OTT Movie : ఇండోనీషియన్ జానపద కథల ఆధారంగా, ఒక భయంకరమైన హారర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఇండోనీషియా బాక్సాఫీస్‌లో 9.2 మిలియన్ టికెట్లు అమ్ముడై, అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 2022లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. ఒక నిసిద్ద ప్రాతంలోకి ఎంటరయ్యే విద్యార్థుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అక్కడ ఒక దెయ్యం చేతిలో చిక్కుకుని వీళ్ళు నానా తంటాలు పడతారు. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘KKN di Desa Penari’ 2022లో వచ్చిన ఇండోనీషియన్ సూపర్ నాచురల్ హారర్ సినిమా. దీనికి అవి సుర్యాది దర్శకత్వం వహించారు. సింపుల్‌మ్యాన్ అనే రచయిత రాసిన నవలఆధారంగా, ఈ కథను MD పిక్చర్స్, పిచ్‌హౌస్ ఫిల్మ్స్ నిర్మించాయి. ఇందులో తిస్సా బియాని, అదిందా థామస్, అచ్మద్ మెగంతర ప్రధాన పత్రాలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 2 గంటల 50 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో ఈ చిత్రానికి 5.9/10 రేటింగ్ ఉంది.
నూర్, విద్య, ఆయు, బిమా, ఆంటన్, వాహ్యు అనే ఆరుగురు యూనివర్సిటీ విద్యార్థులు తమ కులియా కెర్జా న్యాతా (KKN) అనే కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా తూర్పు జావాలోని ఒక అందమైన గ్రామానికి వెళతారు. ఈ గ్రామంలో ‘తపక్ తిలాస్’ అనే నిషిద్ధ ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉండే గేట్‌ను దాటవద్దని గ్రామస్తులు వీళ్ళను హెచ్చరిస్తారు. ఎందుకంటే అది ఒక రహస్యమైన ప్రదేశానికి దారితీస్తుంది. అక్కడ ఒక అందమైన బదరవుహి అనే జావనీస్ డాన్సర్ ఆత్మ ఉంటుందని చెబుతారు. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు విద్యార్థులు ఆ గేట్‌ను దాటుతారు.దీంతో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. నూర్‌కు తల నొప్పి వస్తుంది. విద్య ఒక రాత్రి ఆవేశంలో జావనీస్ నృత్యం చేస్తుంది. కానీ ఆమెకు ఆ విషయం గుర్తుండదు. గ్రామంలోని షమన్ మ్బాహ్ బుయుత్ నూర్‌ను ఒక ఆత్మ అనుసరిస్తోందని, విద్యను ఒక సూపర్‌నాచురల్ శక్తి లక్ష్యంగా చేసుకుందని హెచ్చరిస్తాడు.
ఈ సమయంలో బిమా రాత్రిపూట ఒంటరిగా తిరుగుతూ విచిత్రంగా ప్రవర్తిస్తాడు, ఆయు అతనితో ఏకాంతంగా గడుపుతుంది. ఇలా రకరకాల సంఘటనలు జరుగుతాయి. కథ ముందుకు సాగే కొద్దీ, బిమా, ఆయు తపక్ తిలాస్‌లో రహస్యంగా కలుస్తూ ఏకాంతంగా గడుపుతారు. దీనివల్ల బదరవుహి ఆత్మ ఆగ్రహానికి గురవుతుంది. అదే సమయంలో ఆయు మరణిస్తుంది. బిమా తపక్ తిలాస్‌లో బట్టలు లేకుండా, మరణానికి దగ్గరగా ఉన్న స్థితిలో కనిపిస్తాడు. బదరవుహి అనేది ఈ గ్రామాన్ని నియంత్రించే ఒక శక్తివంతమైన ఆత్మ. ఆమె నియమాలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తుంటుంది. ఈ కథ ఒక డౌనర్ ఎండింగ్‌తో ముగుస్తుంది. చివరికి ఈ టీమ్ లో ఎవరైనా ప్రాణాలతో మిగులుతారా ? అక్కడ ఉండే ఆత్మ గతం ఏమిటి ? ఎందుకు ఆ గ్రామంలో ఉంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?