E-Paper
Advertisement

Dog Pooping Behavior: కుక్కలు మల విసర్జనకు ముందు గుండ్రంగా ఎందుకు తిరుగుతాయి?

Dog Pooping Behavior: కుక్కలు మల విసర్జనకు ముందు గుండ్రంగా ఎందుకు తిరుగుతాయి?
Advertisement

Dog Behavior Insights: మీరు ఎప్పుడైనా గమనించారా.. కుక్కలు మలవిసర్జన చేసే ముందు చాలాసేపు అటూ ఇటూ వెతుకుతూ గుండ్రంగా తిరుగుతుంటాయి? ఈ ప్రవర్తన గురించి చాలామందిలో ఎప్పటి నుంచో సందేహం ఉండే ఉంటుంది. ఇప్పుడీ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..

నిపుణులు ఏమంటున్నారంటే?

కుక్కలు అలా గుండ్రంగా తిరగడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిపుణులు అంచనా వేశారు. మల విజర్జనకు ముందు కుక్కలు అలా గుండ్రంగా తిరగడం అనేది పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని, ఈ హాబిట్ వాటికి సౌకర్యవంతమైన ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుందని తెలిపారు. అందుకే కుక్కలు అలా గుండ్రంగా తిరుగుతాయట. శునకాలు మూత్రం పోసే ముందు అలా తిరగడం వెనుక మరిన్ని కారణాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆ కారణాలు ఏంటంటే..

భూమి అయస్కాంత క్షేత్రం:

Advertisement

2014 అధ్యయనం ప్రకారం.. కుక్కలు తమ మల విసర్జనను భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా, అంటే ఉత్తర-దక్షిణ అక్షం వైపు చేస్తాయట. ఇలా గుండ్రంగా తిరుగడం ద్వారా అవి క్షేత్రాన్ని అంచనా వేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రాంతాన్ని గుర్తించడం:

సాధారణంగానే కుక్కల పాదాల్లో స్వేద గ్రంథులు ఉంటాయి. ఇవి సౌకర్యవంతమైన ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడతాయి. దీంతో కుక్కలు మల విసర్జనకు ముందు గుండ్రంగా తిరుగుతుంటాయి. ఈ ప్రవర్తన వల్ల ఏ ప్రదేశం సురక్షితమే గుర్తించి ఇతర కుక్కలకూ తెలియజేస్తాయి.

సురక్షితమైన స్థలం:

Advertisement

కుక్కలు అడవిలో ఉన్నప్పుడు.. తమని తాము రక్షించుకోవడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో చుట్టూ వాసన చూస్తూ, గాలిని పసిగట్టి, ప్రమాదాలు లేని స్థలంలో తలదాచుకుంటాయట. కాబట్టి గుండ్రంగా తిరిగే అలవాటు కుక్కలకు వారసత్వంగా వచ్చాయనే చెప్పాలి.

పరిశుభ్రత:

పడుకునే ముందు లేదా మల విసర్జనకు వెళ్లే ముందు కుక్కలు గుండ్రంగా తిరగడం అనేది స్వీయ సంరక్షణ చర్య అని చెబుతున్నారు నిపుణులు. అలాగే కొన్నిసార్లు కుక్కలు ఎక్కువగా తిరుగుతూ, అసౌకర్యంగా కనిపిస్తే అవి జీర్ణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగానూ కావచ్చు. అయితే ఈ గుండ్రంగా తిరగడం అనేది ఒక సహజ అలవాటు మాత్రమే.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×