E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అరుంధతికి వరాలు ఇచ్చిన గుప్త  

Nindu Noorella Saavasam Serial Today December 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అరుంధతికి వరాలు ఇచ్చిన గుప్త  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

అరుంధతి రామ్మూర్తి మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. మిస్సమ్మ మాటలు కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో గుప్త వచ్చి బాలిక నువ్వు ఎంత శోకించినను సమస్య పరిష్కారం కాదు.. జరగబోవునది అంతా ఆ జగన్నాథుడి లీల  అని చెప్పగానే.. నిజమే కదా గుప్త గారు ఇలాంటి అప్పుడే కదా నేను నా చెల్లి పక్కన ఉండాలి. ఇలాంటప్పుడే కదా నేను నా చెల్లికి అమ్మనై అన్ని చేయాలి. ఇలాంటప్పుడే నేను ఎందుకు చనిపోయానా అని బాధగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడే నేను బతికి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు నేను బతికి ఉంటే నా చెల్లికి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకునే దాన్ని. తనకు జరగాల్సిన ముచ్చట్లన్నీ నేను జరిపించేదాన్ని.. నా చెల్లి సంతోషంలో నా సంతోషాన్ని చూసుకునేదాన్ని.. కానీ ఇప్పుడు అవన్నీ తీరని ఆశలు నెరవేరని కోరికలు.. అంటూ ఆరు ఏడుస్తుంటే.. గుప్త  ఎమోషనల్ అవుతూ లేదు బాలిక నువ్వు ఆశపడునది కోరుకున్నది జరుగును అని చెప్పగానే..

ఆరు ఆశ్చర్యంగా ఎలా జరుగుతుంది గుప్త గారు.. నేను చనిపోయాను కదా..? పైగా ఈ సీమంతం కూడా జరగదు. మనోహరి విధ్వంసం సృష్టిస్తుందని మీరే కదా చెప్పారు అంటుంది ఆరు. దీంతో గుప్త జరగబోయేది జగన్నాథుడి లీల అని చెప్పితిని కదా.. అది కాసేపు విస్మరింపుము.. ఇప్పటి వరకు నీవు నీ కొరకు ఏమీయును కోరుకోలేదు.. తొలిసారిగా నేను జీవించి ఉంటే బాగుండు అని కోరుకున్నావు.. నిస్వార్థమైన నీ కోరికను మేము నెరవేర్చకపోతే మన బంధమునకు సార్థకత లేదు బాలిక అంటాడు గుప్త. ఆశ్చర్యంగా ఏమంటున్నారు గుప్త గారు నాకేం అర్థం కావడం లేదు అంటుంది ఆరు.. అవును బాలిక నీ సహోదరి సీమంతమునకు నీవే స్వయంగా ఈ ఊరి జనులందరినీ ఆహ్వానించే ఏర్పాటు చేసేదము అని గుప్త చెప్పగానే. అదెలా సాధ్యం అని ఆరు అడుగుతుంది.

Advertisement

మాకును కొన్ని శక్తులు ఉన్నయన్న విషయం మరచితివా..? బాలిక అంటాడు గుప్త.. కానీ మీ శక్తులు వాడకూదడని వాడితే రాజు గారికి తెలిసిపోయి ఆయన ఆగ్రహానికి గురి అవుతారని మీరే చెప్పారు కదా..? అని ఆరు అడగ్గానే.. మా ప్రభువుల వారి ఆగ్రహానికి మేము గురి అగుట తథ్యం మేము అందులకు సిద్ద పడే నీతో భూలోకమునకు వచ్చితిమి అని గుప్త చెప్పగానే.. ఆరు బాధగా వద్దు గుప్త గారు వద్దు.. నా వల్ల ఇది వరకే మీరు చాలా బాధపడ్డారు.. మళ్లీ మిమ్మల్ని బాధపెట్టలేను.. అంటుంది ఆరు. మా కళ్ల ముందే మా సోదరి శోకించుచుంటే మేము చూడలేము.. నా నరకమున మేము పాపులను మాత్రమే వీక్షించెదము కానీ తొలిసారి నీ వంటి ఉత్తమురాలిని పుణ్యాత్మురాలిని చూసితిమి మమ్ములను కన్నది ఒక మాతృమూర్తియే బాలిక.. నీ మాతృ హృదయాన్ని మేము అర్థం చేసుకోగలం అంటూ మంత్రం వేసి తాంబూలం ఉన్న పాత్రను ఆరుకు ఇస్తాడు.

అవును ఈ ఊరి జనులు ఎవ్వరూ నిన్ను ఇంతకు మునుపెన్నడూ చూడలేదు కదా..? అని అడగ్గానే.. లేదు గుప్త గారు నేను ఇక్కడే పుట్టినా.. అనాథ ఆశ్రమంలో పెరిగానే.. పెద్దయ్యాక నేను ఎవరికీ తెలియదు అని ఆరు చెప్పగానే. అటులయినా ఇది తీసుకొనుము.. నీ సహోదరి శుభకార్యమునకు ఈ ఊరి జనులందరినీ నువ్వే స్వయంగా వెళ్లి ఆహ్వానించుము.. నీ సంకోచం నాకు అవగతం అయినది.. నీవు అందరికీ కనిపించెదవు.. అంటూ తన చేతికి ఉన్న ఉంగరం తీసి నీకు ఎంతగానో ఇష్టమైన మా అంగుళీకము దీనిని ధరించినచో నీకు అందరికీ కనిపించెదవు అని చెప్పగానే.. ఉంగరం తీసుకున్న ఆరు ఏడుస్తూ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను గుప్త గారు అంటుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×