E-Paper
Advertisement

OTT Movie : 16 గంటలు పడుకునే వింత జబ్బు… బుర్రపాడు ట్విస్టులున్న కన్నడ థ్రిల్లర్

OTT Movie : 16 గంటలు పడుకునే వింత జబ్బు… బుర్రపాడు ట్విస్టులున్న కన్నడ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ సరికొత్త స్టోరీతో ఆకట్టుకుంటోంది. ఈ కథ స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ & హ్యూమన్ ఎంబ్రయో ట్రాఫికింగ్ థీమ్స్‌తో ఉత్కంఠంగా నడుస్తుంది. ఇందులో రోజుకు ఆరు గంటలు మాత్రమే మెలుకువలో ఉండే వ్యక్తి , రివేంజ్ తీర్చుకునే సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ స్టోరీ క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. థ్రిల్లర్ అభిమానులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో ఉందంటే

జాదేష్ కుమార్ హంపి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “జెంటిల్‌మ్యాన్” (Gentleman). ఇది 2020 ఫిబ్రవరి 7న విడుదలైన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్, నిష్వికా నాయిడు, సంచారి విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఐయండిబిలో 6.8/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Sun NXT, జీ5 లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

భరత్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో పని చేసే ఒక సింపుల్ వ్యక్తి. అతను ఒక రేర్ డిసార్డర్ తో బాధపడుతుంటాడు. అతనికి “స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్” అనే జబ్బు ఉంటుంది. దీని వల్ల అతను రోజుకి 18 గంటలు పడుకుని, కేవలం 6 గంటలు మాత్రమే మెలుకువలో ఉంటాడు. ఈ సమయంలో ఉద్యోగం, కుటుంబ జీవితాన్ని చూసుకుంటాడు. అతని భార్య, కుమార్తె వరుతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లో ఉంటాడు. కానీ అతని సోదరుడు ప్రణవ్ డెత్ మిస్టరీతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. భరత్ ఇన్స్పెక్టర్ శివమూర్తి సహాయంతో అక్సిడెంట్ వెనుక రహస్యం తెలుసుకుంటాడు. ప్రణవ్ డెత్ హ్యూమన్ ఎగ్ సెల్స్ ట్రాఫికింగ్ (స్త్రీల అండాలను అక్రమంగా విక్రయించడం) మాఫియాతో లింక్ తో నే జరిగిందని  తెలుస్తుంది.

Read Also : ఊరవతల పాడుబడ్డ బిల్డింగ్… మిస్సైన తండ్రి కోసం అడుగు పెడితే అరాచకం… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

Advertisement

ఇది భరత్ రివెంజ్ క్వెస్ట్‌కు దారి తీస్తుంది. భరత్ మాఫియా హెడ్ జానీ ని వెంబడిస్తుంటాడు. ఇప్పుడు కూతురు వరు కూడా కిడ్నాప్ అవుతుంది. స్టోరీ మరింత ఇంటెన్స్ గా సాగుతుంది. ఇది అతని డైలీ రూటీన్ (స్లీప్ ఇష్యూస్)తో టెన్షన్ పెంచుతుంది. చివరికి భరత్ రివేంజ్ తీర్చుకుంటాడా ? వరుని కనిపెడతాడా ? వీటికి అతనికి ఉన్న సమయం సరిపోతుందా ? స్త్రీల అండాలతో మాఫియా ఏం చేస్తుంటుంది ? అనే విషయాలను, ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×