E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనూజా మంచి మనవరాలు… భరణి తల్లి దెబ్బకు కన్నీళ్ళు పెట్టుకున్న దివ్య

Bigg Boss 9 Telugu : తనూజా మంచి మనవరాలు… భరణి తల్లి దెబ్బకు కన్నీళ్ళు పెట్టుకున్న దివ్య
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ – భరణి – దివ్య బాండ్ ప్రతిరోజూ ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. దివ్య – తనూజ ఫైట్స్ ఒకవైపు, దివ్య – భరణి బాండింగ్ మరోవైపు ఆడియన్స్ కు తలనొప్పిగా మారాయి. అయితే భరణి హౌస్ మేట్స్ కూడా దివ్యాను కాకుండా తనుజాను సపోర్ట్ చేస్తూ, దివ్యాను దూరం పెట్టమని హింట్స్ ఇస్తుండడం గమనార్హం.

దివ్యాకు భరణి తల్లి వార్నింగ్

ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లో భరణికి సపోర్ట్ గా వచ్చిన నాగబాబు కూడా ఇన్ డైరెక్ట్ గా ఇదే చెప్పాడు. ఎవరైనా నీ మీద అరిస్తే ఊరికే ఉండొద్దు. అక్కడున్న వాళ్ళతో ఎమోషన్స్ ఎలా ఉన్నాయో నీ ఆట తీరు కూడా అలాగే ఉండాలి. కళ్ళముందు కన్నకుతురే పోటీకి దిగినా తగ్గకూడదు అంటూ ఇన్ డైరెక్ట్ గా అయినా గట్టిగానే చెప్పారు. అయితే నాగబాబు కంటే భరణి తల్లి ఇచ్చిన కౌంటర్ దివ్యాను ఉక్కిరిబిక్కిరి చేసింది. తనూజాను చూడగానే  మనవరాలు అంటూ తెగ మురిసిపోయిన ఆవిడ, దివ్యను కనీసం కేర్ చేయలేదు. పైగా తనూజాను టాప్ 2 లో పెట్టేసింది. చివరికి వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ వేసి వెళ్ళింది భరణి తల్లి. ‘దివ్యా భరణితో చూసుకుని మాట్లాడు, ఆడు. ఏదో చెబుతున్నా అని అనుకోకు. జాగ్రత్త’ అంటూ స్వీట్ వాయిస్ తో హెచ్చరించింది. ముందు దివ్యకు అర్థం కాలేదు. కానీ అర్థం అయ్యాక కుళాయి తిప్పేసింది.

ఈ భరణి మారడు

Advertisement

విషయం అర్థం అయ్యాక దివ్య కన్నీళ్ళు పెట్టుకోవడంతో భరణి ఏమైందని ప్రశ్నించాడు. “మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు మిమ్మల్ని అన్నయ్యలా ట్రీట్ చేశానని. నా దగ్గరకు వచ్చే సరికే ఎందుకు ప్రాబ్లం అవుతోంది?” అంటూ ఏడ్చింది. ఇన్ని హింట్స్ వచ్చిన భరణి ఏమాత్రం తగ్గట్లే. పైగా ‘అమ్మకు నువ్వు నాపై అరవడం నచ్చలేదేమోలే’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసి తన అభిమానులకు సైతం షాక్ ఇచ్చాడు.

మొన్నటి ఎపిసోడ్లో కూడా దివ్య తల్లి భరణితో బాండ్ గురించి కొత్త కథ చెప్పి, ఈ నెగెటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ భరణి కూతురు ఆరతి వచ్చి మళ్ళీ మంట పెట్టేసింది. తన తండ్రితో అలా కమాండింగ్ వాయిస్ లో మాట్లాడొద్దు అని ముఖం మీదే చెప్పేసింది. తనుజాతో మాత్రం ‘డాడీతో మీ బాండింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తాము’ అని ఫ్యామిలీలా కలిపేసుకుంది. అయినప్పటికీ దివ్యానే కాదు భరణి కూడా ఏమాత్రం మారట్లేదు. ఇదంతా చూశాక వీళ్లిద్దరిని బయటకు పంపితేనేగానీ మాకు ఈ నస తగ్గదు అనుకుంటున్నారు ఆడియన్స్.

Advertisement

Read also : తనూజ – దివ్యలకు నాగ్ మాస్ వార్నింగ్… భరణికి నాగబాబు, ఇమ్మాన్యుయేల్ కు అవినాష్ సీక్రెట్ హింట్స్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×