Driver Subramaniam Case: ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన పొలిటికల్ కేసుల్లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు ఒకటి. ఈ కేసు విచారణకు న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో సిట్ విచారణ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో నిందితుడు ఎమ్మెల్యే అనంతబాబు భార్య రాజ్యలక్ష్మికి సిట్ నోటీసులు ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు స్పీడుగా సాగుతుందా? ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఇవే ప్రశ్నలు బాధితులను వెంటాడుతోంది.
వైసీపీ హయాంలో సంచలనం రేపిన కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఒకటి. డ్రైవర్‌ని హత్య చేసిన నిందితులు ఆ మృతదేహాన్ని అతడి ఇంటికి డెలివరీ చేశారు. ఈ కేసు విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు కావడం, ఆ తర్వాత బెయిల్‌పై బయట ఉన్నాడు. న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు విచారణ మళ్లీ మొదలుపెట్టారు పోలీసులు.
ఈ నేపథ్యంలో నిందితుడు అనంతబాబు భార్య రాజ్యలక్ష్మికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు హాజరుకావాలన్నది అందులోని మెయిన్ పాయింట్. అయితే ఏ కోణంలో ఆమెని విచారించనున్నా రనేది అసలు పాయింట్. డ్రైవర్ హత్యకు కీలకమైన విషయాలు అనంతబాబు ఐఫోన్‌లో ఉన్నాయట. అది ఓపెన్‌కు పాస్‌వర్డ్ అడ్డంకిగా మారింది.
ఈ నేపథ్యంలో నిందితుడి భార్యకు నోటీసులు ఇచ్చారని అంటున్నారు పోలీసులు. అనంతబాబు అరెస్ట్ సమయంలో ఆయన ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫోన్ పాస్‌వర్డ్‌ను దర్యాప్తు అధికారులు తీసుకోలేదు. ఇప్పటికీ అది చిక్కు సమస్యగా మారింది. అది ఓపెన్ అయితే అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.
ALSO READ: తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. వారందరికీ ఉచిత విద్యుత్
డ్రైవర్ హత్యకు ముందు, ఆ తర్వాత అనంతబాబు ఎవరితో మాట్లాడారు? ఈ ఘటన విషయంలో ఎవరికైనా వాట్సాప్ కాల్స్ చేశాడా? ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందిన అధికారులు అనంతబాబు ఫోన్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
గతంలో మారిదిగా అనంతబాబు.. తెలీదు, మరిచిపోయాను, గుర్తు లేదని చెప్పుకుంటూ వస్తారా? ఏం జరిగింది అన్నవిషయాలు బయటపెడతారా? అనేది తేలనుంది. కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని గంపెడంత ఆశతో ఉంది బాధిత కుటుంబం.