BigTV English

OTT Movie : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా చూడాలనుకుంటే, ‘The Beauty Inside’ సినిమాని మాత్రం మిస్ చేయకండి. ఇది రొమాంటిక్, ఫాంటసీ, కామెడీ థీమ్స్ తో ఆడియన్స్ చేత అరుపులు పెట్టిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కింది. ఇందులో హీరో ప్రతి రోజు ఒక కొత్త శరీరంలో మెళుకువలోకి వస్తాడు. ఈ క్రమంలో ఒక లవ్ స్టోరీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ సన్నివేశాలు ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘The Beauty Inside’ జాంగ్ యోల్ దర్శకత్వం వహించిన కొరియెన్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం. ఇందులో పార్క్ సియో-జూన్, లీ జిన్-వూక్, యూ యాన్-సియోక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 ఆగస్టు 20న దక్షిణ కొరియా థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 7 నిమిషాల నిడివితో IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే 

కిమ్ వూ-జిన్ అనే ఫర్నిచర్ డిజైనర్, తన 18వ పుట్టినరోజు నాడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు. ప్రతి రోజు ఉదయం అతను ఒక కొత్త శరీరంలో మెళుకువలోకి వస్తాడు. ఇది వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఉంటుంది. ఒక రోజు అతను యువకుడిలో, మరొక రోజు వృద్ధురాలిలో మరొక రోజు ఒక కొత్త రూపంలోకి మారుతుంటాడు. అతను తన రోజువారీ జీవితాన్ని రికార్డ్ చేస్తూ, రక, రకాల సరిపడే దుస్తులు, షూస్ లను సిద్ధంగా ఉంచుతాడు. అతను ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో పనిచేసే హాంగ్ యి-సూను ప్రేమిస్తాడు. కానీ తన ఈ స్థితి కారణంగా ఆమెను దూరం నుండి మాత్రమే చూస్తూ, ఆమెతో మాట్లాడటానికి మాత్రం వివిధ రూపాల్లో వస్తుంటాడు. ఒక రోజు అతను ఒక అందమైన యువకుడిగా రూపంలో వచ్చి, ఆమెను డేట్‌కు అడుగుతాడు. దీంతో వీళ్ళ ప్రేమకథ మొదలవుతుంది.


అయితే అతను ఆ రూపంలో ఉండటానికి, నిద్ర లేకుండా ఉంటాడు. ఎందుకంటే నిద్రలోకి వెళ్తే ఆ అందమైన రూపం పోతుంది. ఇది అతనికి మెంటల్ గా, ఫిజికల్ గా ఇబ్బంది కలిగిస్తుంది. వూ-జిన్ చివరికి యి-సూకు తన సీక్రెట్ ని చెప్పేస్తాడు. ఆమె మొదట షాక్ అయినప్పటికీ, అతని ప్రేమను అంగీకరిస్తుంది. అయితే అతని రోజు వారీ శరీర మార్పులు వీళ్ళ సంబంధానికి అడ్డుగా ఉంటాయి. యి-సూ ప్రతి రోజు ఒక కొత్త వ్యక్తితో తన ప్రేమను పంచాల్సి వస్తుంది. ఇది ఆమెను గందరగోళంలో పడేస్తుంది. చివరికి ఈ జంట, ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ కొరియెన్ రొమాంటిక్ ఫాంటసీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

OTT Movie : స్టూడెంట్ తో టీచర్ పాడు పని… ఒక్కో సీన్ కు మెంటలెక్కాల్సిందే భయ్యా

OTT Movie : అబ్బాయిలను వశపరుచుకుని కోరిక తీర్చుకునే ఆడ దెయ్యం.. అమ్మాయిలనూ వదలకుండా…

OTT Movie : అర్ధరాత్రి ఆ పని చేసే జంట… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… ఓటీటీని వణికిస్తున్న హర్రర్ మూవీ

OTT Movie : చెత్త కుండీలో శవం… శవం ఒకే అమ్మాయిది, ట్విస్టులు మాత్రం బోలెడు… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్

OTT Movie : భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా… ఈ అరాచకం చూస్తే కన్నీళ్లు ఆగవు భయ్యా

OTT Movie : పాపం పసికూన… తల్లి శవంతో 2 రోజులు ఇంట్లోనే రెండేళ్ల పాప… టెన్షన్ తోనే పోతారు భయ్యా

Big Stories

×