E-Paper
Advertisement

OTT Movie : తప్పుడు వ్యక్తితో తప్పటడుగు వేసే అమ్మాయి… వణికిస్తున్న ఒక్కో సీన్… మైండ్ బ్లాక్ థ్రిల్లర్

OTT Movie : తప్పుడు వ్యక్తితో తప్పటడుగు వేసే అమ్మాయి… వణికిస్తున్న ఒక్కో సీన్… మైండ్ బ్లాక్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : జపాన్ ఎక్స్‌ట్రీమ్ హారర్ జోనర్‌లో వచ్చిన ఒక సైకో సినిమా థియేట్రికల్ రిలీజ్ లోనే బ్యాన్ అయింది. కొన్ని దేశాలలో భారీ కట్స్‌తో వచ్చింది. ఈ సినిమా చాలా దేశాల్లో బ్యాన్ అయిన కారణంగా, కొన్ని ఎక్స్‌ట్రీమ్ హారర్ సైట్స్ లో మాత్రమే దొరుకుతుంది. చాలా మంది ఈ సినిమాను చూసి నిద్రలేని రాత్రులు గడిపారు. టార్చర్ కి మారు పేరుగా ఉండే ఈ సినిమాను చూడకపోవడమే మంచిది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం పదండి.

ఈ సినిమా పేరు ఏమిటంటే

2009లో జపాన్ డైరెక్టర్ కోజి షీరాయిషీ తీసిన ఈ ఎక్స్‌ట్రీమ్ హారర్ సినిమాపేరు ‘గ్రోటెస్క్’ (Grotesque). 76 నిమిషాల నాన్‌స్టాప్ టార్చర్ సీన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టిస్తుంది. ఒక జంటను ఒక సైకోపత్ డాక్టర్ కిడ్నాప్ చేసి, వాళ్లను రోజుల పాటు టార్చర్ చేస్తాడు. ఈ సీన్స్ వల్ల ఈ సినిమాని బ్యాన్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ మూవీ Mubiలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : ప్రియుడి కిరాతకం… ఆటో డ్రైవర్ అరాచకం… మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు

స్టోరీ ఏమిటంటే

అకీ, కెంటా అనే కొత్తగా ప్రేమలో పడిన జంట, ఫస్ట్ డేట్‌కి ఒక రోడ్ ట్రిప్ లో ఉంటుంది. ఒకచోట వీళ్ళను ఒక వ్యక్తి క్లోరోఫామ్‌ ఇచ్చి కిడ్నాప్ చేస్తాడు. కళ్లు తెరిచినప్పుడు వాళ్లు ఒక ఇంటి బేస్‌మెంట్‌లో ఇనుప గొలుసులతో కట్టేసి ఉంటారు. అక్కడ గోడలు రక్తంతో తడిసిపోయి ఉంటాయి. శరీర భాగాలు వేలాడుతూ ఉంటాయి. వీళ్ళని కిడ్నాప్ చేసింది ఒక డాక్టర్ అని తెలుస్తుంది. ఆటను ఇద్దరి ముందు నిలబడి ఒక్కటే ప్రశ్న వేస్తాడు. మీ ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా? ఉంటే మీకు మీరే బయటపడతారు, లేకపోతే ఇక్కడే చచ్చిపోతారు అని చావు కబురు చల్లగా చెప్తాడు. ఆ తర్వాత సినిమా మొత్తం నాన్‌స్టాప్ టార్చర్ మాత్రమే ఉంటుంది. మొదట వాళ్ళ ఫింగర్ నెయిల్స్ పీకేస్తాడు, తర్వాత నీడిల్స్ పొడుస్తాడు అకీ భయంతో అరుస్తూ కెంటా అని పిలుస్తూ ఉంటుంది. కానీ డాక్టర్ ఆగకుండా ఒక దశలో కెంటా అవయవాలు బయటకు తీసి, అకీని దాన్ని తినమని బలవంతం చేస్తాడు. ఆమె తినకపోతే ఆమె కళ్లు పీకేస్తానని బెదిరిస్తాడు. ఇద్దరూ రక్తంలో మునిగిపోతారు.

Advertisement

మరుసటి రోజు డాక్టర్ ఇంకా క్రూరంగా మారతాడు. ఇద్దరినీ ఒకరినొకరు టార్చర్ చేసుకోమని ఆర్డర్ ఇస్తాడు. ఒకరు చచ్చిపోతే మరొకరిని వదిలేస్తానని ని డీల్ పెడతాడు. కెంటా భయంతో అకీని టార్చర్ చేయడం మొదలెడతాడు. ఆమెని కత్తితో కోసేస్తాడు. అకీ అరుస్తూ నన్ను చంపేయ్, నీకు నామీద ప్రేమ లేదు అని అరుస్తుంది. ఈ సమయంలో డాక్టర్ ఆ సీన్ రికార్డ్ చేస్తూ నవ్వుతుంటాడు. క్లైమాక్స్ లో స్టోరీ మరింత భయంకరంగా ఉంటుంది. డాక్టర్ ఇద్దరినీ ఒకే టేబుల్ మీద పడుకోబెట్టి, వాళ్ల శరీరాల్లోకి డ్రిల్ పెట్టి రంధ్రాలు చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఈ జంట ఆ సైకో డాక్టర్ చేతిలో బలవుతుందా ? ప్రాణాలతో బయట పడుతుందా ? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×