E-Paper
Advertisement

Freedom At Midnight Season 2 OTT : మరికొన్ని గంటల్లో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడొచ్చంటే ?

Freedom At Midnight Season 2 OTT : మరికొన్ని గంటల్లో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Freedom At Midnight Season 2 OTT : చరిత్ర గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలలో చదవడం అనే ఆప్షన్ ఉంటుంది. కానీ మళ్లీ ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే మాత్రం సినిమాలు లేదా సిరీస్ లే బెస్ట్ ఛాయిస్. మీకు కూడా గతంలోకి వెళ్ళి, ముఖ్యంగా గాంధీల కాలంలో ఏం జరిగిందో చూడాలి, తెలుగుకోవాలి అనుకుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ సిరీస్ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇప్పుడు కొత్త సీజన్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి మరికొన్ని గంటల్లో సందడి చేయబోతున్న ఆ సిరీస్ ఏంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

పీరియాడిక్ డ్రామాగా సిరీస్ రూపంలో తెరకెక్కింది ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ (Freedom At Midnight Season 2). ఇందులో జవహర్‌లాల్ నెహ్రూగా సిద్ధార్థ్ గుప్తా, మహాత్మా గాంధీగా చిరాగ్ వోహ్రా, సర్దార్ వల్లభాయ్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా మెయిన్ రోల్స్ పోషించరు. ఇప్పటికే మొదటి సిరీస్ ఓటీటీలోకి రాగా, రెండవ పార్ట్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్ లో భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే, భారతదేశం – పాకిస్తాన్ విభజన, అధికారం కోసం జరిగిన రాజకీయ పోరాటాలు, గాంధీ, నెహ్రూ, పటేల్, జిన్నా సిద్ధాంతాల ఘర్షణ వంటి అంశాలను తెరపై చూపించబోతున్నారు. ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సీజన్ 2’ 2026 జనవరి 9న సోనీ లివ్ (SonyLIV)లో ప్రీమియర్ కాబోతోంది.

Advertisement

కాగా ఈ సిరీస్‌లో లార్డ్ లూయిస్ మౌంట్‌ బాటెన్‌ రోల్ లో ల్యూక్ మెక్‌గిబ్నీ, ఎడ్వినా మౌంట్‌ బాటెన్‌ పాత్రలో కార్డెలియా బుగేజా, సరోజిని నాయుడుగా మలిష్కా మెండోన్సా, మొహమ్మద్ అలీ జిన్నా రోల్ లో ఆరిఫ్ జకారియా, ఫాతిమా జిన్నా పాత్రలో ఇరా దుబే, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్ కన్పించనున్నారు. నిఖిల్ అద్వానీ నిర్మించిన ఈ చారిత్రాత్మక సిరీస్ డొమినిక్ లాపియర్ అండ్ లారీ కాలిన్స్ రాసిన అదే పేరు గల బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తెరకెక్కింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించగా, అభినందన్ గుప్తా, గుందీప్ కౌర్, అద్వితీయ కరెన్ దాస్, ఏతాన్ టేలర్, రేవంత సారాభాయ్, దివ్య నిధి శర్మ ఈ సిరీస్ కు రచయితలుగా వ్యవహరించారు.

Read Also : 14 ఏళ్ల పాప గొంతుకోసి… ఇప్పటికీ వీడని మిస్టరీ… జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ

ఆ సిరీస్ స్టోరీ ఏంటి ?

Advertisement

ఆగస్టు 1946 నుంచి జనవరి 1948 మధ్య జరిగిన ఇండియాలో సంఘటనల ఆధారంగా సీజన్ 2 ను రూపొందించారు. భారతదేశం స్వాతంత్ర్యం వైపు వేసిన అడుగులను, చివరి ప్రయాణాన్ని ఇందులో చూడవచ్చు. అంతేకాదు మహాత్మా గాంధీ, ముహమ్మద్ అలీ జిన్నా మధ్య వచ్చిన విభేదాల వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెరపైకి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా జిన్నా ప్రత్యేక దేశం అంటూ పాకిస్తాన్ కోసం ఎందుకు డిమాండ్‌ చేశారో తెలుసుకోవచ్చు. జిన్నా డిమాండ్‌ విషయమై సర్దార్ పటేల్‌, మహాత్మా గాంధీ రియాక్షన్ ఏంటి ? అనే విషయాన్ని ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవచ్చు.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×