BigTV English

OTT Movie : ఈ కాలేజ్ లో పిల్లలంతా ఆ ఆట ఆడాల్సిందే… గ్యాప్ లేకుండా పాడు సీన్లు… దిమాక్ కరాబ్ చేసే డార్క్ కామెడీ

OTT Movie : ఈ కాలేజ్ లో పిల్లలంతా ఆ ఆట ఆడాల్సిందే… గ్యాప్ లేకుండా పాడు సీన్లు… దిమాక్ కరాబ్ చేసే డార్క్ కామెడీ

OTT Movie: టీనేజ్ లైఫ్ స్కూల్ డేస్ లో ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ సిడ్నీలోని హార్ట్‌లీ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయుల చుట్టూ తిరుగుతుంది. యుక్తవయసు సమస్యలను ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే ఈ సిరీస్ ని ఒంటరిగా చూడటమే మంచిది. ఎందుకంటే ఇందులో బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీలోకి వెళ్తే

ఈ కథ అమెరీ, ఆమె బెస్ట్ ఫ్రెండ్ హార్పర్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు స్కూల్‌లో “ఇన్సెస్ట్ వాల్” అనే గోడపై విద్యార్థుల రొమాంటిక్ సంబంధాల గురించి ఒక డైగ్రామ్‌ను గీస్తారు. ఈ విషయం అక్కడ బయటికి వస్తుంది. అయితే అమెరీ, హార్పర్ పేరును బయటపెట్టకుండా, దీనికి తానొక్కటే బాధ్యత వహిస్తుంది. దీనివల్ల ఆమె స్కూల్‌లో ఒంటరిగా మారుతుంది. ఈ సంఘటన కారణంగా, గోడపై పేర్లు ఉన్న విద్యార్థులు లిటరసీ ట్యుటోరియల్ క్లాసులకు హాజరవ్వాలని స్కూల్ యాజమాన్యం ఆదేశిస్తుంది. విద్యార్థులు మొదట్లో ఈ క్లాసులను “స్లట్స్” అని ఎగతాళి చేస్తారు. అమెరీ కొత్త స్నేహితులైన క్విన్ని, డారెన్ తో స్నేహం చేస్తుంది. ఈ సమయంలో అమెరీ, హార్పర్ మధ్య సంబంధం ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌లో జరిగిన దారుణ సంఘటన వల్ల విరిగిపోతుంది. ఈ ఫెస్టివల్‌లో, హార్పర్ డ్రగ్ ఓవర్‌డోస్‌తో స్పృహ కోల్పోతుంది. చూక్ అనే గ్యాంగ్ లీడర్‌ ఆమెను కిడ్నాప్ చేస్తాడు.


అయితే ఆ గ్యాంగ్‌లో ఒక వ్యక్తి హార్పర్‌ను రక్షించడానికి సహాయం చేస్తాడు. అయితే హార్పర్ అమెరీ ఇంటికి వెళ్ళినప్పుడు, అమెరీ వేరొకరితో ఉండటం వల్ల డోర్ లాక్ చేసుకుంటుంది. హార్పర్ ఇంటికి వెళ్లడంతో, ఆమె తండ్రి మద్యం మత్తులో ఆమెపై దాడి చేస్తాడు. దీనివల్ల ఆమె ఆస్పత్రిలో చేరుతుంది. ఈ సీజన్ చివరిలో, అమెరీ హార్పర్‌కు జరిగిన సంఘటన గురించి తెలుసుకుని, ఆమెకు మద్దతుగా నిలుస్తుంది. ఆమె కిడ్నాప్ రాత్రికి సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని సేకరిస్తుంది. దీంతో కొంతమంది అరెస్టు అవుతారు. కానీ చూక్ తప్పించుకుంటాడు. అమెరీ, హార్పర్ చూక్ కారును తగలబెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటారు. వీళ్ళ ఫ్రెండ్ షిప్ మళ్ళీ గాడిన పడుతుంది. ఇంతకీ కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది ? హార్పర్‌ పై ఆమె తండ్రి ఎందుకు దాడి చేస్తాడు ? నెరస్థులకు శిక్ష పడుతుందా ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘Heartbreak High’ ఆస్ట్రేలియన్ టీన్ డ్రామా వెబ్ సిరీస్. ఇది 2022 సెప్టెంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి సీజన్ (8 ఎపిసోడ్‌లు) విడుదలైంది. హన్నా కారోల్ చాప్‌మాన్ సృష్టించిన ఈ సిరీస్, సిడ్నీలోని హార్ట్‌లీ హై స్కూల్‌లో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆసిఫ్ ఆలీ (అమీర్), క్లో హేడెన్ (క్విన్నీ), జేమ్స్ మాజో (డారెన్), థామస్ వెదరాల్ (మాల్‌కై), విల్ మెక్‌డొనాల్డ్ (కాష్), జెమ్మా చువా-ట్రాన్ (సాషా), బ్రిన్ చాప్‌మాన్ (స్పెన్సర్), షెరీ-లీ వాట్సన్ (మిస్సీ), కార్టియా బెస్లీ (హార్పర్) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఇది 7.7/10 రేటింగ్ ను పొందింది. 2023లో AACTA అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా సిరీస్, బెస్ట్ స్క్రీన్‌ప్లే సహా చాలా అవార్డులను గెలుచుకుంది. ఇందులో ఆసిఫ్ ఆలీ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా నామినేట్ అయ్యాడు.

Read Also : స్టార్ హీరో కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు… ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్… ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?

Related News

OTT Movie : డిజిటల్ యుగంలో జరిగే క్రైమ్స్ అన్నీ ఈ ఒక్క మలయాళ మూవీలోనే… కేసు కేసుకో ఇంటెన్స్ క్రైమ్ కథ

OTT Movie : అమ్మాయిలు కన్పిస్తే చాలు అల్లాడిపోయే ఆటగాడు… కోడల్ని కూడా వదలకుండా… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : బ్రిడ్జి కింద మనుషుల ఎముకలు… 40 ఏళ్ల మిస్టరీ… మతిపోగొట్టే ట్విస్టులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : బాక్స్ లో పడుకున్న దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే కపుల్… గుండె ధైర్యం ఉన్నవాళ్ళే చూడాల్సిన హార్రర్ మూవీ

OTT Movie : ఆకాశంలో తేలే ఈ ఓడలో ఒళ్ళు తెలియకుండా ఆ పనులు… మస్త్ మసాలా స్టఫ్… ఈ మూవీని చూస్తే నిద్ర పట్టడం కష్టమే

Big Stories

×