OTT Movie : నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఒక తమిళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా, డిజిటల్ స్ట్రీమింగ్ కి మరో రెండు రోజుల్లో రాబోతోంది. కొడైకానల్ లోని ఒక కొండా ప్రాంతంలో జరిగే ఈ స్టోరీ ఉత్కంఠభరితమైన సీన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ స్టోరీ ఒక జంటతో మొదలై, ఉహించని మలుపులు తిరుగుతుంది. ఈసినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఏ ఓటీటీలో అంటే
‘గెవి’ (Gevi) తమిళ్ ధయాళన్ దర్శకత్వంలో రూపొందిన ఒక సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. ఇందులో షీలా రాజ్‌కుమార్ (మంధరై), ఆదవన్ (మలైయన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జులై 18న ఈ సినిమా థియేటర్లలో విడుదలై, ఆగస్టు 27 నుండి SunNXTలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. 2 గంటల 13 నిమిషాల నిడివి ఉన్న ఈసినిమా IMDbలో 9.2/10 రేటింగ్ ని పొందింది.
కథలోకి వెళ్తే
ఈ కథ కొడైకానల్ సమీపంలో ఉండే వెల్లగెవి అనే కొండ గ్రామంలో ప్రారంభమవుతుంది. ఈ గ్రామంలో రోడ్లు, ఆసుపత్రులు, ఇతర కనీస సౌకర్యాలు ఏమీ ఉండవు. రోజువారీ అవసరాలు, వైద్య సహాయం కోసం కొడైకానల్ పట్టణానికి చేరుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. వీటి కోసం గ్రామస్థులు ప్రతిరోజూ గంటల తరబడి కొండలు దాటి, అడవులు గుండా నడవాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో మంధరై (షీలా రాజ్‌కుమార్), మలైయన్ (ఆదవన్) అనే జంట ఉంటారు. మంధరై ప్రస్తుతం గర్భిణీగా ఉంటుంది. వీళ్ళు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలతో జీవిస్తుంటారు.
ఒక వర్షపు రాత్రిలో ఉన్నట్టుండి మంధరైకి తీవ్రమైన ప్రసవ నొప్పులు మొదలవుతాయి. గ్రామంలో ఆసుపత్రి లేదు, రవాణా సౌకర్యాలు లేవు. గ్రామస్థులు ఒక చెక్కబల్ల మీద మంధరైని కొండ దిగువకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ దృశ్యం గ్రామస్థుల దుర్భర జీవన పరిస్థితులను హైలైట్ చేస్తుంది. ఈ సన్నివేశంలో, వర్షంలో టార్చ్ లైట్ల కింద, గ్రామస్థులు మంధరైని రక్షించడానికి చేసే ప్రయత్నాలు హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఇస్తాయి.
అదే సమయంలో కొండచరియు విరిగిపడటం వల్ల గ్రామంలో కొందరు చనిపోతారు. ఇది గ్రామస్థుల కోపాన్ని మరింత రగిలిస్తుంది. వీళ్లంతా పోలీసులు, రాజకీయ నాయకులపై తిరుగుబాటు చేస్తారు. అయితే ఈ తిరుగుబాటు వారి జీవితాలను మరింత కష్టతరం చేస్తుంది. ఈ సమయంలో మలైయన్, తన భార్య, గ్రామం కోసం న్యాయం కోరుతూ, అవినీతి పోలీసు అధికారి చార్లెస్ కుట్రలో చిక్కుకుంటాడు. మలైయన్ తన భార్యను ఆసుపత్రికి చేర్చడానికి ప్రయత్నిస్తూనే, పోలీసుల నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో మంధరై ఆసుపత్రికి చేరుకుంటుందా ? మలైయన్ పోలీసు హింస నుండి తప్పించుకుంటాడా ? గ్రామస్తుల కష్టాలు తీరుతాయా ? అనే విషయాలకు ఆడియన్స్ బుర్ర గిర్రున తిరుగుతుంది. ఈ సమాధానాలను మీరుకూడ తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : అర్ధరాత్రి హఠాత్తుగా ఊడిపడే దెయ్యాలు… రక్తం ఏరులై పారే పండగ… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ