E-Paper
Advertisement

Best Movie in Prime Video : ముసలి మొగుడిపై గూఢచర్యం… ఈ జనరేషన్ ప్రేమ కథ… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్

Best Movie in Prime Video : ముసలి మొగుడిపై గూఢచర్యం… ఈ జనరేషన్ ప్రేమ కథ… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
Advertisement

Best Movie in Prime Video : ఓటీటీలో ఓ మరాఠీ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇది 2025 మే డే స్పెషల్‌గా మహారాష్ట్రలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇది ప్రేమకు వయసు అడ్డుకాదని చూపించే హార్ట్‌వార్మింగ్ స్టోరీ. అయితే స్టోరీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కథలో పెళ్లి చేసుకోవాలనుకునే ఒక ప్రేమ జంటకి షాకింగ్ ట్విస్ట్ ఎదురుపడుతుంది. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి కాలేజ్ రోజుల్లో ప్రేమికులని తెలిసాక గందరగోళం మొదలవుతుంది. చివరి వరకు ఆసక్తికరంగా సాగే ఈ కథ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఫ్యామిలీతో కలసి ఈ సినిమాను ఎంచక్కా చూసేయండి. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

ఈ మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా పేరు ‘గుల్కండ్’. డైరెక్టర్ సచిన్ గోస్వామి దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో సమీర్ చౌగులే (సమీర్), ఈశా దేయ్ (ఈశా), సాయ్ తమ్హాన్కర్, ప్రసాద్ ఓక్, వనితా ఖారత్, మండార్ మండవ్కర్ వంటి నటులు నటించారు. 2 గంటల 26 నిమిషాల ఈ U సర్టిఫికేట్ ఫ్యామిలీ డ్రామా ఐయండిబిలో 7.6/10 రేటింగ్ పొందింది. 2025 మే 1న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఓంకార్, మీనాక్షి అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ఫ్యామిలీ నుంచి అనుకున్నంత సపోర్ట్ దొరకదు.
చాలా సంవత్సరాల క్రితం, మినాక్షి తల్లి నీతా, ఓంకార్ తండ్రి గిరీష్ కాలేజ్ డేస్ లో ప్రేమించుకున్నారు, కానీ వివాహం చేసుకోలేకపోయారు. ఓంకార్, మినాక్షి వివాహం గురించి చర్చించడానికి రెండు కుటుంబాలు కలిసినప్పుడు, నీతా, గిరీష్ తిరిగి కలుస్తారు. ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. వీళ్ళ పాట ప్రేమ మళ్ళీ పులకిస్తుంది. ఓంకార్ తల్లి రాగిణికి తన భర్త, నీతా మధ్య ఏదో జరుగుతోందని, ఏదైనా అక్రమ సంబంధం ఉందని అనుమానిస్తుంది. ఆమె మీనాక్షి తండ్రి మకరంద్ కి సమాచారం ఇస్తుంది.

Read Also : టన్నెల్ లో ఇరుక్కుపోయే కామన్ మ్యాన్… చేతులెత్తేసే ఆఫీసర్లు… మైండ్ బ్లాకయ్యే సర్వైవల్ థ్రిల్లర్

 ఇప్పుడు రాగిణి మకరంద్ కలిసి గిరీష్, నీతా వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచుతారు. అయితే వాళ్ళు తరచుగా మాట్లాడుకోవడం వల్ల వీళ్ళకు మరింత అనుమానం వస్తుంది. దీంతో అక్కడి వాళ్ళంతా గందరగోళంలో పడతారు. చివరికి ఓంకార్, మీనాక్షి వివాహం చేసుకోగలరా ? గిరీష్, నీతల సంబంధం ఎలాంటిది ? ఈ కథకి ముగింపు ఏమిటి ? అనే విషయాలను, ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని చూసి తలుసుకోండి.
Advertisement

 

 

 

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×