OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ స్టోరీలలో అఫైర్ లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకే ఇవి ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఇలాంటి కథలకు మాత్రం ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో నలుగురు డైరెక్టర్లు తీసిన నాలుగు చిన్న కథల అంథాలజీ సిరీస్ ఆసక్తిగా నడుస్తోంది. ప్రతి ఎపిసోడ్ అఫైర్ లతో తిరుగుతూ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ తో ముగుస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఈ సిరీస్ ఊహించని మలుపులు తిరుగుతూ ఆశ్చర్యపరుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
2020లో విడుదలైన ఈ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మినీ సిరీస్ పేరు ‘ఫర్బిడెన్ లవ్’ (Forbidden Love) . ఇది ప్రియదర్శన్, ప్రదీప్ సర్కార్, అనిరుద్ధ రాయ్ చౌధరి, మహేష్ మంజ్రేకర్ అనే నలుగురు డైరెక్టర్లు తీసిన అంథాలజీ సిరిస్. ఇందులో అలీ ఫజల్, పూజా కుమార్, పత్రలేఖా పాల్ , అదిత్య సీల్, ఓమ్కార్ కపూర్, ఆహానా కుమ్రా, రైమా సేన్, రన్నవీజ్ సింగా లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2020 సెప్టెంబర్ 9 నుంచి 4 ఎపిసోడ్స్ తో ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : రాత్రి మొదలెడితే తెల్లార్లూ అదే పని… ఇలాంటి సీన్లు ఎక్కడా చూసి ఉండరు మావా… సింగిల్స్ కి మాత్రమే
ఎపిసోడ్ 1: అనామికా (ప్రదీప్ సర్కార్ డైరెక్షన్): అనామికా భర్త నీల్ తో హ్యాపీ మ్యారేజ్ ని లీడ్ చేస్తుంటుంది. కానీ హస్బెండ్ ఎప్పుడూ బయటే బిజీగా ఉంటాడు. దీంతో అనామికా లోన్లీగా ఫీల్ అవుతుంది. ఈ సమయంలో ఇషాన్ అనే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో అఫైర్ మొదలెడుతుంది. ఇషాన్ వచ్చాక అనమికలో దాగి ఉన్న కోరికలకు రెక్కలు తొడుగుతాడు. వీళ్ళు హద్దులు దాటి మరో లోకంలో విహరిస్తుంటారు. అయితే వీళ్ళ విషయం భర్తకి తెలిసిపోతుంది. ఇప్పుడు నీల్ అనమికా అఫైర్ తెలుసుకుని దూరం పెడతాడు. ఇషాన్‌తో ఎస్కేప్ ప్లాన్ చేస్తుంది కానీ చివరికి మోసపోయానని తెలుసుకుని ఒంటరిగా మిగిలిపోతుంది.
ఎపిసోడ్ 2: అరేంజ్డ్ మ్యారేజ్ (ప్రియదర్శన్ డైరెక్షన్): కేయా అనే మెడికల్ స్టూడెంట్ కి దేవ్ అనే వ్యక్తవతో అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. మొదట మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంటుంది. కానీ మెల్లిగా దేవ్ తన భార్యను డామినేట్ చేయడం మొదలుపెడతాడు. జెలసీతో కేయాని స్టడీ ఆపమని కంట్రోల్ చేస్తాడు. చివరికి కేయా అతన్ని భరించలేక వెళ్ళిపోతుంది.
ఎపిసోడ్ 3: డయాగ్నోసిస్ ఆఫ్ లవ్ (అనిరుద్ధ రాయ్ డైరెక్షన్): సారా అనే డాక్టర్ విక్రమ్ అనే పేషెంట్ తో అఫైర్ మొదలుపెడుతుంది. విక్రమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాడు. సారా ఆమెని ట్రీట్ చేస్తూ ప్రేమలో పడుతుంది. కానీ విక్రమ్ జెలసీతో సారా లైఫ్‌ని నాశనం చేయడానికి చూస్తాడు. చివరికి సారా అతని నుంచి దూరమవుతుంది.
ఎపిసోడ్ 4: రూల్ ఆఫ్ గేమ్స్ (మహేష్ మంజ్రేకర్ డైరెక్షన్): రాణి, రాజ్ అనే దంపతులకి పిల్లలు పుట్టకపోవడంతో ఆమె వేరే వ్యక్తిని ప్రేమిస్తుంది. ప్రెగ్నెన్సి కూడా తెచ్చుకుంటుంది. అయితే భర్తకి ఈ విషయం తెలియడంతతో అతన్ని చంపేస్తుంది. బాయ్ ఫ్రెండ్ అడ్డు కూడా తొలగించుకుంటుంది. షాకింగ్ విషయం ఏమిటంటే ఆమెకు మరో ప్రియుడు ఉంటాడు. వీళ్ళంతా పక్కా ప్లాన్ తో ఆస్థి కోసం ఇవన్నీ చేస్తారు.