E-Paper
Advertisement

OTT Movie : ఊరవతల పాడుబడ్డ బిల్డింగ్… మిస్సైన తండ్రి కోసం అడుగు పెడితే అరాచకం… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

OTT Movie : ఊరవతల పాడుబడ్డ బిల్డింగ్… మిస్సైన తండ్రి కోసం అడుగు పెడితే అరాచకం… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్
Advertisement

OTT Movie : హారర్‌ సిరీస్‌ లను ఓటీటీలో తెగ చూసేస్తున్నారు మన ఆడియన్స్. ఏ భాషలో వచ్చినా వీటిపై ఓ లుక్ వేస్తున్నారు. ఇక సిరీస్ కంటెంట్ నచ్చితే చివరివరకూ వదలకుండా చూస్తున్నారు. తెలుగులో కూడా ఇప్పుడు హారర్‌ జానర్ లో వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా, రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఒక హారర్ వెబ్ సిరీస్ ను ఇంట్రెస్టింగ్ స్టోరీతో నడుస్తోంది. తండ్రి మిస్సింగ్ ను కనుక్కోవడానికి ప్రయత్నించే ఒక కూతురు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

‘మాన్షన్ 24’ (Mansion 24) 2023లో విడుదలైన ఒక తెలుగు భాషా హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను, 2023 అక్టోబర్ 4న దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. 6 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 2023 అక్టోబర్ 17 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

స్టోరీ ఏమిటంటే

ఒక ప్రముఖ ఆర్కియాలజిస్ట్ అయిన కలిదాస్ అనే వ్యక్తి కనిపించకుండా పోతాడు. అతను దేశంలోని అమూల్య వస్తువులను దొంగిలించి విదేశాలకు పారిపోయాడని ఆరోపణలు వస్తాయి. ఈ సమయంలో జర్నలిస్ట్ అయినటువంటి అతని కూతురు అమృత, తన తండ్రి కాళి దాస్ ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు అతని మిస్సింగ్ మిస్టరీని పరిష్కరించడానికి, ఆమె ఒక భయంకరమైన చరిత్ర కలిగిన, ఒక పురాతన బిల్డింగ్ లోకి వస్తుంది. అయితే దాని చుట్టూ భూతాలు, భయంకర ఘటనలు జరుగుతుంటాయి. అక్కడ అమృతను వాచ్‌మ్యాన్ కలుస్తాడు. అతను మాన్షన్‌లో జరిగిన పాత ఘోస్ట్ స్టోరీలు చెప్పుతూ ఆమెను గైడ్ చేస్తాడు. ప్రతి ఎపిసోడ్‌లో ఒక కొత్త కథ, అందులో చనిపోయిన వ్యక్తుల గురించి తెలుస్తుంది. అమృత ఈ స్టోరీల ద్వారా తన తండ్రి మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయా ? కలిదాస్ మిస్సింగ్ కి, ఆ మాన్షన్ కి సంబంధం ఏంటి ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×