Mahabubnagar Incident: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న యశోద (36) అనే మహిళ తన మూడేళ్ల కుమార్తెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం, ఆమె ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. దీని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం, యశోద గత నెల రోజుల క్రితం తన ఇంటి ముందు ఆరబోసిన పల్లీలను ఒక వీధి కుక్క తినడం చూసింది. ఆ కుక్కను అదిలించి, ఆ పల్లీలను కడిగి తిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వల్ల ఆమెకు రేబిస్ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. రేబిస్ వ్యాధి కారణంగా ఆమె మతిస్థిమితం కోల్పోయి, ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ వ్యాధి మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ఇది ఆమె చర్యలకు కారణం కావచ్చని పోలీసులు చెప్పారు.
స్థానికులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, ఎస్ఐ విజయ్ భాస్కర్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన
మూడేళ్ల చిన్నారిని ఊపిరాడకుండా చేసి చంపేసిన తల్లి
కూతురిని చంపి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి యశోద
రేబిస్ వ్యాధి సోకడంతో మతిస్థిమితం కోల్పోయి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం pic.twitter.com/j8mrKeUDeS
— BIG TV Breaking News (@bigtvtelugu) August 25, 2025