BigTV English

OTT Movie : అర్ధరాత్రి ఆ పని చేసే జంట… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

OTT Movie : అర్ధరాత్రి ఆ పని చేసే జంట… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

OTT Movie : హారర్ జానర్ అందరికీ ఫేవరెట్. ఈ సినిమాలు భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఆ అనుభూతి చాలా బాగుంటుంది. అందుకే ఈ సినిమాలను ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు. మరి ఇలాంటి సినిమాలకు కామెడీ టచ్ ఇస్తే, అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇది నేపాలీ నేపాలీ సినిమా ఇదే కంటెంట్ తో వచ్చింది. ఇది నేపాలీ హారర్ సినిమాల్లో ఒక ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఒక కొత్త ఇంట్లో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్‌లో స్ట్రీమింగ్

‘ఘర్’ 2019 లో వచ్చిన నేపాలీ హారర్ సినిమా. దీనికి అర్పన్ థాపా దర్శకత్వం వహించారు. DS డిజిటల్, ASAP ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో షర్మిలా పాండే, సంతోష్ అధికారీ దీనిని నిర్మించారు. ఇందులో అర్పన్ థాపా, సురక్ష్య పంత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. IMDbలో ఈ సినిమా 5.5/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ శివ, సరు అనే జంట చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు కాఠ్మాండులో ఒక చౌకగా ఓ పాత ఇంటిని కొనుగోలు చేస్తారు. అందులో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. ఆ ఇల్లు దెయ్యాలు ఉన్నాయనే రూమర్స్‌తో చాలా తక్కువ ధరకు అమ్మకానికి వస్తుంది. కానీ శివ ఈ రూమర్స్‌ను పట్టించుకోకుండా ఇంటిని కొంటాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఈ జంటకు వింత అనుభవాలు మొదలవుతాయి. రాత్రి వేళల్లో గోడల నుండి వచ్చే భయంకరమైన శబ్దాలు, వింత ఆకారాలతో తిరిగే నీడలు, ఫర్నీచర్ హఠాత్తుగా కదలడం వంటి సంఘటనలు వీళ్ళను భయపెడతాయి. సరు గర్భవతిగా ఉండటం వల్ల ఆమె ఈ సంఘటనల పట్ల మరింత ఆందోళన చెందుతుంది. అయితే ఆమె కామెడీ స్వభావం కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయిస్తుంది.


సినిమా ముందుకు సాగే కొద్దీ, ఈ ఇంటి గతంలో ఒక దారుణమైన సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. దానితో ఈ దెయ్యం సీక్రెట్ ముడిపడి ఉంటుంది. శివ, సరు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు స్థానికుల సహాయం తీసుకుంటారు. అక్కడ ఒక బాబా ఈ ఇంటిలోని ఆత్మకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాడు. ఈ క్రమంలో వీళ్ళు ఎదుర్కొనే భయంకరమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. క్లైమాక్స్‌లో ఒక ఊహించని ట్విస్ట్‌తో, ఈ దెయ్యం వెనుక ఉన్న నిజం బయటపడుతుంది. ఆ నిజం ఏమిటి ? దెయ్యం ఆ ఇంట్లో ఎందుకు ఉంది ? ఈ జంట దానిని ఎలా ఎదుర్కుంటారు ? అనే విషయాలను ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

OTT Movie : స్టూడెంట్ తో టీచర్ పాడు పని… ఒక్కో సీన్ కు మెంటలెక్కాల్సిందే భయ్యా

OTT Movie : అబ్బాయిలను వశపరుచుకుని కోరిక తీర్చుకునే ఆడ దెయ్యం.. అమ్మాయిలనూ వదలకుండా…

OTT Movie : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : చెత్త కుండీలో శవం… శవం ఒకే అమ్మాయిది, ట్విస్టులు మాత్రం బోలెడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్

OTT Movie : భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా… ఈ అరాచకం చూస్తే కన్నీళ్లు ఆగవు భయ్యా

OTT Movie : పాపం పసికూన… తల్లి శవంతో 2 రోజులు ఇంట్లోనే రెండేళ్ల పాప… టెన్షన్ తోనే పోతారు భయ్యా

Big Stories

×