BigTV English

OTT Movie : అర్ధరాత్రి అడవిలో కార్ పంక్చర్… కూతురు, భార్యను వదిలేసి అతను చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అర్ధరాత్రి అడవిలో కార్ పంక్చర్… కూతురు, భార్యను వదిలేసి అతను చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : ఓటీటీలోకి డిఫరెంట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా హారర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.  వెబ్ సిరీస్ లు కూడా ఇలాంటి కంటెంట్ తో ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ హారర్ జానర్ లోనే వచ్చింది. ఇందులో తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించాడు. ఇది అతనికి తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ తమిళ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది విలేజ్’ (The Village). 2023 లో వచ్చిన ఈ సిరీస్ కి మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. బి.ఎస్. రాధాకృష్ణన్ స్టూడియో శక్తి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో దీనిని నిర్మించారు. ఈ సిరీస్‌లో ఆర్య (డాక్టర్ గౌతమ్ సుబ్రమణ్యం), దివ్యా పిళ్ళై (నేహ), బేబీ ఆజియా (మాయ), ఆడుకలం నరేన్ (శక్తివేల్), ముత్తుకుమార్ (కరుణాగం), జార్జ్ మరియన్ (పీటర్), జాన్ కొక్కెన్ (ఫర్హాన్), అర్జున్ చిదంబరం (ప్రకాశ్) నటించారు. ఆరు ఎపిసోడ్‌లతో, ప్రతి ఎపిసోడ్ 35-45 నిమిషాల నిడివితో, ఈ సిరీస్ 2023 నవంబర్ 24 న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో విడుదలైంది.


స్టోరీలోకి వెళితే

ఈ సిరీస్ రెండు టైమ్‌లైన్‌లలో,  తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలోని కట్టియల్ అనే గ్రామంలో నడుస్తుంది. 2005 టైమ్‌లైన్: నవమలై నుండి సమీప నగరానికి ప్రయాణిస్తున్న ఒక వ్యాన్ కట్టియల్ గ్రామం గుండా ఒక మార్గంలో వెళ్ళవలసి వస్తుంది. ఈ వ్యాన్ అడవుల్లోకి వెళ్ళాక కనిపించకుండా పోతుంది. ఈ సీన్ తరువాత శక్తివేల్, కరుణాగం వారి పిల్లలను కోల్పోయిన దుఃఖంలో ఉంటారు. ఈ గ్రామం ఎక్సోజెనిక్స్ అనే కంపెనీ ద్వారా ప్రమాదకరమైన రసాయన ప్రయోగాలకు గురైందని, ఇది భూమి, నీటిని లాంటనైట్ అనే రసాయనంతో కలుషితం చేసిందని తెలుస్తుంది. దీనివల్ల గ్రామస్తులు జోంబీ లాగా మారుతుంటారు. సైరాజ్ అనే గ్రామస్తుడు తన అత్యాశ కారణంగా ఈ ప్రయోగాలకు సహకరిస్తాడు. ఇది కట్టియల్ పతనానికి దారితీస్తుంది.

ప్రస్తుత టైమ్‌లైన్: డాక్టర్ గౌతమ్ సుబ్రమణ్యం, అతని భార్య నేహ, వారి కుమార్తె మాయ, పెంపుడు కుక్క హెక్టిక్‌తో చెన్నై నుండి తూత్తుకుడికి రోడ్ ట్రిప్‌లో బయలుదేరతాడు. రాత్రిపూట వాళ్ళ కారు కట్టియల్ సమీపంలోని ఒక నిర్మానుసయ్య మార్గంలో పాడవుతుంది. గౌతమ్ సహాయం కోసం సమీప పట్టణానికి వెళ్తాడు. అయితే అతను తిరిగి వచ్చే సరికి, అతని కారుతో సహా నేహ, మాయ అదృశ్యమవుతారు. అక్కడ కిడ్నాప్ జరిగినట్లు ఆధారాలు ఉంటాయి. గౌతమ్ సహాయం కోసం ఆ ప్రాంతానికి దగ్గరలో కనిపించిన శక్తివేల్, కరుణాగం, పీటర్ అనే ముగ్గురు స్థానికుల సహాయాన్ని కోరతాడు. వాళ్ళు అయిష్టంగానే సహాయం చేయడానికి అంగీకరిస్తారు. ఇదే సమయంలో ప్రకాశ్ అనే ఫార్మా కంపెనీ ఓనర్, కిరాయి గూండాలను కట్టియల్‌కు పంపిస్తాడు. ఇక గౌతమ్, శక్తివేల్, కరుణాగం, పీటర్ కట్టియల్‌లోని ఒక పాడుబడిన ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తారు. అక్కడ వాళ్ళు మ్యూటంట్ లను, కిరాయి రౌడీ లను ఎదుర్కొంటారు.  చివరికి గౌతం తన కుటుంబాన్ని కాపాడతాడా ? ఆ గ్రామంలో జరిగే సంఘటనలకు అసలు కారణం ఏమిటి? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : అమెరికన్ మర్డర్ కేసులో చిక్కుకునే ఇండియన్ మహిళ… ఈ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామాకు ఏకంగా 8.5 రేటింగ్

Related News

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

Big Stories

×