E-Paper
Advertisement

‘గుల్లక్’ సిరీస్ నుండి అన్ను భయ్యాను ఎందుకు తొలగించారో తెలుసా ?

‘గుల్లక్’ సిరీస్ నుండి అన్ను భయ్యాను ఎందుకు తొలగించారో తెలుసా ?
Advertisement

Gullak Season 5 : ‘గుల్లక్’ అంటే ఇంటింటా ప్రతి ఒక్కరికీ తెలిసిన సిరీస్. మిశ్రా కుటుంబం జీవితం, వాళ్ల సమస్యలు, చిన్న చిన్న సంతోషాలు… ఇవన్నీ చూస్తుంటే మన కుటుంబం గుర్తు వస్తుంది. ఇప్పుడు ఆ సిరీస్ ఐదో సీజన్‌ స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతోంది. కానీ ఈసారి ఫ్యాన్స్‌ కు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అందరి అభిమానం చూరగొన్న అన్ను భయ్యా పాత్రలో నటించిన వైభవ్ రాజ్ గుప్తా ఈ సీజన్‌లో లేడు. అతని స్థానంలో కొత్త ముఖం వచ్చేసింది. ఈ వార్త వినగానే ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఆయనను సిరీస్ నుంచి తొలగించడానికి గల కారణం ఏంటి ? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరి మేకర్స్ ఇలా చేయడం వెనకున్న అసలు కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇదే కారణం

నటుడు వైభవ్ కు ఈ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు దక్కింది. అయితే ఈ సీజన్లో మాత్రం వైభవ్ తన పారితోషికం భారీగా పెంచాలని డిమాండ్ చేశాడట. గత సీజన్‌ లో ఇచ్చినంతకంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశాడట. నిజానికి ‘గుల్లక్’ సిరీస్ ను చాలా సింపుల్ బడ్జెట్‌ తో తీస్తున్నారు మేకర్స్. అందువల్ల నిర్మాతలు TVF – SonyLIV (సోనీ లివ్) ఆ డిమాండ్‌ ను అంగీకరించలేకపోయారు. దీంతో వైభవ్‌ తో ఒప్పందం కుదరలేదు. ఫలితంగా ఆయన పోషించిన అన్ను భయ్యా పాత్రలో కొత్త ముఖం వచ్చేసింది. ‘12th ఫెయిల్’ సినిమాలో బాగా నటించిన అనంత్ వి జోషి ఈ పాత్రలో కనిపించబోతున్నారు. ఇతను ఎలా పాత్రను హ్యాండిల్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Also Read : 25,21,00,000 వ్యూస్… నాలుగేళ్లుగా నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తున్న సిరీస్… ఇదేం పిచ్చి సామీ

సీజన్ 5 ఎప్పుడు వస్తుంది ?

జూన్ 5 నుంచి SonyLIVలో ‘గుల్లక్ సీజన్ 5’ స్ట్రీమింగ్ అవుతుంది. అన్ను భయ్యా మారినా, మిగతా మిశ్రా కుటుంబం మళ్లీ కళకళలాడుతుంది. జమీల్ ఖాన్ (సంతోష్ మిశ్రా), గీతాంజలి కులకర్ణి (శాంతి మిశ్రా), హర్ష్ మేయర్ (అమన్ మిశ్రా) వాళ్లంతా ఈ సీజన్ తో తిరిగి వస్తున్నారు. సునీతా రాజ్వార్, గోపాల్ దత్, హెల్లీ షా వంటి నటీనటులు కూడా ఇందులో ఉన్నారు. ‘గుల్లక్’ మధ్యతరగతి కుటుంబం జీవితాన్ని చాలా రియల్‌ గా, హాస్యంగా చూపిస్తుంది. ఈ సీజన్‌ లో కూడా అదే స్టైల్ కొనసాగుతుంది. కుటుంబ సంబంధాలు, చిన్న చిన్న సమస్యలు, సంతోషాలు… అన్నీ ఉంటాయి. ఫ్యాన్స్‌ కు ఇది కొంచెం షాక్ ఇచ్చినా, కొత్త అన్ను భయ్యా ఎలా ఉంటాడో చూడాలని ఎదురు చూస్తున్నారు.

Advertisement

Also Read : అబ్బాయిలు కన్పిస్తే రెచ్చిపోయి ఆ పాడు పని చేసే మోహినీ పిశాచి

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×