E-Paper
Advertisement

Pakistan : 2025లో పాకిస్తాన్ కు నిద్ర‌లేకుండా చేసిన టీమిండియా ప్లేయ‌ర్‌..గూగుల్ లో సెర్చింగ్‌లో తోపు !

Pakistan : 2025లో పాకిస్తాన్ కు నిద్ర‌లేకుండా చేసిన టీమిండియా ప్లేయ‌ర్‌..గూగుల్ లో సెర్చింగ్‌లో తోపు !
Advertisement

Pakistan : సాధార‌ణంగా ప్ర‌స్తుతం ఏ చిన్న విష‌యం అయినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టం మ‌నం నిత్యం చూస్తున్నాం. సెల‌బ్రిటీలు ఏ రంగానికి చెందిన వారు అయినా అదే ప‌రిస్థితి జ‌రుగుతుంది. ముఖ్యంగా క్రీడాకారులు, పొలిటిక‌ల్ లీడ‌ర్స్, సినీ సెల‌బ్రిటీలు ఇలా ఏ రంగం వారికి చెందిన ప్ర‌తీ విష‌యం క్ష‌ణాల్లో వైర‌ల్ అవ్వ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఈ ఏడాది (2025) పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ల జాబితాలో అభిషేక్ శర్మ ఉన్నాడు. ఆసియా క‌ప్ 2025లో పాకిస్తాన్ పై అభిషేక్ బాగా ఆడాడు అందుకే.. పాకిస్తాన్ వాళ్లు ఎక్కువ శాతం అభిషేక్ శ‌ర్మ పేరును సెర్చ్ చేశారు. అభిషేక్ శ‌ర్మ ఇన్నింగ్స్ హైలెట్ అనే చెప్పాలి. పాకిస్తాన్ జ‌ట్టుతో ఫైన‌ల్ మ్యాచ్ లో మిన‌హా మిగ‌తా మ్యాచ్ ల‌న్నింటిలో అద్భుత‌మైన ఫామ్ లో కొన‌సాగాడు. టీమిండియా ఆసియా క‌ప్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు అభిషేక్ శ‌ర్మ‌.

Also Read : Aiden Markram: కోహ్లీ, రోహిత్ బ్యాగులు స‌ర్దేశారు..ఇక టీమిండియాను నేల నాకిస్తాం!

అభిషేక్ శ‌ర్మ తొలి స్థానంలో..

Advertisement

ఈ ఏడాది(2025) పాకిస్థాన్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్ల జాబితా ను ఒక‌సారి ప‌రిశీలించిన‌ట్ట‌యితే.. అభిషేక్ శ‌ర్మ (భార‌త్ ) మొద‌టి స్థానంలో ఉండ‌గా.. హసన్ నవాజ్ (పాకిస్థాన్ క్రికెటర్) రెండో స్థానంలో, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ (పాకిస్థాన్ క్రికెటర్) మూడో స్థానంలో, నాలుగో స్థానంలో సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్ క్రికెటర్), ముహమ్మద్ అబ్బాస్ (పాకిస్థాన్ క్రికెటర్) ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. వీరి ఐదుగురి గురించి పాకిస్తాన్ సోష‌ల్ మీడియా తెగ సెర్చ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆసియా క‌ప్ సంద‌ర్భంలో అభిషేక్ శ‌ర్మ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ప్ర‌తీ మ్యాచ్ లో హాఫ్ సెంచ‌రీ చేసేవాడు. పాకిస్తాన్ పై అయితే రెచ్చిపోయేవాడు. అందుకే అభిషేక్ శ‌ర్మ గురించి పాకిస్తాన్ సోష‌ల్ మీడియాలో సెర్చ్ చేసిన వారిలో టాప్ లో భార‌త క్రికెట‌ర్ అభిషేక్ శర్మ కొన‌సాగటం విశేషం.

అత్య‌ధిక సిక్స‌ర్ల రికార్డు అత‌ని పేరిట‌నే..!

మ‌రోవైపు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ జ‌ట్టుకు కెప్టెన్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్న లెప్ట్ హ్యాండ్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర్షం కురుస్తోంది. అత‌ని స్ట్రైక్ రేట్ చూసి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు అంతా హ‌డ‌లెత్తిపోవ‌డం విశేషం. మ‌రోవైపు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అత్య‌ధికంగా సిక్స‌ర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డును నెల‌కొల్పాడు అభిషేక్ శ‌ర్మ‌. ఈ టోర్నమెంట్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయన మొత్తం 26 సిక్సర్లను బాదాడు. ఈ ఘనతతో అంతకుముందు 25 సిక్సర్లతో ముందున్న ఆయుష్ మ్హాత్రేను అభిషేక్ అధిగమించాడు. అంతేకాకుండా, 6 మ్యాచ్‌లలో 26 సిక్సర్లతో పాటు మొత్తం 304 పరుగులు చేసి, టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు 325 పరుగులతో ఆయుష్ మ్హాత్రే కొనసాగుతున్నాడు.

Advertisement

Also Read : India vs Pakistan: జియో హాట్‌స్టార్ ను వేధిస్తోన్న‌ పాకిస్తాన్..అందుకే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఔట్ ?

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×