E-Paper
Advertisement

అబ్బాయిలు కన్పిస్తే రెచ్చిపోయి ఆ పాడు పని చేసే మోహినీ పిశాచి

అబ్బాయిలు కన్పిస్తే రెచ్చిపోయి ఆ పాడు పని చేసే మోహినీ పిశాచి
Advertisement

Horror Movie OTT : హర్రర్ మూవీ లవర్స్ పండగ చేసుకునే మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చింది. అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆ సినిమా ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇదొక రష్యన్ హారర్ చిత్రం. అసలు పేరు ‘సక్యుబస్’ (Succubus – 2024). మన ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో డబ్ చేసి ‘సెడ్యూసర్’ (Seducer) అని పేరు పెట్టి JioHotstarలో విడుదల చేశారు. దర్శకుడు అలెగ్జాండర్ డొమొగరోవ్ జూనియర్ చాలా అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించాడు. ప్రధాన పాత్రల్లో అంజెలీనా స్ట్రెచినా, రోమన్ వాసిలీవ్, మిఖాయిల్ త్రోయినిక్ వంటి నటీనటులు నటించారు. వీళ్లంతా తమ నటనతో హారర్ సన్నివేశాలను చాలా సహజంగా, భయపెట్టేలా చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది.

రెండేళ్ల తరువాత తెలుగులో 

Advertisement

2024లో రష్యాలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇండియాలో నేరుగా ఓటీటీలోనే వచ్చింది. హారర్ అండ్ బోల్డ్ సన్నివేశాలు కలిపి చాలా ఇంటెన్స్‌ గా ఉంటుంది. దెయ్యం మనుషుల రూపం మార్చుకుని చేసే ట్విస్టులు చూస్తే నిద్ర పట్టదు. మనసులో దాగి ఉన్న చెడు ఆలోచనలను బయటకు తీసి వాళ్లను ఎలా నాశనం చేస్తుందో చూస్తే గుండె గల్లంతవ్వడం ఖాయం. హారర్, సస్పెన్స్, థ్రిల్ కలిపిన సినిమాలంటే ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపలేరు. భయం, ఉత్కంఠ, ఆశ్చర్యం… అన్నీ ఒక్కటే సినిమాలో ఉన్నాయి.

Also Read : థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే

మోహంతో చంపేసే మోహినీ

Advertisement

ఈ సినిమా కథ చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ, సడన్ గా గుండె జారిపోయినట్టు అన్పిస్తుంది. కొందరు సిటీ యువకులు సరదాగా ఎంజాయ్ చేయాలని ఒక మారుమూల పల్లెటూరికి వెళ్తారు. అక్కడికి వెళ్లగానే వాళ్లు ఒక ప్రమాదకరమైన ప్రాంతంలోకి అడుగు పెడతారు. అక్కడ ఒక భయంకరమైన దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం మామూలు దెయ్యాల్లా కాదు… మనుషుల్లా రూపాన్ని మార్చుకోగలదు. ఈ దెయ్యం వాళ్ల భయాలను, బలహీనతలను, మనసులో దాగి ఉన్న చెడు ఆలోచనలను, ముఖ్యంగా కామ వాంఛలను బయటకు తీసి వాళ్లను పూర్తిగా మార్చేస్తుంది. ఒకరినొకరు అనుమానించుకునేలా చేసి, గొడవలు పెట్టి, క్రూరంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కరిగా వలలో వేసుకుంటూ వాళ్లను భయపెడుతుంది. చివరికి ఆ మాయా ఆత్మల వల నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు ? ఆ ఊరి వెనుక ఉన్న నిజమైన రహస్యం ఏమిటి ? అనేది ఈ సినిమాలోని పెద్ద థ్రిల్.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×