E-Paper
Advertisement

‘హీరామండి 2’ స్టోరీని లీక్ చేసిన హీరోయిన్… మాములుగా లేదుగా

‘హీరామండి 2’ స్టోరీని లీక్ చేసిన హీరోయిన్… మాములుగా లేదుగా
Advertisement

Heeramandi Season 2 : సినిమా ప్రపంచం చాలా సార్లు చరిత్రను కొత్త కోణంలో చూపిస్తుంది. అలాంటి ఒక భారీ సిరీస్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌ లో వచ్చి అందరినీ అలరించింది. ‘హీరామండి: ది డైమండ్ బజార్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. లాహోర్‌ లోని వేశ్యల జీవితాలు, వాళ్ల సంఘర్షణలు, కళ, దేశభక్తి… ఇలాంటి అంశాలన్నింటినీ అందంగా చూపించిన ఈ సిరీస్ విడుదలైన వెంటనే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్ అయింది. ఎనిమిది ఎపిసోడ్‌ ల సీజన్ 1 ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు సీజన్ 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో నటించిన ఓ నటి సిరీస్ రిలీజ్ కాకుండానే స్టోరీని లీక్ చేసింది.

సీజన్ 2లో ఏముంది?

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ వంటి నటీమణులు తమ పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించారు. వేశ్యలుగా ఉన్న ఈ మహిళలు దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్‌ వాళ్ళకు వ్యతిరేకంగా ఎలా పోరాడారో మొదటి సీజన్‌ లో చూపించారు. ఇప్పుడు సీజన్ 2లో కథ మరింత ఆసక్తికరంగా మారబోతోంది.

Advertisement

ఈ సిరీస్ లో సైమా పాత్ర పోషించిన నటి శృతి శర్మ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, సీజన్ 2 స్క్రిప్టింగ్ వేగంగా జరుగుతోందని చెప్పింది. ఈ సీజన్‌ లో వేశ్యలు తమ పాత వ్యభిచార గృహాలను వదిలి సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టిన కాలంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. ఆ రోజుల్లో సినిమాల్లో పని చేయడం సమాజం అంగీకరించేది కాదు. అయినా ఈ మహిళలు తమ ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి, నేపథ్య గాయకులుగా, అగ్ర కథానాయికలుగా ఎదిగారు. ఈ పరివర్తన, పోరాటం, సంఘర్షణలను సీజన్ 2లో అందంగా చూపించనున్నారు. సమాజం మహిళలపై చూపించే కఠోరత్వం, దోపిడీ, వేధింపులు.. ఇవన్నీ ఈ సిరీస్‌లో బలంగా ఉండబోతున్నాయి. ఇప్పటికీ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సిరీస్ లో మనసుకు హత్తుకునేలా చూపించబోతున్నారు.

మనీషా కొయిరాలా గ్రాండ్ కమ్‌బ్యాక్

మొదటి సీజన్‌ లో మల్లికా జాన్ పాత్రలో మనీషా కొయిరాలా ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చిన ఆమె రాజసం, శక్తివంతమైన నటనతో ఆడియన్స్ ను మెప్పించింది. సంజయ్ లీలా భన్సాలీ ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, సీజన్ 2 కోసం సెట్స్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీజన్ 2 లోని కొత్త కోణం, కొత్త ట్విస్టులు ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెంచేస్తున్నాయి. ‘హీరామండి సీజన్ 1’ ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో వీక్షించబడి భారీ విజయం సాధించింది. సీజన్ 2 కూడా అంతే ఘనంగా రానుందని అందరూ ఆశిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ స్టైల్‌లో వచ్చే ఈ సిరీస్ మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Also Read : స్పోర్ట్స్ అంటే చెవికోసుకుంటారా ? హాట్ స్టార్ లో ఉన్న ఈ బెస్ట్ స్పోర్ట్స్ బయోపిక్ లు మీకోసమే

Tags

Related News

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

Big Stories

Advertisement
×