E-Paper
Advertisement

Top 20 News: రాజధాని నిర్మాణంపై జగన్ కీలక వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై జేఏసీ నాయుకులు నిరసన

Top 20 News: రాజధాని నిర్మాణంపై జగన్ కీలక వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై జేఏసీ నాయుకులు నిరసన

1. ఊరూరూ ఉద్యమం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్‌ జీ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కార్యాచరణను ప్రకటించారు. ఈ చట్టం వెనుక ఉన్న కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

2. ఫేక్ సర్టిఫికెట్ దందా

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్ దందా కోనసాగుతోంది. జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించారు కేటుగాళ్లు. రేగొండ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓసీ అభ్యర్థి బీసీ సర్టిఫికెట్‌తో సర్పంచ్‌గా గెలవగా, మరికొందరు నకిలీ రెసిడెన్స్ పత్రాలతో ఆర్మీ ఉద్యోగాల్లో చేరడం కలకలం రేపుతోంది.

3. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు తమ విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో రాజకీయ నేతల పాత్రపై దృష్టి సారించిన అధికారులు.. మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అందులోభాగంగా ఇవాళ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలు సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

4. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కూనా రాజు చందు, ఎస్.నంజప్ప వద్ద నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి తెలిపారు.

5. రాజధాని నిర్మాణంపై జగన్ కీలక వ్యాఖ్యలు

రాజధాని నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోందని ఆయన ఆరోపించారు. రాజధాని కోసం గతంలో 50 వేల ఎకరాలు సేకరించగా, ఇప్పుడు ప్రభుత్వం మరో 50 వేల ఎకరాల సేకరణకు సిద్ధమవుతోందని జగన్ అన్నారు. ప్రభుత్వ డీపీఆర్ ప్రకారమే ఎకరా భూమిని అభివృద్ధి చేయడానికి రూ.2 కోట్లు అవసరమవుతాయని.. ఆ లెక్కన మొత్తం లక్ష ఎకరాల అభివృద్ధికి రూ.2 లక్షల కోట్లు కావాలని ఆయన అన్నారు.

6. చైనా మాంజాపై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర వ్యాప్తంగా జరిపిన దాడుల్లో 103 కేసులు నమోదు చేసి, 143 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. సుమారు 1.24 కోట్ల విలువైన 6,226 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.

7. మంత్రులతో సీఎం భేటి

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అజెండా అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న పీపీపీ విధానం, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సాధిస్తున్న మైలురాళ్లపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.

8. విద్యార్థులతో కలిసి కలెక్టర్ ర్యాలీ

సీఎం కప్ క్రీడల ద్వారా గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటికి వస్తుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. అధికారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం కప్ రెండో ఎడిషన్‌పై మండలాల వారిగా అథ్లెటిక్స్ అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

9. మహబూబాబాద్ జిల్లాలో ముసలి కలకలం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం వద్ద రాళ్ల వాగు బ్రిడ్జిపై అకస్మాత్తుగా ఒక మొసలి ప్రత్యక్షమైంది. అక్కడే ఉన్న భూక్య సుమన్, బానోత్ సురేష్‌తో పాటు ఇతర తండా యువకులు ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. చేపల వలల సాయంతో చాకచక్యంగా మొసలిని బంధించి, పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. అనంతరం సర్పంచ్ మంగీలాల్ నాయక్ సమక్షంలో మొసలిని అటవీ అధికారులకు సురక్షితంగా అప్పగించారు.

10. ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి వీరంగం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీహార్‌కు చెందిన వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. వైద్యం కోసం వచ్చిన అతను రోగులను భయపెడుతూ, ఆసుపత్రి వస్తువులను ధ్వంసం చేశాడు. అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డు శరత్‌పై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకెళ్లి తలుపులు వేసుకుని గొంతు కోసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా తలుపులు పగులగొట్టి అతడిని బంధించి, చికిత్స అందించారు.

11. శంకుస్థాపన

భువనగిరి నియోజకవర్గంలోని అనాజిపురం-జంపల్లి గ్రామాల మధ్య శారాజిపేట వాగుపై 16.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న హై లెవెల్ వంతెన పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా పాలనలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

12. కూటమి ప్రభుత్వంపై జేఏసీ నాయుకులు నిరసన

శ్రీకాకుళంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. గత 20 నెలలుగా విద్యార్థులను మోసం చేస్తున్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. ఏటా లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా దీవెన వంటి పథకాల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. నిరుద్యోగుల తరఫున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

13. కరెంట్ షాక్‌తో మృతి

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పెద్దఖండేపల్లి సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతి చెందారు. రాజీపేటకు చెందిన రాడి రాము కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా, పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు వీపుకు తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భార్య కళ్లముందే ఈ ఘటన జరగడం స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

14. ప్రేమ పేరుతో పదో తరగతి బాలుడు వేధింపులు

గుంటూరు జిల్లా తెనాలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెనాలి మారీసుపేటలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర బాలిక‌ను అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు.

15. ఫోన్ల రికవరీ

మేడ్చల్ మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. 2.08 కోట్ల విలువైన 1,039 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డీసీపీ గుణశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 4,733 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన చెప్పారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు.

16. మద్యపానం నిషేదం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో గ్రామస్తులు అందరూ కలిసి మద్యపానం నిషేధంపై తీర్మానం చేశారు. గ్రామంలో బెల్టు షాపుల వల్ల గ్రామస్తుల కుటుంబాల్లో కలహాలు పెరుగుతోందని వారు గమనించారు. దీంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు కలిసి పూర్తిస్థాయి మద్యపాన నిషేధం విధించారు.

17. సీఎంతో భేటీ

హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యా సంస్కరణలపై చర్చించారు. ఈ భేటీలో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థుల కోసం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నమూనాను సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు.

18. సంక్రాంతి ప్రయాణికులు రైల్వే బంపరాఫర్

సంక్రాంతి ప్రయాణికులకు ఇండియన్ రైల్వే ఒక శుభవార్త చెప్పింది. టికెట్ కొనుగోలుపై 3శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల బుకింగ్ మీద 3శాతం తగ్గింపు లభిస్తుంది. ఇది జనవరి 14 నుంచి జులై 14వరకు అందుబాటులో ఉంటుంది. నగదు రహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

19. ఆశ్యర్య ఘటన

కేరళలోని అలప్పుజలో ఓ ఆశ్యర్య ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ యాచకుడి వద్ద 5.4లక్షల నగదు లభించడం స్థానికులను ఆశ్యర్యపరిచింది. చారుమ్మూడ్ ప్రాంతంలో భిక్షాటన చేసే అనిల్ కిషోర్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు అతడి వద్ద ఉన్న కంటైనర్‌ను తెరిచి చూడగా..అందులో సాధారణ కరెన్సీతో పాటు రద్దయిన 2వేల నోట్లు, విదేశీ కరెన్సీ కూడా ఉండడం గమనార్హం.

20. నవ్విస్తున్న ట్రైలర్

రాజుగారి పెళ్లి ఏడుతరాలు గుర్తిండిపోతుందంటూ నవ్వులు పూయిస్తున్నారు నవీన్‌ పొలిశెట్టి. ఆయన ప్రధానపాత్రలో మారి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా సందడి చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×