E-Paper
Advertisement

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌
Advertisement

Sci fi Survival Thriller: ఎండ వేడితో ప్రజలు అల్లాడిపోతుంటే, ఆకాశంలో ఒక్కసారిగా వింత మేఘాలు కనిపిస్తాయి. కాసేపటికే వర్షం మొదలవుతుంది. కానీ అది ఎప్పటిలా నార్మల్ వర్షం కాదు. చర్మాన్ని కాల్చేస్తూ, తగిలిన వస్తువులను కరిగించే ప్రమాదకరమైన యాసిడ్ వర్షం. బయట అడుగు పెట్టినా ప్రాణాలు పోయే పరిస్థితి. ఇలాంటి విపత్తు మధ్య చిక్కుకున్న ఓ కుటుంబం బతికి బయటపడేందుకు చేసే పోరాటమే ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘యాసిడ్’ (Acid). ఈ సినిమా ఓటీటీలో తెలుగులో ఉందా ? అసలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మిచెల్, ఎలిస్ విడిపోయిన దంపతులు. వీరికి సెల్మా అనే కుమార్తె ఉంటుంది. ఇప్పటికే వ్యక్తిగత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబానికి ప్రకృతి రూపంలో మరో పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఆకాశంలో వింత మేఘాలు ఏర్పడతాయి. వాటి నుంచి కురిసే వర్షం మనుషుల ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఆ వర్షం తగిలిన చోట చర్మం కాలిపోవడం, వస్తువులు దెబ్బతినడం మొదలవడంతో ప్రజలు భయంతో పరుగులు తీస్తారు.

Advertisement

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పరిస్థితి చేయి దాటిపోతుంది. రోడ్లపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారుతుంది. ఇళ్లలో ఉన్నా పూర్తిగా సురక్షితమనే నమ్మకం ఉండదు. యాసిడ్ వర్షం నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఆశ్రయం కోసం వెతుకుతుంటారు. ఎక్కడికి వెళ్లాలి, ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి అనేది ఎవరికీ అర్థం కాదు. ఈ విపత్తు ఎప్పుడు ఆగుతుందో తెలియక అందరిలో భయం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిచెల్, ఎలిస్ తమ కుమార్తె సెల్మాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.

విడిపోయిన కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, కూతురి ప్రాణాలను కాపాడటం కోసం కలిసి ముందుకు సాగాల్సి వస్తుంది. ప్రమాదకరమైన వాతావరణం మధ్య సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. ఒకవైపు యాసిడ్ వర్షం నుంచి తప్పించుకోవాలి, మరోవైపు తమ మధ్య ఉన్న సమస్యలను పక్కన పెట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రమాదాలు, కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలతో కథ సాగుతుంది. మరి ఈ విపత్తు నుంచి వారు బయట పడగలిగారా లేదా? అనేది సినిమాలో చూడాలి.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

Advertisement

‘యాసిడ్’ 2023లో విడుదలైన ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. మిచెల్ పాత్రలో గియోమ్ కానే (Guillaume Canet), ఎలిస్ పాత్రలో లెటిషియా దోష్ (Laetitia Dosch), సెల్మా పాత్రలో పేషెన్స్ ముంచెన్‌బాక్ (Patience Munchenbach) నటించారు. జస్ట్ ఫిలిప్పో (Just Philippot) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రకృతి విపత్తును కళ్లకు కట్టినట్లు చూపించే సన్నివేశాలతో పాటు, ప్రాణాల కోసం చేసే పోరాటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక మూవీ Jio Hotstarలో అందుబాటులో ఉంది. అయితే తెలుగు ఆడియో లేదా సబ్‌టైటిల్స్ లేవు.

Read Also: గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Tags

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×