోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో నివసించే 17 ఏళ్ల ఎరికా అనే తెలివైన యువతి చుట్టూ తిరుగుతుంది. 1 గంట 33 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 6.0/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెలితే

ఎరికా అనే 17 ఏళ్ల యువతి తన ఇద్దరు స్నేహితులు కాలా, క్లాడిన్ తో కలిసి బయట షికారుకెళ్తుంది. ఒక పోలీసు అధికారితో ఎరికా కారులోనే ఏకాంతంగా గడుపుతుంది. బయటనుంచి ఆమె స్నేహితులు దానిని రహస్యంగా రికార్డ్ చేసి, అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఆమె మైనర్ కావడంతో, ఆ పోలీస్ భయపడి  $400 డాలర్లు ఇస్తాడు. ఎరికా, ఆమె స్నేహితులు ఈ విధంగా పెడోఫిల్స్‌ను టార్గెట్ చేస్తూ, డబ్బు సంపాదిస్తారు. ఎరికా తండ్రి ఒక కాసినో దోపిడీ కేసులో జైలులో ఉంటాడు. అతన్ని బెయిల్‌పై విడుదల చేయడానికి ఆమె డబ్బు సేవ్ చేస్తుంటుంది. ఎరికా తల్లి లారీ ఇప్పుడు ఒక కొత్త బాయ్‌ఫ్రెండ్ బాబ్ షెర్మాన్ తో కలసి ఉంటుంది. ఎరికాకి ఇది ఏమాత్రం ఇష్టం ఉండదు. బాబ్ కి చెందిన 18 ఏళ్ల కుమారుడు లూక్  రిహాబ్ సెంటర్ నుండి విడుదలై ఇంట్లోకి వస్తాడు. ఎరికా మొదట అతన్ని తేలికగా తీసుకుంటుంది. ఆ తరువాత తనతో ఏకాంతంగా గడపడానికి
ఆఫర్ చేస్తుంది.  కానీ అతను ఆమెను సున్నితంగా తిరస్కరిస్తాడు.

లూక్ తన స్కూల్ టీచర్ విల్ జోర్డాన్ ను చూసి భయాందోళనకు గురవుతాడు. అతను తన చిన్నతనంలో వేధింపులకు గురిచేశాడాని ఆరోపిస్తాడు. ఎరికా, లూక్ బాధను చూసి, అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. విల్‌ను తమ తదుపరి బ్లాక్‌మెయిల్ టార్గెట్‌గా ఎంచుకుంటుంది. ఆమె విల్‌ను గ్రాసరీ స్టోర్‌లో తన అందంతో అతని మతి పోగొడుతుంది. అతనితో ఫ్లర్ట్ చేస్తుంది. ఒక కొత్త ప్లాన్‌లో, ఎరికా ఒక డ్రగ్ డీలర్ నుండి కొకైన్ తీసుకుంటుంది. దానిని బీర్ లో కలిపి విల్ కి ఇవ్వడానికి ఎరికా అతని ఇంటికి వెళ్ళి, అతనితో హాంగ్ అవుట్ చేస్తుంది.  ఇంతలో డ్రగ్ ప్రభావం వల్ల అతను ఆమె చేయి పట్టుకోవడంతో, ఆమె కేకలు వేస్తుంది. లూక్ లోపలికి పరిగెత్తి, విల్‌ను గాజు కాఫీ టేబుల్‌పై తోస్తాడు. ఇప్పుడు ఎరికా, ఆమె స్నేహితులు విల్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి, సోఫాపై కూర్చోబెట్టి అతనితో ఫోటోలు తీస్తారు. ఆ తరువాత వీళ్ళు అక్కడినుంచి వెళ్లిపోతారు.

మరుసటి రోజు పోలీసులు, విల్ గురించి తెలుసుకోవడానికి, ఎరికా, లూక్‌ను సంప్రదిస్తారు. అయితే వాళ్ళు విల్‌ను మేము చూడలేదని చెప్తారు. ఎరికా, లూక్ భయపడిన విల్ ఇంటికి వెళ్తారు. అక్కడ విల్ చనిపోయినట్లు తెలుసుకుంటారు. ఆ తరువాత స్టోరీ అదిరిపోయే ట్విస్ట్ తో టర్న్ తీసుకుంటుంది. చివరికి ఎరికా, లూక్‌ ఈ కేసు నుంచి బయటపడతారా ? ఏరికా బ్లాక్ మైల్ చేయడం ఆపేస్తుందా ? ఈ స్టోరీలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అర్ధరాత్రి అడవిలో కార్ పంక్చర్… కూతురు, భార్యను వదిలేసి అతను చేసే పనికి ఫ్యూజులు అవుట్

Related News

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

Big Stories

×