E-Paper
Advertisement

OTT Movie : దెయ్యాల కొంపలోకి తింగరి బ్రదర్స్… కామెడీతో కడుపుబ్బా నవ్వించే హారర్ సినిమా

OTT Movie : దెయ్యాల కొంపలోకి తింగరి బ్రదర్స్… కామెడీతో కడుపుబ్బా నవ్వించే హారర్ సినిమా
Advertisement

OTT Movie :అతీంద్రియ శక్తుల చుట్టూ తిరిగే ఒక కొరియన్ కామెడీ హారర్ సినిమాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇద్దరు స్నేహితులతో మొదలయ్యే ఈ కథ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఒక పల్లెటూరిలో సెటిల్ అవ్వాలనుకున్న వీళ్ళకి ఓ హాంటెడ్ దెయ్యం ఎదురు పడుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కరూ విచిత్రంగా చచ్చిపోతుంటారు. క్లైమాక్స్ వరకు ఈ సినిమా కుర్చీల్లో కూర్చోబెడుతుంది. ఓ వైపు భయపెట్టిస్తూ, మరో వైపు నవ్విస్తూ ఈ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది.  దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2024లో విడుదలైన ఈ కొరియన్ కామెడీ హారర్ చిత్రం పేరు “హ్యాండ్‌సమ్ గైస్” (Handsome Guys). ఇది 2010లో వచ్చిన కెనడియన్ హారర్ కామెడీ చిత్రం టక్కర్ & డేల్ వర్సెస్ ఈవిల్ (Tucker & Dale vs. Evil)కి రీమేక్. నామ్ డాంగ్-హ్యుప్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో లీ సుంగ్-మిన్, లీ హీ-జూన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

Advertisement

జె-పిల్, సాంగ్-గూ అనే ఇద్దరు స్నేహితులు తమను తాము అందగాళ్లుగా భావిస్తూ ఉంటారు. సిటీ లైఫ్ కి దూరంగా, పల్లెటూరిలో కొనుగోలు చేసిన తమ కలల ఇంటికి మారి, ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడతారు. అయితే కొంచెం వీళ్ళ మోటు ప్రవర్తన వల్ల అక్కడ నివసించే స్థానికులు అనుమానంగా చూస్తారు. అదే సమయంలో కొంతమంది కాలేజీ విద్యార్థులు సమీపంలోని అడవిలో క్యాంపింగ్ చేయడానికి వస్తారు. అనుకోకుండా ఆ విద్యార్థులలో ఒక అమ్మాయి నీటిలో మునిగిపోతుండగా జె-పిల్, సాంగ్-గూ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తారు. కానీ పరిస్థితి తప్పుగా అర్ధం చేసుకోవడంతో, విద్యార్థులంతా వీళ్ళను కిడ్నాపర్లుగా భావిస్తారు. ఇక్కడి నుంచి గందరగోళం మొదలవుతుంది.

Read Also : దేవుడి ఇంటికి రాసిన ఉత్తరంతో పోస్ట్ మ్యాన్ తిప్పలు… తండ్రి కోసం తల్లడిల్లిపోతూ

జె-పిల్, సాంగ్-గూ ఇంట్లో వింత ప్రమాదాలు, మరణాలు మొదలవుతాయి. విద్యార్థులు ఒక్కొక్కరు విచిత్రంగా చనిపోతుంటారు. దీంతో ఇంట్లో శవాల సంఖ్య పెరుగుతుంది. పరిస్థితి అదుపు తప్పుతున్న తరుణంలో, ఆ ఇంటి బేస్ మెంట్ లో దశాబ్దాలుగా సీల్ చేయబడిన ఒక దుష్ట ఆత్మ మేల్కొంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ జాంబీ రూపంలో ఉన్న ఈ ఆత్మ నుండి ప్రాణహాని ఏర్పడుతుంది. చివరికి ఈ అతీంద్రియ శక్తిని నుంచి వీళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? ఆ దెయ్యానికి బలవుతారా ? అనే విషయాలను, ఈ కొరియన్ కామెడీ హారర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

Related News

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×