E-Paper
Advertisement

AI Hair Clipper: ప్రపంచంలోనే మొదటి AI హెయిర్ క్లిప్పర్.. సూపర్ ఫాస్ట్‌, కచ్చితమైన హెయిర్ కట్ సులువుగా

AI Hair Clipper: ప్రపంచంలోనే మొదటి AI హెయిర్ క్లిప్పర్.. సూపర్ ఫాస్ట్‌, కచ్చితమైన హెయిర్ కట్ సులువుగా
Advertisement

AI Hair Clipper Tensor 1 | జర్మనీకి చెందిన నమ్మకమైన బ్రాండ్ మై-బ్లేడ్స్.. టెన్సర్ 1 అనే కొత్త AI పవర్ హెయిర్ క్లిప్పర్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ హెయిర్ క్లిప్పర్ ప్రధానంగా ప్రొఫెషనల్ బార్బర్ల కోసమే తయారు చేయబడింది. ఈ క్లిప్పర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉండడం ప్రత్యేకం. ఈ ఏఐ టెక్నాలజీతో హెయిర్ క్లిప్పర్ కటింగ్ పర్‌ఫామెన్స్‌ని రియల్ టైమ్‌లో సర్దుబాటు చేస్తుంది. ఈ కొత్త క్లిప్పర్‌.. హై స్పీడ్, కచ్చితత్వం, హీట్ కంట్రోల్ చేయగలదు. టెన్సర్ 1 క్లిప్పర్ బార్బర్లు (నాయి బ్రాహ్మణులు) మరింత స్మార్ట్, స్థిరమైన హెయిర్‌కట్స్‌కు సహాయపడుతుంది.

టెన్సర్ 1 లాంచ్

మై-బ్లేడ్స్ టెన్సర్ 1ను ప్రొఫెషనల్ బార్బర్ల కోసం AI పవర్ హెయిర్ క్లిప్పర్‌గా పరిచయం చేసింది. ఈ ప్రొడక్ట్‌ను 2025 అక్టోబర్ 21న బెర్లిన్‌లో విడుదల చేశారు. టెన్సర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కచ్చితమైన ఇంజినీరింగ్, ఎర్గోనామిక్ డిజైన్‌తో కలిపింది. ఈ క్లిప్పర్ హెయిర్ టైప్, టెక్స్చర్, కటింగ్ టెక్నిక్‌కు అనుగుణంగా రియల్ టైమ్‌లో ఆటోమెటిక్‌గా సర్దుబాటు అవుతుంది.

ప్రొఫెషనల్ బార్బర్ల కోసమే తయారీ

Advertisement

మై-బ్లేడ్స్ టెన్సర్ 1ను ప్రొఫెషనల్ బార్బర్ల సలహాలతో తయారు చేసింది. యూరప్, అమెరికా బార్బర్లు ఫైనల్ డిజైన్‌కు సహాయం చేశారు. ఈ పరికరం.. నిజమైన బార్బర్ పనితీరుని సపోర్ట్ చేసే టూల్ తయారు చేయడమే లక్ష్యం. టెన్సర్ 1 స్వయంగా సర్దుబాటు అవుతుంది, బార్బర్లు తమ అలవాట్లు మార్చాల్సిన అవసరం లేదు.

ఇంటెలిజెంట్ హెయిర్ కటింగ్ పర్‌ఫామెన్స్

టెన్సర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కటింగ్ సమయంలో కస్టమర్ జుట్టును ముందుగా పరిశీలిస్తుంది. హెయిర్ డెన్సిటీ, టెక్స్చర్ ఆధారంగా స్పీడ్ పవర్ సర్దుబాటు చేస్తుంది. ఫేడ్స్, ట్రిమ్స్ పూర్తి హెయిర్‌కట్స్‌లో స్మూత్ పర్‌ఫామెన్స్ లభిస్తుంది. AI సిస్టమ్ రోజంతా స్థిరమైన ఫలితాలు ఇస్తుంది.

పవర్‌ఫుల్ మోటార్, బిల్డ్ క్వాలిటీ

Advertisement

టెన్సర్ 1 నిమిషానికి 26,000 స్ట్రోక్స్ వరకు అందిస్తుంది. దీంతో స్పీడ్ క్లీన్, కచ్చితమైన కటింగ్ సాధ్యమవుతుంది. బాడీలో ఏర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఉపయోగించారు. ఇది బలం, డ్యూరెబిలిటీని అందిస్తుంది. లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ ఉపయోగానికి సరిపోతుంది.

అడ్వాన్స్‌డ్ సెన్సార్ టెక్నాలజీ

టెన్సర్ 1లో స్మార్ట్ ఆపరేషన్ కోసం అనేక సెన్సార్లు ఉన్నాయి. ఇందులోని హీట్ సెన్సార్లు లాంగ్ సెషన్స్‌లో ఓవర్‌హీటింగ్‌ను నిరోధిస్తాయి. హై పవర్‌ఫామెన్స్ తో సెన్సార్లు రోజంతా స్టేబుల్ పవర్ నిర్వహిస్తాయి. ఈ ఫీచర్లు డివైస్, బార్బర్ పనితీరుని కొనసాగిస్తాయి.

కంఫర్ట్, ఎర్గోనామిక్స్

క్లిప్పర్ రోజువారీ ప్రొఫెషనల్ ఉపయోగానికి ఎర్గోనామిక్ షేప్ కలిగి ఉంది. బ్యాలెన్స్‌డ్ వెయిట్ లాంగ్ వర్కింగ్ అవర్స్‌లో హ్యాండ్ ఫ్యాటిగ్‌ను తగ్గిస్తుంది. దీని గ్రిప్ మెరుగైన కంట్రోల్, స్మూత్ మూవ్‌మెంట్స్ అందిస్తుంది. బార్బర్లు మరింత వేగంగా,  కంఫర్ట్‌గా పని చేయవచ్చు.

ప్రొడక్ట్ వెనుక విజన్

మై-బ్లేడ్స్ సీఈఓ మోరిట్జ్ న్యూగెబాయర్ కంపెనీ విజన్‌ను స్పష్టంగా వివరించారు. టెన్సర్ 1ను స్వయంగా హై స్కిల్ బార్బర్లు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బార్బర్ల కోసం తయారు చేశారని చెప్పారు. స్కిల్‌ను సపోర్ట్ చేయడంపై దృష్టి పెట్టారు, మానవ నైపుణ్యాన్ని రీప్లేస్ చేయడం కాదు. AI టెక్నాలజీ వ‌త్తి నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది, క్రియేటివ్ కంట్రోల్‌ని తొలగించదు.

Also Read: బ్యాంక్‌లో డబ్బులు లేకపోయినా యుపిఐ పేమెంట్.. గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్

మై-బ్లేడ్స్ బ్రాండ్ బ్యాక్‌గ్రౌండ్

మై-బ్లేడ్స్ జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ గ్రూమింగ్ టూల్స్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసే ప్రీమియం రేజర్ బ్లేడ్స్‌ చాలా ఫేమస్. ఇండిపెండెంట్ టెస్టింగ్‌లో జర్మనీలో బెస్ట్ రేజర్ బ్లేడ్ అవార్డు గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్స్ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు.

గ్లోబల్ రీచ్, ఫ్యూచర్ గోల్స్

మై-బ్లేడ్స్ యూరప్, నార్త్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్‌లో తన ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రొఫెషనల్ గ్రూమింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. టెన్సర్ 1 ఇంటెలిజెంట్ గ్రూమింగ్ టెక్నాలజీలో పెద్ద అడుగు. మై-బ్లేడ్స్ ప్రపంచవ్యాప్తంగా బార్బర్ టూల్స్‌లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×