E-Paper
Advertisement

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో
Advertisement

Action Crime Thriller OTT : ఓ తల్లి కళ్ల ముందే తన కూతురు కిడ్నాప్ అయితే ? అదే సమయంలో జరిగిన దారుణమైన దాడిలో ఆమె చూపును కూడా కోల్పోతే ? అయినా కూతురిని వదిలి పెట్టకుండా, ఆమెను ఎత్తుకెళ్లిన వాళ్ల కోసం ఒంటరిగా వేట మొదలు పెడితే ? మొదట ఒక సాధారణ కిడ్నాప్‌ లా అనిపించినా, దాని వెనుక భారీ చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ఉందని తెలిస్తే ? ఇలాంటి హై-ఇంటెన్సిటీ యాక్షన్, మిస్టరీ, ఎమోషన్ కలిసిన సినిమా ‘Gandhari’. తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న నేరుగా ఓటీటీలోకి వచ్చింది. మరి బాణి తన కూతురిని ఎలా వెతికింది ? ఆమెకు ఎదురైన శత్రువులు ఎవరు ? చూపు లేకుండానే ఆమె ఎలా పోరాటం చేసింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

జాయ్‌పుర్రా అనే పట్టణంలో కథ సాగుతుంది. బాణి తన చిన్నారి కూతురితో కలిసి ఉంటుంది. కానీ రైల్వే స్టేషన్‌ లో ఆమె కూతురు కిడ్నాప్‌ కు గురవుతుంది. అదే సమయంలో జరిగిన ఓ క్రూరమైన దాడి కారణంగా బాణి తాత్కాలికంగా చూపును కోల్పోతుంది. ఒక్కసారిగా కూతురు కనిపించకుండా పోవడం, తన కళ్లకు వెలుగు లేకపోవడం ఆమెను పూర్తిగా కుదిపేస్తాయి. అయితే అక్కడితో బాణి ఆగిపోదు.

Advertisement

కూతురిని ఎలాగైనా కనిపెట్టాలని కంకణం కట్టుకుంటుంది. పిల్లను వెతుక్కుంటూ వెళ్లిన కొద్దీ, ఇది నార్మల్ కిడ్నాప్ కాదని ఆమెకు అర్థమవుతుంది. పవర్ ఫుల్ వ్యక్తులు నడుపుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ సిండికేట్ అని తెలుస్తుంది. జాయ్‌పుర్రాలో భయంతో గందరగోళం నెలకొంటుంది. మరోవైపు అనుమానాస్పద వ్యక్తులు ఆమె దారిలోకి వస్తారు. తన బిడ్డను తిరిగి తీసుకురావడానికి బాణి తనలోని భయాన్ని పక్కన పెట్టి ఫైటర్‌ గా మారుతుంది.

ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కళ్లకు కనిపించని శత్రువును ఆమె ఎలా ఎదుర్కొంటుంది ? తన కూతురు ఎక్కడుందో ఆమె ఎలా తెలుసుకుంటుంది ? ఈ నేర సామ్రాజ్యం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ? చివరికి బాణి తన బిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకురాగలదా ? కళ్ళే కనిపించని ఆ తల్లి పిల్లను ఎలా వెతికింది ? అనేదే సినిమాలోని అసలైన థ్రిల్.

Advertisement

Also Read : పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

తెలుగులోనూ అందుబాటులో…

కనికా ధిల్లాన్ రచన, నిర్మాణంలో దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ‘Gandhari’లో తాప్సీ పన్నూతో పాటు ఇష్వాక్ సింగ్, మితా వశిష్ట్, స్వస్తికా ముఖర్జీ, ఛాయా కదమ్, జతిన్ సర్నా, ప్రశాంత్ నారాయణన్ తదితరులు నటించారు. Netflixలో 2026 సెప్టెంబర్ 3న డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఈ హిందీ మూవీ తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో డబ్బింగ్ అందుబాటులో ఉంది. తల్లి ప్రేమ, రివేంజ్, కిడ్నాప్, క్రైమ్ మిస్టరీ, హై-వోల్టేజ్ యాక్షన్ కలిసిన ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు.

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×